ఓ ఆమ్లెట్ ఎంతపని చేసింది.. కోడలి ప్రాణాలు తీసింది, అత్తను జైలుకు పంపేలా ఉంది

Published : Jul 14, 2026, 01:27 PM IST

Crime News : ఓచోట ఎగ్ ఆమ్లెట్ మహిళ ప్రాణాలు తీసింది… ఇంకోచోట కోడిగుడ్లు ఇంకొకరి ప్రాణాలు బలితీసుకున్నాయి. ఈ దారుణ ఘటనలకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..

PREV
14
శ్రీకాాకుళంలో గృహిణి సూసైడ్

ఈ కలికాలంలో మానవ బంధాలు మరీ పలుచబడుతున్నాయి... చిన్నచిన్న విషయాలకే కుటుంబంలో కలహాలు మొదలై రక్తసంబంధీకులు దూరం అవుతున్నారు. ఒకే కడుపున పుట్టినవారే ఆస్తిపాస్తుల కోసం గొడవపడుతున్న సంఘటనలు అనేకం... అలాంటిది మిగతా కుటుంబసభ్యులు మధ్య గొడవల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

అయితే కుటుంబ కలహాలు అనగానే ముందుగా గుర్తుకువచ్చేది అత్తాకోడళ్ల గొడవలు... ఆనాటి నుండి ఈనాటి వరకు కాలం మారినా ఈ అత్తాకోడళ్లు తీరు మాత్రం మారడంలేదు. అత్తపై కోడలు, కోడలిపై అత్త పైచేయి సాధించాలనుకోవడం, పెత్తనం చెలాయించడం ఇప్పటికీ కొనసాగుతోంది. అయితే కొన్నిసార్లు మాటలతో సద్దుమణిగే గొడవలు సైతం ప్రాణాలు తీసుకునే స్థాయికి చేరుతుంటాయి... తాజాగా ఆంధ్ర ప్రదేశ్ లో ఇదే జరిగింది. అత్తాకోడలి మధ్య ఆమ్లెట్ కోసం జరిగిన గొడవ చివరికి ఒకరి ప్రాణాలు తీసింది... మరొకరిని జైలుపాలు చేసేలా ఉంది. మొత్తంగా హ్యాపీగా ఉండే కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది.

24
ఆమ్లెట్ కోసం అత్తాకోడళ్ల గొడవ

శ్రీకాకుళం నగరంలోని ఆదివారంపేటలో కోనాడ నాగరాజు కుటుంబంతో కలిసి నివాసముంటున్నాడు. ఓ బట్టల దుకాణంలో సేల్స్ మెన్ గా పనిచేసే ఇతడు చాలిచాలని జీతంతో కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇతడికి గత ఏడాది షర్మిల (26) తో వివాహం జరిగింది... అప్పటినుండి ఇతడికి మనశ్శాంతి కరువయ్యింది.

పెళ్లయిన నాటినుండి నాగరాజు తల్లి దమయంతి, భార్య షర్మిల గొడవ పడుతూనే ఉన్నారు... ఒకే ఇంట్లో ఉండే ఈ ఇద్దరు పాము ముంగిసల్లా ఉండేవారు. ఒకరంటే ఒకరికి అస్సలు పడేది కాదు... ఇద్దరిలో ఎవరికి సపోర్ట్ చేయాలో తెలియక నాగరాజు మౌనంగా ఉండేవాడు. దీంతో అత్తాకోడలి మధ్య గొడవలు రోజురోజుకి పెరుగుతూ వచ్చాయి.

అయితే జూలై 8న భర్త నాగరాజు కోసం షర్మిల ఓ ఆమ్లెట్ వేసింది... ఇది ఆ కుటుంబంలో ప్రకంపనలు సృష్టించింది. కేవలం భర్తకు మాత్రమే ఆమ్లెట్ వేయడం ఏంటి.. మిగతా కుటుంబసభ్యులకు ఎందుకు వెయ్యలేదు? అని అత్త దమయంతి నిలదీసింది. దీంతో అత్తాకోడలి మధ్య మాటామాటా పెరిగి గొడవ పెద్దదయ్యింది. ఏం చెప్పాలో తెలియన ఎప్పటిలాగే నాగరాజు మౌనంగా ఉండిపోయాడు.

34
ప్రాణంతీసిన ఆమ్లెట్

చిన్న ఆమ్లెట్ కోసం గొడవ జరగడం, ఈ సమయంలో అక్కడే ఉన్న భర్త తనకు సపోర్ట్ చేయకపోవడం షర్మిలను తీవ్రంగా కలచివేసింది. ప్రతిసారి అత్త దమయంతి తనను టార్గెట్ చేస్తోందని భావించిన షర్మిల క్షణికావేశంలో దారుణ నిర్ణయం తీసుకుంది. రాత్రి అందరూ నిద్రపోయిన సమయంలో ఇంట్లోనే ఉరి వేసుకుని షర్మిల ఆత్మహత్యకు పాల్పడింది.

ఉదయం నిద్రలేచిన భర్త నాగరాజుకు భార్య కనిపించలేదు... బయటికి వచ్చి చూడగా ఆమె ఉరికి వేలాడుతూ కనిపించింది. కుటుంబసభ్యులు కూడా షర్మిల మృతదేహాన్నిచూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఆత్మహత్యపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని కిందకు దించి పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్ కు తరలించారు. కుటుంబసభ్యుల నుండి వివరాలు సేకరించి ఆత్మహత్యకు గల కారణాలు తెలుసుకున్నారు.

కోడలి ఆత్మహత్యకు దమయంతి కారణంగా తేలితే ఆమెపై కేసు నమోదయ్యే అవకాశాలున్నాయి.. జైలుకు కూడా వెళ్లవచ్చు. ఇలా ఓ కుటుంబాన్ని ఓ ఆమ్లెట్ చిన్నాభిన్నం చేసింది... తీవ్ర విషాదాన్ని నింపింది.

44
కోడిగుడ్ల కోసం ప్రాణాలు బలి..

కేరళలోనూ ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది... మలప్పురంలో కోడిగుడ్ల కోసం జరిగిన ఓ చిన్న గొడవ ఒకరి ప్రాణం తీసింది. గుడ్లు కొనే విషయంలో మొదలైన వాగ్వాదం చిలికి చిలికి గాలివానలా మారి, చివరికి ఒకరి మరణానికి దారితీసింది.

మున్నియూర్‌లోని ఓ షాపులో ఫైసల్, లతీఫ్ అనే ఇద్దరు గుడ్లు కొనడానికి వెళ్లారు. అక్కడ వాళ్లిద్దరి మధ్య మాట మాట పెరిగింది. లతీఫ్ తన వాహనంపై వెళ్ళిపోతుండగా, ఫైసల్ అతనిపైకి గుడ్లు విసిరాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ పెద్దదైంది. ఈ తోపులాటలో ఫైసల్ కిందపడిపోయి తల రోడ్డుకు బలంగా తాకింది. తలకు బలమైన గాయం కావడంతో అతను అక్కడికక్కడే మరణించాడు. పోలీసులు లతీఫ్‌పై హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories