Chandrababu: ఏపీ ప్రజలకు అదిరిపోయే గుడ్ న్యూస్.. పోలవరం డెడ్‌లైన్ ఫిక్స్.. ఆ జిల్లాకు గోదావరి జలాలు

Published : Jul 14, 2026, 07:42 AM IST

CM Chandrababu Naidu: పోలవరం ప్రాజెక్టును త్వరలోనే పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడానికి డెడ్‌లైన్ ఫిక్స్ చేయడంతో పాటు ఆగస్టు 14న అనకాపల్లికి గోదావరి నీటిని విడుదల చేయనున్నట్టు తెలిపారు.

PREV
15
వెలిగొండ ప్రాజెక్ట్ ఓపెనింగ్ డేట్ ఖరారు.. ఏపీలో స్పీడందుకున్న 36 ప్రాజెక్టుల పనులు

ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు పనులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూపర్ స్పీడ్ పెంచారు. ఈ ప్రాజెక్టును మార్చి 2027 నాటికల్లా వంద శాతం పూర్తి చేసి, ఆంధ్రుల దశాబ్దాల కలను నిజం చేస్తామని చెప్పారు. ఈ ఏడాది ఆగస్టు 14వ తేదీన పోలవరం ఎడమ కాలువ ద్వారా అనకాపల్లి జిల్లాకు గోదావరి జలాలను పంపిస్తామని, అక్కడ నీటికి అఖండ హారతి ఇస్తామని సీఎం ప్రకటించారు. వచ్చే ఏడాది లోగా విశాఖపట్నం సిటీకి కూడా గోదావరి నీటిని తరలించేలా ప్లాన్ చేస్తున్నామన్నారు.

సోమవారం సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు ఏరియాలో పర్యటించారు. ముందుగా ధవళేశ్వరం ప్రాజెక్టుకు కొత్త గేట్లు అమర్చే పనులను ప్రారంభించిన ఆయన, ఆ తర్వాత హెలికాప్టర్ ద్వారా పోలవరం పనులను పరిశీలించారు. అనంతరం క్షేత్రస్థాయిలో ఎర్త్ కమ్ రాక్ ఫిలింగ్ డ్యామ్ గ్యాప్-1, గ్యాప్-2 తో పాటు కరెంట్ తయారు చేసే జలవిద్యుత్ కేంద్రం పనులను కూడా చెక్ చేశారు. ఆ తర్వాత అధికారులతో రివ్యూ నిర్వహించి మీడియా సమావేశంలో మాట్లాడారు.

25
పోలవరంతో ఏపీకి జరిగే భారీ లాభాలివే

పోలవరం ప్రాజెక్ట్ పూర్తయితే ఏపీ రూపురేఖలు మారిపోతాయని చంద్రబాబు వివరించారు. దీనివల్ల ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు, విశాఖ, కృష్ణా, గుంటూరు జిల్లాలకు లైఫ్ లైన్ దొరుకుతుందన్నారు.

• కొత్త సాగునీరు: 7.2 లక్షల ఎకరాలకు కొత్తగా సాగునీరు అందుతుంది.

• ఆయకట్టు స్థిరీకరణ: 23.5 లక్షల ఎకరాల పాత ఆయకట్టు సేఫ్ అవుతుంది.

• తాగునీరు: దాదాపు 28.5 లక్షల మందికి స్వచ్ఛమైన తాగునీరు అందుతుంది.

• పరిశ్రమలు, విద్యుత్: పారిశ్రామిక అవసరాల కోసం 23.44 టీఎంసీల నీటిని వాడుకోవచ్చు. అలాగే 960 మెగావాట్ల కరెంట్ తయారు చేసే హైడ్రో ప్రాజెక్ట్ కూడా రెడీ అవుతుంది. హైబ్రిడ్ మోడల్‌లో పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్లాంట్ అవకాశాలను కూడా పరిశీలించాలని అధికారులకు చెప్పారు.

35
గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే డ్యామేజ్.. మేం వచ్చాకే స్పీడందుకుంది

గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుపై తీవ్ర నిర్లక్ష్యం చూపిందని చంద్రబాబు మండిపడ్డారు. 2019 నాటికే తాము 72 శాతం పనులను పూర్తి చేశామని, కానీ ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించి ప్రాజెక్టును పాడుచేసిందని ఆరోపించారు. టెండర్లు రద్దు చేయొద్దని పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ (PPA) మొత్తుకున్నా వినకుండా రివర్స్ టెండరింగ్ డ్రామాలు ఆడారని దుయ్యబట్టారు.

