Janasena: డ్రైవర్ హత్యకేసులో కోట వినుతను సస్పెండ్ చేసిన జనసేన.. ఏ జరిగింది?

Published : Jul 12, 2025, 05:50 PM IST

Janasena: డ్రైవర్ హత్యకేసులో అరెస్టైన శ్రీకాళహస్తి జనసేన ఇంఛార్జి కోట వినుతను ఆ పార్టీ బహిష్కరించింది. ఆమె భర్తతోపాటు మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

PREV
16
కోట వినుతకు జనసేన షాక్

శ్రీకాళహస్తి జనసేన ఇంఛార్జి కోట వినుత తన మాజీ డ్రైవర్ రాయుడు హత్య కేసులో అరెస్టయ్యారు. చెన్నై పోలీసులు విచారణలో కీలక ఆధారాలతో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీ హైకమాండ్ తక్షణమే ఆమెను పార్టీ నుంచి బహిష్కరించింది. దీనికి సంబంధించి ప్రకటనలు జారీ చేసింది.

26
అసలు ఏం జరిగింది? నమ్మిన బంటును హత్య చేశారా?

తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గానికి చెందిన జనసేన ఇంఛార్జి కోట వినుతపై సంచలన ఆరోపణలు వచ్చాయి. ఆమె వద్ద కొన్ని సంవత్సరాలుగా డ్రైవర్‌గా పని చేసిన బొక్కసంపాలెం గ్రామానికి చెందిన శ్రీనివాసులు అలియాస్ రాయుడు ఇటీవల చెన్నైలో హత్యకు గురయ్యారు. మృతదేహాన్ని కూవం నదిలో పడేసినట్లుగా చెన్నై పోలీసులు నిర్ధారించారు. విచారణలో ఈ హత్యకేసులో కోట వినుత, ఆమె భర్త చంద్రబాబు, మరో ముగ్గురు నిందితులుగా తేలారు.

36
హత్యకు ముందు ఏం జరిగింది?

జూన్ 21న కోట వినుత పత్రికల ద్వారా, సోషల్ మీడియాలో ఒక ప్రకటన విడుదల చేస్తూ.. రాయుడును విధుల నుంచి తొలగించినట్లు తెలిపారని మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. అతను ద్రోహానికి పాల్పడ్డాడని ఆరోపిస్తూ ఇకపై తమతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈ ప్రకటన తరువాత కొద్ది రోజుల్లోనే చెన్నైలో గుర్తు తెలియని మృతదేహం బయటపడటం, మృతుడి చేతిపై జనసేన గుర్తు, వినుత పేరు ఉండటం విచారణకు దారి తీసింది.

46
పోలీసుల దర్యాప్తు: కీలక ఆధారాలు లభ్యం

చెన్నై మింట్ పోలీస్ స్టేషన్ పరిధిలో మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు, పోస్టుమార్టం నివేదిక ఆధారంగా హత్యని నిర్ధారించారు. అనంతరం సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా విచారణ ముమ్మరం చేశారు.

రాయుడిని తీవ్ర హింసలకు గురిచేసి హత్య చేసినట్లు, ఆపై మృతదేహాన్ని కూవం నదిలో పడేసినట్లు తేల్చారు. నిందితులుగా గోపి, శివకుమార్, దస్తసాలను అరెస్ట్ చేసి వారి ఇచ్చిన సమాచారంతో వినుత, ఆమె భర్తను అదుపులోకి తీసుకున్నారు.

56
జనసేన పార్టీ స్పందన ఏంటి?

ఈ హత్యకేసు వెలుగులోకి రాగానే, జనసేన పార్టీ హైకమాండ్ తీవ్రంగా స్పందించింది. కోట వినుతను పార్టీ విధానాలకు భిన్నంగా వ్యవహరిస్తున్నారనీ, గత కొంతకాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంచినట్టు తెలిపింది. తాజా అరెస్ట్ నేపథ్యంలో ఆమెను తక్షణమే పార్టీ నుంచి బహిష్కరించినట్టు అధికారిక ప్రకటన విడుదల చేసింది.

66
రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపిన వినుత అరెస్టు

కోట వినుత అరెస్ట్‌ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. జనసేన నాయకురాలిగా ఉన్న ఆమెపై వచ్చిన తీవ్ర ఆరోపణలు పార్టీ ప్రతిష్టను దెబ్బతీశాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇటీవలి కాలంలో పార్టీకి చెందిన కొంతమంది ఇంఛార్జ్‌లు వివాదాల్లో చిక్కుకోవడంతో, జనసేన అంతర్గత క్రమశిక్షణపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. శ్రీనివాసులు అలియాస్ రాయుడు హత్య కేసు మరింత లోతైన దర్యాప్తు తర్వాత ఇంకా ఎన్నో మలుపులు తిరుగుతుందో చూడాలి.

Read more Photos on
click me!

Recommended Stories