Iran Israel War : ఇండియాను తాకిన ఇరాన్-ఇజ్రాయెల్ వార్ సెగ.. విశాఖవాసులు బిగ్ షాక్

Published : Mar 05, 2026, 10:24 AM IST

IRIS Dena : ఇరాన్ యుద్దనౌక ‘IRIS Dena’ పై అమెరికా దాడి విశాఖ వాసులను షాక్ కు గురిచేసింది. కొద్దిరోజుల క్రితమే ఈ నగరంలో సరదాగా గడిపిన ఇరాన్ నేవీ సిబ్బంది మరణవార్తతో ప్రజలు దిగ్భ్రాంతికి గురయ్యారు.  

PREV
15
ఇండియా తీరంలో ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ద వాతావరణం...

Iran Israel War : అమెరికా సాయంతో ఇజ్రాయెల్ సైనిక బలగాలు ఇరాన్ పై భీకర దాడులు జరుపుతున్నాయి. ఇప్పటికే ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీని ఇజ్రాయెల్, అమెరికా బలగాలు మట్టుబెట్టాయి. అంతటితో ఆగకుండా ఇరాన్ సైన్యాన్ని నిర్వీర్యం చేసేందుకు వైమానిక స్థావరాలు, యుద్దనౌకలు, ఆర్మీ క్యాంపులపై బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. ఈ క్రమంలో భారత్, శ్రీలంక మధ్యగల హిందూ మహాసముద్రంలో ఇరాన్ యుద్దనౌకపై అమెరికా దాడిచేసింది... ఈ ఘటనలో విశాఖపట్నంలో విషాదాన్ని నింపింది.

25
విశాఖపట్నం నుండి తిరిగి వెళుతుండగా ఘోరం...

గత నెల ఫిబ్రవరిలో ఇరాన్ కు చెందిన 'IRIS Dena' యుద్దనౌక భారతదేశానికి చేరుకుంది. ఆంధ్ర ప్రదేశ్ లోని విశాఖపట్నంలో జరిగిన నేవీ కార్యక్రమాలు IFR 2026 (ఇంటర్నేషనల్ ప్లీట్ రివ్యూ), MILAN 2026 లో అనేక దేశాలు పాల్గొన్నాయి. అమెరికాతో పాటు ఇరాన్ నేవీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి.

అయితే ఈ నేవీ పరేడ్ ఇలా ముగిసిందో లేదో అలా ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య అలజడి రేగింది. అమెరికా ఎంట్రీతో ఇరుదేశాల మధ్య యుద్దం ప్రారంభమయ్యింది. ఈ క్రమంలోనే విశాఖపట్నంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఇరాన్ యుద్దనౌక తిరిగి వెళుతుండగా అమెరికా జలాంతర్గామి దాడికి పాల్పడింది. దీంతో యుద్దనౌక ధ్వంసమై నీటమునిగింది… ఇందులోని ఇరాన్ నావికాదళ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు... కొంతమందిని శ్రీలంక సైన్యం కాపాడినట్లు తెలుస్తోంది.

35
విశాఖవాసుల దిగ్భ్రాంతి...

ఇంటర్నేషనల్ నేవీ కార్యక్రమంలో భాగంగా ఇరాన్ కు చెందిన ''ఐఆర్ఐఎస్ దేనా'' యుద్దనౌక విశాఖపట్నంలో చాలారోజులు ఉంది. ఇందులో 180 మంది ఇరాన్ నేవీ సిబ్బంది ఉన్నారు. వీళ్లంతా ''మిలాన్ 2026'' కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు విశాఖలో సరదాగా గడిపారు. నగరంలోని బీచ్, గ్లాస్ బ్రిడ్జి వంటి పర్యాటక ప్రాంతాలను సందర్శించారు... వీరితో స్థానికులు సెల్ఫీలు, ఫోటోలు దిగారు. ఇంతలోనే యుద్దనౌకపై దాడి, ఇరాన్ నేవీ సిబ్బంది మరణవార్త విని విశాఖవాసులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

విశాఖవాసులు ఇరాన్ నేవీ సిబ్బందితో ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. దీంతో ఇరాన్ నేవీ సిబ్బంది విశాఖ పర్యటన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొద్దిరోజుల క్రితం తమ కళ్లముందు కనిపించినవారు ఇప్పుడు లేరని తెలిసి విశాఖ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

45
ఇరాన్ యుద్దనౌకపై దాడిలో 87 మంది మరణం...

ఇరాన్ యుద్దనౌక 'ఐఆర్ఐఎస్ దేనా' శ్రీలంక తీరంలో మునిగిపోయింది. ఈ యుద్దనౌకపై దాడి తామే చేశామని ఇప్పటికే అమెరికా ప్రకటించింది. ఈ నౌక ప్రమాదానికి గురయిన సమయంలో మొత్తం 180 మంది సిబ్బంది ఉన్నారు... వీరిలో ఇప్పటివరకు 87 మంది మరణించినట్లు తెలుస్తోంది.

ఇరాన్ యుద్దనౌక ప్రమాదంపై సమాచారం అందినవెంటనే శ్రీలంక నేవీ అలర్ట్ అయ్యింది... వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. ఇలా ఇరాన్ నేవీ సిబ్బందిలో 32 మందిని కాపాడినట్లు తెలుస్తోంది. మిగతావారి ఆచూకీ తెలుసుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టినట్లు శ్రీలంక వెల్లడించింది.

55
ఇరాన్ కు సపోర్ట్ గా ఇండియాలో ఆందోళనలు...

ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికా దాడులను భారతదేశంలోని ముస్లిం సామాజికవర్గం ఖండిస్తోంది. ఈ క్రమంలోనే హైదరాబాద్, విశాఖపట్నం సహా దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో ర్యాలీలు, నిరసనలు జరుగుతున్నాయి. ఇలా ఆంధ్రా యూనివర్సిటీ ప్రధాన ద్వారం వద్ద ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ (PDSO) నిరసన చేపట్టింది. ముఖ్యంగా విశాఖ నుండి తిరిగివెళుతున్న ఇరాన్ యుద్దనౌకపై దాడిని తీవ్రంగా ఖండించారు ఈ విద్యార్థి సంఘం నాయకులు. ఇప్పటికైనా ఇరాన్ పై దాడిని ఆపాలని... ప్రపంచ శాంతిని నెలకొల్పాలని కోరారు.

''ఇరాన్ పై దాడులు అణు నియంత్రణ కోసమేనని అమెరికా చెబుతోంది... కానీ ఇది అబద్దం. పశ్చిమాసియాలో చమురు వనరులు, వాణిజ్య మార్గాలను నియంత్రించడం కోసమే అమెరికా ఈ దాడులకు పాల్పడుతోంది. ఇందులో ఇజ్రాయెల్ ను పావుగా వాడుకుంటోంది'' అని PDSO నాయకులు తెలిపారు.

Read more Photos on
click me!

Recommended Stories