Weather : తెలుగు రాష్ట్రాల్లో వానలే వానలు ... ఈ రెండ్రోజులు ఆ జిల్లాల ప్రజలు బిఅలర్ట్

Published : May 20, 2025, 07:48 AM ISTUpdated : May 20, 2025, 07:52 AM IST

బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లో ఏర్పడిన అల్పపీడనాలు, అలాగే ఉపరితల ఆవర్తనం,  ద్రోణి, నైరుతి రుతుపవనాలు… ఇలా వాతావరణం మొత్తం వర్షాలకు అనుకూలంగా ఉంది. దీంతో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో మోస్తరు నుండి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయి. 

PREV
15
Telangana, Andhra Pradesh Weather

Rain Alert : తెలుగు రాష్ట్రాల్లో గత రెండ్రోజులుగా ఎండలు తగ్గాయి... ఆకాశం మేఘావృతమై ఉండటంతో వాతావరణం చల్లగా ఉంటోంది. ఇక ఇరు రాష్ట్రాల్లోనూ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి... అక్కడక్కడ భారీ వర్షాలు కూడా కురుస్తున్నాయి. అయితే ఇదే వాతావరణ పరిస్థితి మరికొద్దిరోజులు కొనసాగుతుందని... వర్షాలు మరింత ఎక్కువయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.

పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఆంధ్ర ప్రదేశ్ తీరంవైపు కదులుతోందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక మహారాష్ట్ర నుండి కర్ణాటక వరకు రాయలసీమ మీదుగా ఓ ద్రోణి కొనసాగుతోంది. అరేబియా సముంద్రంలో మరో అల్పపీడనం ఏర్పడింది... ఇది బుధవారం కర్నాటకలో తీరం దాటే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. మరోవైపు నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతూ తెలుగు రాష్ట్రాలవైపు వస్తున్నాయి. వీటన్నింటి ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

25
Andhra Pradesh Rains

ఆంధ్ర ప్రదేశ్ లో భారీ నుండి అతిభారీ వర్షాలు :

ఆంధ్ర ప్రదేశ్ లో ఈ రెండ్రోజులు (మంగళ, బుధవారం) భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ముఖ్యంగా రాయలసీమలో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని... అలాగే ఈదురుగాలులు కూడా బలంగా వీస్తాయని ప్రకటించారు. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ సూచించారు.

35
Telangana Rains

ఇవాళ (మే 20, మంగళవారం) తిరుపతి, నెల్లూరు, కడప, అన్నమయ్య, శ్రీ సత్యసాయి, అనంతపురం, కర్నూల్, నంద్యాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హెచ్చరించారు. ఇక విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో మోస్తరు వర్షపాతం నమోదుకానుందట. తూర్పు, పశ్చిమ గోదావరి, అనకాపల్లి,కోనసీమ, గుంటూరు, పల్నాడు, బాపట్ల, కృష్ణా జిల్లాల్లో కూడా వర్షాలు కురుస్తాయని ప్రకటించారు.

45
Telangana Rains

తెలంగాణలో భారీ వర్షాలు :

తెలంగాణలో కూడా ఈ నాలుగురోజులు మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ (మంగళవారం) వాతావరణం చల్లగానే ఉంటుందని... పలు జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురవొచ్చని అంచనా వేస్తున్నారు.

రాజధాని హైదరాబాద్ నేడు చిరుజల్లులతో చల్లబడే అవకాశాలున్నాయని ప్రకటించారు. అలాగే శివారు ప్రాంతాల్లో కూడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందట. సంగారెడ్డి, వికారాబాద్, కామారెడ్డి, నారాయణపేట, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, గద్వాల జిల్లాల్లో ఈదురుగాలులు, పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించారు. దీంతో తెలంగాణలో 11 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ విభాగం.

55
Rains Alert

తెలుగు రాష్ట్రాల రైతులకు కీలక సూచన :

వర్షాల నేపథ్యంలో ఏపీ, తెలంగాణ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు... వ్యవసాయ పనులు చేసుకోలేని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే వివిధ పంటలు కోసి మార్కెట్ కు తరలించేందుకు సిద్దమైన సమయంలో వర్షాలు మొదలయ్యాయి. దీంతో ధాన్యం తడిసిపోయి పాడయిపోవడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు.. ప్రభుత్వమై తమను ఆదుకుని పంటలు కొనుగోలు చేయాలని వేడుకుంటున్నారు.

ఇక మరికొద్దిరోజులు ఈ వర్షాల కొనసాగే అవకాశాలున్న నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరిస్తోంది. పంటలను కాపాడుకోవడంతో పాటు తమను తాము సురక్షితంగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు. వర్షం కురిసే సమయంలో పొలాలవద్దకు వెళ్లకూడదని.. చెట్ల కింద కూడా ఉండకూడదని చెబుతున్నారు. ఈ కాలంలో పిడుగులు పడే అవకాశం ఎక్కువగా ఉంటాయి... కాబట్టి రైతులు, వ్యవసాయ కూలీలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories