Weather : మొంథా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడుతున్నాయి. ఇలాంటి సమయంలో మరోసారి బంగాళాఖాతంలో అల్పపీడనం, వాయుగుండం ఏర్పడే అవకాశాలున్నాయనే IMD ప్రకటన ఆందోళన కలిగిస్తోంది.
Weather Update : సాధారణంగా అక్టోబర్ లో నైరుతి రుతుపవనాలు భారతదేశాన్ని పూర్తిగా విడిచిపెడతాయి.. ఇదే సమయంలో ఈశాన్య రుతుపవనాలు ఎంటర్ అవుతాయి. ఈ సమయంలో సముద్రంలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయి... దీంతో అల్పపీడనాలు, వాయుగుండాలు, తుపానులు ఎక్కువగా ఏర్పడతాయని వాతావరణ నిపుణులు చెబుతుంటారు. అందుకే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మూడునెలల కాలాన్ని తుపానుల సీజన్ అంటారు. అంటే మొంథాతో అయిపోలేదు... ఇంకా తెలుగు రాష్ట్రాలకు తుపానుల గండం పొంచివుందన్నమాట.
26
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం
గత నెలాఖరున మొంథా తుపాను సృష్టించిన బీభత్సాన్ని మర్చిపోకముందే మరోసారి వాతావరణ పరిస్థితులు వర్షాలకు అనుకూలంగా మారుతున్నాయని వెదర్ అప్డేట్స్ ని బట్టి తెలుస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో వారంరోజుల్లో అంటే నవంబర్ 14న అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరిస్తోంది.
36
బంగాళాఖాతంలో వాయుగుండం
ఇలా బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ మరింత బలపడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. రెండ్రోజుల తర్వాత అంటే నవంబర్ 16 నాటికి ఇది వాయుగుండంగా బలపడుతుందట. ఊరటనిచ్చే అంశం ఏంటంటే ఇది తుపానుగా మారే అవకాశాలు తక్కువని వాతావరణ విభాగం చెబుతోంది.
బంగాళాఖాతంలో ఏర్పడే ఈ అల్పపీడనం, వాయుగుండం ప్రభావంతో నవంబర్ 15 నుండి ఆంధ్ర ప్రదేశ్ లో వర్షాలు మొదలయ్యే అవకాశాలున్నాయని IMD అంచనా వేస్తోంది. ముఖ్యంగా కోస్తాంధ్రతో పాటు తమిళనాడు, ఒడిషా, పశ్చిమ బెంగాల్ ప్రాంతాలను వీటి ప్రభావం ఎక్కువగా ఉంటుందని హెచ్చరిస్తోంది. అంటే నవంబర్ లో కూడా భారీ నుండి అతిభారీ వర్షాలు, వరద పరిస్థితులు తప్పవని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
56
ఈ ప్రాంతాల్లో ఈదురుగాలుల బీభత్సం
అల్పపీడనం, వాయుగుండం ప్రభావంతో నవంబర్ 15, 16 తేదీల్లో ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు తీరప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులు వీస్తాయని IMD హెచ్చరిస్తోంది. గంటకు 45 నుండి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని... సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని చెబుతోంది. కాబట్టి మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని... తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ చాలా ముందుగానే హెచ్చరిస్తోంది.
66
తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా
అయితే ప్రస్తుతానికి తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది.. అక్కడక్కడా చిరుజల్లులు మినహా పెద్దగా వర్షాలు లేవు. మెల్లిగా ఉష్ణోగ్రతలు పడిపోతూ చలి తీవ్రత పెరుగుతోంది. తెలంగాణ ఆదిలాబాద్ జిల్లాలో అత్యల్పంగా 14 డిగ్రీ సెంటిగ్రేడ్... ఏపీలో పాడేరు, అరకు ప్రాంతాల్లో కూడా 14 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాబోయే రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగి తెలుగు ప్రజలను గజగజా వణికించనుందని వాతావరణ విభాగాలు హెచ్చరిస్తున్నాయి.