రూ.440 కోట్లతో కట్టిన డయాఫ్రం వాల్ దెబ్బతిన్నా గత ప్రభుత్వం పట్టించుకోలేదని, ఇప్పుడు దాన్ని మళ్లీ కట్టాల్సి వచ్చిందని వాపోయారు. ప్రస్తుతం ఆ డయాఫ్రం వాల్‌పైనే ఈసీఆర్‌ఎఫ్ (ECRF) కట్టడం జరుగుతోందని చెప్పారు. గత ఐదేళ్లలో కేవలం 2 శాతం పనులు జరిగితే, తమ కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ రెండు సంవత్సరాల కాలంలోనే 15 శాతం పనులు పూర్తి చేసి రూ.7,100 కోట్లు ఖర్చు పెట్టిందని చెప్పారు. ప్రస్తుతం ఓవరాల్‌గా 89 శాతం పనులు పూర్తయ్యాయని సీఎం తెలిపారు. తాము ఇప్పటివరకు 136 సార్లు రివ్యూ చేసి, 37 సార్లు నేరుగా పోలవరం విజిట్ చేశామని గుర్తుచేశారు.

45
సెప్టెంబర్ 1న వెలిగొండ ప్రాజెక్ట్ ఓపెనింగ్

మరో కీలక ప్రాజెక్ట్ అయిన వెలిగొండ మొదటి దశ పనులను పూర్తి చేసి, సెప్టెంబరు 1వ తేదీన జాతికి అంకితం చేస్తామని చంద్రబాబు అనౌన్స్ చేశారు. గతంలో పనులు కాకుండానే టన్నెల్ బోరింగ్ మిషన్ కూడా బయటకు తీయకుండా ప్రాజెక్ట్ పూర్తి అయిపోయిందని జనాన్ని మోసం చేశారని విమర్శించారు. ఏపీ వ్యాప్తంగా తాము గుర్తించిన 36 ప్రధాన సాగునీటి ప్రాజెక్టులను మూడేళ్లలో కంప్లీట్ చేస్తామని చెప్పారు. ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి ద్వారా అనకాపల్లి, విశాఖకు గోదావరి నీళ్లు ఇచ్చి, ఆ తర్వాత గోదావరి-నాగావళి నదుల అనుసంధానం చేస్తామని రూట్ మ్యాప్ ఇచ్చారు.

పోలవరంలో 194 టీఎంసీల నీటిని నిల్వ చేసుకోవచ్చని, వరదలు వచ్చినప్పుడు మరో 200 టీఎంసీల నీటిని వాడుకునే ఛాన్స్ ఉంటుందని చెప్పారు. స్పిల్‌వే, రేడియల్ గేట్లు, కాఫర్ డ్యాం పనులు ఆల్రెడీ పూర్తయ్యాయన్నారు. కుడి కాలువ ఎర్త్‌వర్క్ 100%, ఎడమ కాలువది 99% పూర్తయింది. ఇరిగేషన్ టన్నెల్ పనులు కూడా వంద శాతం అయ్యాయని వివరించారు.

55
నిర్వాసితులకు అన్యాయం జరగనివ్వం.. ప్రతి జిల్లాకు రూ.2 కోట్లు

పోలవరం కోసం సర్వం కోల్పోయిన ముంపు బాధితులకు ఎలాంటి అన్యాయం జరగనివ్వమని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ప్రాజెక్ట్ కోసం 94,152 ఎకరాల ల్యాండ్ సేకరించాల్సి ఉండగా, అక్టోబర్ 2026 నాటికి ల్యాండ్ ఎక్విజిషన్ పూర్తి చేస్తామన్నారు. పునరావాసం కింద ఇప్పటికే 17,500 ఫ్యామిలీలను సేఫ్ ప్లేస్‌కు షిఫ్ట్ చేశామని, 2027 మార్చి నాటికి మిగిలిన వాళ్లను కూడా తరలిస్తామన్నారు. బాధితుల కోసం 17,118 ఇళ్ల నిర్మాణం పూర్తయింది. ఇల్లు కట్టుకోవడానికి సైట్ కొనేవారికి అదనంగా రూ.2 లక్షల సపోర్ట్ ఇస్తున్నట్లు చెప్పారు.

రాష్ట్రంలో వాటర్ ప్రాబ్లమ్‌కు పర్మనెంట్ సొల్యూషన్ చూపేందుకు రూ.3,300 కోట్లతో 'జలధార-జలహారతి' పనులను స్టార్ట్ చేశామని, చిన్న పనుల అడ్జస్ట్‌మెంట్ కోసం ప్రతి జిల్లాకు రూ.2 కోట్లు కేటాయిస్తున్నామని చంద్రబాబు చెప్పారు. ప్రతి ఊరిలో వర్షపు నీరు వేస్ట్ కాకుండా అండర్‌గ్రౌండ్ వాటర్ లెవెల్స్ పెంచేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ రివ్యూ మీటింగ్‌లో మంత్రులు నిమ్మల రామానాయుడు, కొలుసు పార్థసారథి సహా పలువురు ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు.

Read more Photos on
click me!

Recommended Stories