తెలుగు యువతకు గుడ్ న్యూస్.. వందలు వేలు కాదు ఏకంగా ఐదులక్షల ఉద్యోగాలు..!

Published : Oct 15, 2025, 06:57 PM IST

IT Jobs : సూపర్ 6 హామీల్లో భాగంగాా యువతకు భారీ ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నామని… భవిష్యత్ లో మరిన్ని ఉద్యోగాలు వస్తాయని ఐటీ మంత్రి నారా లోకేష్ తెలిపారు. వందలు, వేలల్లో కాదు లక్షల్లో ఉద్యోగాల భర్తీ ఉంటుందని ఆసక్తికర ప్రకటన చేశారు. 

PREV
15
ఉద్యోగాలేే ఉద్యోగాలు..

Andhra Pradesh : IT (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) అనగానే ముందుగా గుర్తుకువచ్చేది బెంగళూరు, హైదరాబాద్ లే. అత్యధిక ఐటీ కంపెనీలను కలిగి సమాచార సాంకేతిక సేవల్లో దేశానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిపెట్టాయి ఈ దక్షిణాది నగరాలు. ఇప్పుడు వీటి సరసన నిలిచేందుకు విశాఖపట్నం కూడా సిద్దమవుతోంది. హైదరాబాద్ లో ఐటీ విప్లవం తీసుకువచ్చి ఇప్పుడున్న సైబరాబాద్ ను నిర్మించిన ఘనత నారా చంద్రబాబుకే దక్కుతుంది. ఇప్పుడు ఆయన సారథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ లో మరో ఐటీ సిటీని నిర్మించేందుకు వడివడిగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. విశాఖపట్నంను ఐటీ హబ్ గా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం సిద్దమయ్యింది.

25
గేమ్ చేంజర్ గా గూగుల్

విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు గురించే ప్రస్తుతం యావత్ దేశం మాట్లాడుకుంటోంది. ఇది ఐటీ హబ్ గా వైజాగ్ ను తీర్చిదిద్దాలన్న కూటమి ప్రభుత్వ లక్ష్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లింది. హైదరాబాద్ తో పోటీపడే స్థాయికి విశాఖలో ఐటీని అభివృద్ధి చేస్తామని... ఈ రంగంలో లక్షలాది ఉద్యోగాలు కల్పిస్తామని అంటోంది ప్రభుత్వం. ఈ విషయంలో గూగుల్ డేటా సెంటర్, ఏఐ హబ్ దిశగా విశాఖపట్నం పయనం గేమ్ చేంజర్ కానుంది.

కేవలం ఒక్క గూగుల్ ద్వారానే ప్రత్యక్షంగా, పరోక్షంగా 1,88,000 ఉద్యోగాలు వస్తాయని ప్రభుత్వం చెబుతోంది. ఇలా కేవలం ఐటీ రంగంలోనే 5 లక్షల ఉద్యోగాలకు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని నారా లోకేష్ తెలిపారు. అందుకే ఇప్పటికే టీసిఎస్ తో పాటు అనేక ఐటీ కంపనీలకు ప్రోత్సాహకాలు అందిస్తూ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆహ్వానిస్తున్నామని తెెలిపారు. ఆనాడు హైదరాబాద్ రూపురేఖలను మైక్రో సాఫ్ట్ మారిస్తే నేడు గూగుల్ పెట్టుబడులు విశాఖ రూపురేఖలు మార్చబోతోందన్నారు లోకేష్.

ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ 6 హామీలను ఒక్కోటిగా అమలుచేస్తున్నామని... అందులో భాగమే ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగ కల్పన అని లోకేష్ తెలిపారు. తమ ఐదేళ్ల పాలనలో తప్పకుండా 20 లక్షల ఉద్యోగాలను కల్పిస్తామని... హామీని నెరవేరుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఇందుకోసం అహర్నిశలు కష్టపడుతున్నామని నారా లోకేష్ పేర్కొన్నారు.

35
గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు బీజం పడింది అక్కడే...

