Tirumala : శ్రీవారికి ఐపిఎల్ టీం ఓనర్ అరుదైన కానుక .. ఎంత విలువైందో తెలుసా?

Published : May 17, 2025, 12:49 PM ISTUpdated : May 19, 2025, 03:03 PM IST

ఐపిఎల్ 2025 పున:ప్రారంభానికి ముందు లక్నో సూపర్ జెయింట్స్ టీం యజమాని సంజీవ్ గోయెంక తిరుమల వేంకటేశ్వర స్వామికి దర్శించుకుని బంగారు కవచం కానుకగా సమర్పించారు. శ్రీవారికి సమర్పించిన ఈ కానుక ధర ఎంతో తెలుసా? 

PREV
14
Tirumala : శ్రీవారికి ఐపిఎల్ టీం ఓనర్ అరుదైన కానుక .. ఎంత విలువైందో తెలుసా?
Tirumala Temple

Indian Premier League 2025 :  తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిరోజూ లక్షలాది మంది భక్తులను ఆకర్షిస్తుంది. పండుగలు, సెలవు దినాలలో భక్తులు రెండు మూడు రోజులు వేచి ఉండి స్వామివారిని దర్శించుకుంటారు. దాతల కానుకలతో తిరుపతి ప్రపంచంలోనే అత్యంత ధనిక దేవాలయంగా ప్రసిద్ధి చెందింది.

తాజాగా ఈ దేవాలయాన్ని ఇండియన్ ప్రీమియర్ లీగ్ టీమ్ యజమాని సందర్శించారు. ఇటీవల ఇండియా, పాకిస్థాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో వాయిదాపడ్డ ఐపిఎల్ నేడు (శనివారం మే 17న) పున:ప్రారంభం కానుంది. ఈ సమయంలో లక్నో సూపర్ జెయింట్స్ టీం యజమాని సంజీవ్ గోయెంక తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. 

24
LSG Owner Sanjiv Goenka

శ్రీవారికి ఐపిఎల్ టీం యజమాని ఖరీదైన కానుక : 

ప్రముఖ పారిశ్రామికవేత్త, ఎల్ఎస్జి అధినేత సంజీవ్ గోయెంక కుటుంబ సమేతంగా ఆంధ్ర ప్రదేశ్ లోని తిరుమల దేవాలయాన్ని సందర్శించారు. శ్రీవారిని దర్శించుకున్న ఆయన 5.267 కిలోల బంగారు కవచాలను కానుకగా సమర్పించారు. ఈ బంగారు కానుక విలువ సుమారు 3.63 కోట్ల రూపాయలు.

స్వామివారు కానుకతో ఆలయానికి చేరుకున్న సంజీవ్ గోయెంక కుటుంబానికి దేవస్థానం అధికారులు ఘన స్వాగతం పలికారు. అధికారులు దగ్గరుండి స్వామివారి దర్శనం కల్పించారు. అనంతరం వేద పండితులు తీర్థప్రసాదాలు అందజేసి వేదాశీర్వచనం అందించారు. సంజీవ్ గోయెంక తిరుమల దర్శనం చేసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  

34
IPL 2025

ఇదిలావుంటే ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ టీం 11 మ్యాచులాడి 5 విజయాలు, 6 ఓటములతో 10 పాయింట్లు సాధించింది.  దీంతో పాయింట్స్ టేబుల్లో 7వ స్థానంలో నిలిచింది. ఈ ఐపిఎల్ సీజన్లో ఇంకా 3 మ్యాచులు మాత్రమే మిగిలి ఉన్నాయి... ఈ మూడింటినీ గెలిచినా ఎల్ఎస్జీ ప్లేఆఫ్స్ కు చేరడం కష్టమే.

ఎల్ఎస్జీ టీం వరుస పరాజయాలు చవిచూస్తున్న నేపథ్యంలో సంజీవ్ గోయెంక తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం ఆసక్తికరంగా మారింది. తిరుమల శ్రీవారి కరుణతో అయినా లక్నో టీం గెలుస్తుందా అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

44
IPL 2025

క్రికెట్ అంటే చాలా ఇష్టపడే సంజీవ్ గోయెంక చాలా ఉద్వేగాీనికి లోనవుతాడు. తన జట్టు గెలిస్తే కెప్టెన్ రిషబ్ పంత్‌తో సహా ఆటగాళ్లను అభినందిస్తారు... ఓడిపోతే ఆటగాళ్లపై కోపం ప్రదర్శిస్తారు. 2024 ఐపీఎల్ సీజన్‌లో సంజీవ్ గోయెంక ఆనాటీ ఎల్ఎస్జి కెప్టెన్ కేఎల్ రాహుల్ బహిరంగంగా తిట్టడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 

Read more Photos on
click me!