Tirumala: నాలుగున్న‌ర గంటల్లోనే తిరుప‌తికి వెళ్లొచ్చు.. కొత్త వందే భార‌త్ వ‌చ్చేస్తోంది.

Published : Jul 13, 2025, 08:41 AM IST

తిరుమ‌ల శ్రీవారి భ‌క్తుల‌కు శుభ‌వార్త‌. ఇక‌పై ఆ ప్రాంత ప్ర‌జ‌లు కేవ‌లం నాలుగున్న‌ర గంట‌ల్లోనే తిరుప‌తికి చేరుకోవ‌చ్చు. ఇందులో భాగంగానే కొత్త వందే భార‌త్ రైలును ప్రారంభించేందుకు అధికారులు సిద్ధ‌మ‌వుతున్నారు. ఇంత‌కీ ఏ రూట్‌లో అందుబాటులోకి రానుందంటే. 

PREV
16
విజయవాడ-బెంగళూరు మధ్య కొత్త వందే భారత్ ట్రైన్

తెలుగు రాష్ట్రాలకు మరో వేగవంతమైన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ అందుబాటులోకి రానుంది. ఇప్పటి వరకూ నడుస్తున్న వందే భారత్ రైళ్లకు ప్రజల నుంచి మంచి స్పందన రావడంతో, రైల్వే శాఖ మరో నూతన ట్రైన్‌ను ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. ఈసారి విజయవాడ నుంచి బెంగళూరుకు తిరుపతి మీదుగా ప్రయాణించేలా రూట్‌ను ఖరారు చేశారు.

26
ఆమోదం ల‌భించినా..

నిజానికి ఈ కొత్త వందే భారత్‌కు కొన్ని నెలల క్రితమే ఆమోదం లభించినప్పటికీ, కోచ్‌లు అందుబాటులో లేకపోవడం వల్ల ప్రారంభంలో కొంత ఆలస్యం జరిగింది. ఇప్పుడు అవసరమైన ఏర్పాట్లన్నీ పూర్తి చేయడంతో, ట్రైన్‌ను పట్టాలెక్కించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.

36
త‌గ్గ‌నున్న ప్ర‌యాణ స‌మ‌యం

ఈ వందే భారత్ రైలు ద్వారా విజయవాడ నుంచి బెంగళూరుకు కేవలం 9 గంటలలోపు చేరుకోవచ్చు. అలాగే తిరుపతికి నాలుగు గంటల 30 నిమిషాల్లో ప్రయాణించవచ్చు. ఇది ఇతర సాధారణ రైళ్లతో పోలిస్తే 3 గంటల సమయాన్ని ఆదా చేస్తుంది. ప్రత్యేకించి, తిరుపతికి వెళ్తున్న భక్తులకు ఇది మరింత ప్రయోజనం కలిగించేలా ఉంటుంది. విజ‌య‌వాడ చుట్టుప‌క్క‌ల ప్రాంతాల నుంచి తిరుప‌తి వెళ్లే వారికి ఇది ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని అధికారులు భావిస్తున్నారు.

46
వారానికి ఆరు రోజులు సేవలు

ఈ ట్రైన్‌లో మొత్తం 8 బోగీలు ఉంటాయి. అందులో 7 AC చెయిర్ కార్లు, 1 ఎగ్జిక్యూటివ్ చెయిర్ కార్ ఉంటుంది. మంగళవారం మినహా వారానికి 6 రోజులు ఈ వందే భారత్ రైలు నడవనుంది. విజయవాడ నుంచి బెంగళూరు వరకు నడిచే వందే భారత్‌ ట్రైన్‌కు 20711 నంబర్ కేటాయించగా, తిరుగు ప్రయాణానికి 20712 నంబర్ నిర్ణయించారు.

56
స‌మ‌యాలు

విజ‌య‌వాడ నుంచి ఉద‌యం 5:15 గంట‌ల‌కు ఈ రైలు బ‌య‌లుదేరుతుంది. తెనాలికి 5:39, ఒంగోలు: 6:28, నెల్లూరు 7:43గా తిరుప‌తికి ఉద‌యం 9:45 గంట‌ల వ‌ర‌కు చేరుకుంటుంది. ఇక చిత్తూరుకు 10:27, కాట్పాడి: 11:13, కృష్ణరాజపురంకు మ‌ధ్యాహ్నం 1:38 గంట‌ల‌కు చేరుకుంటుంది. బెంగ‌ళూరుకు వేళ్లే స‌రికి మ‌ధ్యాహ్నం 2.15 గంట‌లు అవుతుంది.

66
తిరుగు ప్ర‌యాణ స‌మ‌యం

ఇక తిరుగు ప్ర‌యాణం విష‌యానికొస్తే ఈ రైలు బెంగ‌ళూరులో మ‌ధ్యాహ్నం 2:45 గంట‌ల‌కు బ‌య‌లుదేరుతుంది. కృష్ణరాజపురంకు 2:58, కాట్పాడికి 5:23, చిత్తూరు 5:49, తిరుపతి 6:55, నెల్లూరు 8:18, ఒంగోలు 9:29, తెనాలి 10:42 మీదుగా రాత్రి 11.45 గంట‌ల‌కు విజ‌య‌వాడ చేరుకుంటుంది.

Read more Photos on
click me!

Recommended Stories