గూగుల్ డేటా సెంటర్ కోసం సుదీర్ఘ చర్చలు జరిగాయి... చివరకు వైజాగ్ లో పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పించామన్నారు లోకేష్. గతంలో దావోస్ వెళ్లినప్పుడు ఏం చేశారు? అని కొందరు అడిగారుగా... అప్పుడే గూగుల్ క్లౌడ్ సీఈవోను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిశారని లోకేష్ తెలిపారు. అప్పటినుండి గూగుల్ తో నిత్యం సంప్రదింపులు జరుపుతూనే ఉన్నాం... సెప్టెంబర్ 2024 లో గూగుల్ ప్రతినిధులతో విశాఖలో తానే స్వయంగా సమావేశమయ్యానని తెలిపారు. అంతేకాదు డేటా సెంటర్ ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని దగ్గరుండి చూపించాననని లోకేష్ గుర్తుచేశారు.

ఇలా ఓవైపు గూగుల్ ప్రతినిధులతో చర్చలు జరుపుతూనే మరోవైపు అధికారులతో మాట్లాడుతూ పెట్టుబడులకు అనుకూల విధానాలను రూపొందించామన్నారు లోకేష్. తానే స్వయంగా అమెరికాకు వెళ్లి గూగుల్ క్లౌడ్ నాయకత్వాన్ని కలిసి వైజాగ్ లో డేటా సెంటర్ ఏర్పాటు ప్రతిపాదనను ముందుకు తీసుకువెళ్లినట్లు తెలిపారు. ఇలా గూగుల్ సంస్థతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఇతర మంత్రులు, ప్రభుత్వ సంస్ధలను ఒప్పించడంవల్లే ఇంత పెద్ద పెట్టుబడి సాధ్యమయ్యిందన్నారు నారా లోకేష్.

45
ఉద్యోగాల జాతర

వైసిపి పాలనలో విధ్వంసం తప్ప మరేమీ జరగలేదు... వ్యాపారవేత్తలు ఏపీవైపు చూసే సాహసమే చేయలేదన్నారు లోకేష్. ఇక ప్రభుత్వ ఉద్యోగాలను కూడా వైసిపి హయాంలో భర్తీచేసింది లేదు… కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఉద్యోగాల జాతర కొనసాగుతోందని... ఇప్పటికే మెగా డిఎస్సితో పాటు వివిధ శాఖల్లో వేలాది ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసినట్లు నారా లోకేష్ తెలిపారు. మరో డిఎస్సి నిర్వహణకు సిద్దంగా ఉన్నామన్నారు. ఇలా కేవలం ఏడాదిలోనే ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో లక్షలాదిమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించామని... ఇకపై కూడా ఉద్యోగ నియామక ప్రక్రియ కొనసాగుతుందన్నారు. చదువుకున్న యువతీయువకులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి నారా లోకేష్ భరోసా ఇచ్చారు.

55
ఏపీలో అభివృద్ధి వికేంద్రీకరణ..

కేవలం ఒకేచోట కాకుండా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలకు పెట్టుబడులు వచ్చేలా, అభివృద్ధి వికేంద్రీకరణ జరిగేలా చూస్తున్నామని లోకేష్ అన్నారు. ఇలా విశాఖకు గూగుల్ డేటా సెంటర్ వచ్చినట్లే అనంతపురం, కర్నూలులో పంప్డ్ స్టోరేజ్, సిమెంట్ ఫ్యాక్టరీలు వస్తున్నాయన్నారు. చిత్తూరు, కడప లను ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎకో సిస్టమ్ గా తీర్చిదిద్దుతున్నామన్నారు. నెల్లూరు జిల్లా శ్రీసిటీ గ్రేటర్ ఎకో సిస్టమ్ లో అనేక పెట్టుబడులు తీసుకొస్తున్నామన్నారు. ప్రకాశం జిల్లాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ కి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని లోకేష్ తెలిపారు.

ఇక కృష్ణా, గుంటూరు... అమరావతిలో రాజధానితో పాటు, క్వాంటం కంప్యూటింగ్ తీసుకొస్తున్నామన్నారు. ఉభయ గోదావరి జిల్లాలో ఆక్వాను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నాం... డిఫెన్స్ సంస్థలు కూడా వస్తున్నాయన్నారు. ఉత్తరాంధ్రలో టీసీఎస్, కాగ్ని జెంట్, యాక్సెంచర్ వంటి ఎన్నో సంస్థల పెట్టుబడులు పెట్టాయని నారా లోకేష్ తెలిపారు.

Read more Photos on
click me!

Recommended Stories