Weather : బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో 5 రోజులు భారీ వర్షాలు.. ఈ ప్రాంతాలకు హెచ్చరికలు

Published : Aug 12, 2025, 05:44 PM IST

Heavy Rains To Andhra Pradesh: బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడుతోంద‌ని భార‌త వాతావ‌ర‌ణ శాఖ (ఐఎండీ) పేర్కొంది. దీంతో ఆంధ్ర‌ప్రదేశ్ లో ఐదు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప‌లు ప్రాంతాల‌కు హెచ్చ‌రిక‌లు జారీ చేసింది.

PREV
15
బంగాళాఖాతంలో అల్పపీడనం

బంగాళాఖాతంలో బుధవారం నాటికి కొత్త అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. అలాగే, స్కైమెట్, ఇతర వాతావరణ సంస్థ‌లు కూడా ఈ విష‌యాన్ని తెలిపాయి.

ఈ అల్పపీడనం త్వరలో వాయుగుండంగా మారి శనివారం నాటికి తీరం చేరుకునే అవకాశం ఉంది. దీని ప్రభావంతో దేశంలోని పలు ప్రాంతాల్లో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది.

DID YOU KNOW ?
ఐఎండీ వర్ష హెచ్చరికలు
IMD నాలుగు రంగుల హెచ్చరికలు జారీ చేస్తుంది. గ్రీన్-వర్షం ప్రమాదం లేదు. యెల్లో-తేలికపాటి అప్రమత్తం. ఆరెంజ్-భారీ వర్షాలకు సిద్ధంగా ఉండాలి. రెడ్-అత్యంత భారీ వర్షాలు, అత్యవసర చర్యలు తీసుకోవాలి.
25
ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు భారీ వర్ష సూచ‌న‌లు

ఈ వారంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో భారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. బుధవారం నుంచి శుక్రవారం వరకు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉంది.

మంగళవారం అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, కోనసీమ, ఏలూరు, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు, గుంటూరు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో వ‌ర్షాలు కురిశాయి.

35
ఏపీలోని ఈ ప్రాంతాల‌కు ఆరెంజ్ అలర్ట్ జారీ

భారీ వ‌ర్షాల క్ర‌మంలో ఇప్ప‌టికే భార‌త వాతావర‌ణ శాఖ (IMD) పల్నాడు, బాపట్ల, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి, కోనసీమ, తూర్పు గోదావరి, అనకాపల్లి, విజయనగరం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలో మీట‌ర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది.

45
ఏపీలోని ప‌లు ప్రాంతాల్లో దంచికొడుతున్న వాన‌లు

కర్నూలు జిల్లా అస్పరి మండలంలో తుమ్మలవాగు పొంగిపొర్లుతోంది. వలగొండ గ్రామంలోకి వరద నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నంద్యాల జిల్లా నందికొట్కూరులో మారుతి నగర్, హాజీ నగర్ పూర్తిగా నీట మునిగాయి. అత్మకూరు సబ్ డివిజన్ పరిధిలోని పలు మండలాల్లో వాగులు పొంగిపొర్లుతున్నాయి. వెలుగోడు దగ్గర మంచినీళ్లవాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.

55
అప్ర‌మ‌త్త‌మైన చంద్రబాబు సర్కారు

భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్త‌మైంది. త‌గిన చ‌ర్య‌లుతీసుకోవాల‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు అధికారుల‌ను ఆదేశించారు. మిడుతూరు మండలంలో చెరువుకట్టకు గండి పడటంతో పంట పొలాలు నీట మునిగాయి.

కర్నూలు జిల్లాలో ఒక ఇల్లు కూలిపోయింది. విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అధికారులు ప్రజలకు అప్రమత్తంగా ఉండాలన్నారు. చెరువులు, వాగుల పరిసర ప్రాంతాల నుంచి దూరంగా ఉండాలని సూచించారు.

Read more Photos on
click me!

Recommended Stories