Free bus travel: గుడ్ న్యూస్ చెప్పిన సీఎం చంద్ర‌బాబు.. ఫ్రీ బ‌స్సు ప్ర‌యాణం ఎప్ప‌టినుంచంటే?

Published : May 17, 2025, 06:07 PM IST

Free bus travel in Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అందుబాటులోకి రానుందని సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఎప్ప‌టి నుంచి ఫ్రీ బ‌స్సు ప్ర‌యాణం ఉంటుందో చెప్పారు. అలాగే, ప‌లు కీల‌క ప్ర‌క‌ట‌న‌లు చేశారు. ఆ వివ‌రాలు గ‌మ‌నిస్తే..   

PREV
15
Free bus travel: గుడ్ న్యూస్ చెప్పిన సీఎం చంద్ర‌బాబు.. ఫ్రీ బ‌స్సు ప్ర‌యాణం ఎప్ప‌టినుంచంటే?
Andhra Pradesh CM Chandrababu Naidu (File Photo/@ncbn)

Free bus travel in Andhra Pradesh: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్ర మహిళల కోసం ఉచిత బ‌స్సు ప్ర‌యాణం పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. భార‌త స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా అంటే ఆగస్టు 15 నుండి రాష్ట్రంలోని మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సేవ‌లు అందిస్తామ‌ని తెలిపారు.

కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలో జరిగిన స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో చంద్ర‌బాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఉచిత బ‌స్సు సేవ‌ల గురించి ఈ ప్రకటన చేశారు.

25
Andhra Pradesh cm Chandrababu Naidu

రాష్ట్రవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణ, శుభ్రత, వ్యవసాయం అభివృద్ధిపై దృష్టి పెట్టనున్నట్లు  చంద్రబాబు చెప్పారు. ప్రతి నెలా మూడో శనివారాన్ని శుభ్రత దినంగా పాటించాలని సూచించారు. ప్రజలు, ఉద్యోగులు ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచాలని పిలుపునిచ్చారు.

35
Chandrababu naidu

రైతు బజార్ల విస్తరణపై ప్ర‌త్యేక‌ దృష్టి

రైతులకు గిట్టుబాటు ధర అందించేందుకు రాష్ట్రంలోని అన్ని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రైతు బజార్లు ఏర్పాటు చేయనున్నట్లు సీఎం చంద్ర‌బాబు ప్రకటించారు. ఇప్పటికే ఉన్న 125 రైతు బజార్లను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు.

కర్నూలులోని సి క్యాంప్ రైతుబజారును రూ.6 కోట్లతో మోడర్న్ హబ్‌గా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. సమీప ప్రాంతంలో అండర్‌గ్రౌండ్ పార్కింగ్‌ సదుపాయం కూడా కల్పిస్తామన్నారు.

45

విశాఖప‌ట్నంలో ఘనంగా యోగా డే వేడుక‌లు 

జూన్‌లో నిర్వహించనున్న యోగా డేను ప్రపంచ స్థాయిలో విశాఖపట్నంలో నిర్వహిస్తామని సీఎం చంద్ర‌బాబు చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారని తెలిపారు. "ప్రతి రోజు అరగంటయినా యోగా చేయాలని ప్రజలను ప్రోత్సహించాలి" అని సూచించారు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో యోగా శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.

55
Chandrababu Pawan kalyan

వాతావరణ పరిరక్షణకు చర్యలు తీసుకుంటాం 

తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి రీసైక్లింగ్‌కు పంపే విధానాన్ని ప్రోత్సహించనున్నట్లు తెలిపారు. ఇప్పటికే రోడ్లపై ఉన్న చెత్తను తొలగించేందుకు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. అక్టోబరు 2 నాటికి రాష్ట్రం మొత్తం చెత్తరహితంగా మారాలన్న లక్ష్యాన్ని వ్యక్తపరిచారు.

Read more Photos on
click me!