ప్రధాని పర్యటన సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా భద్రతా ఏర్పాట్లు చేశారు. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా పర్యవేక్షణలో నల్లమల అటవీ ప్రాంతంలో కేంద్ర బలగాలతో కూంబింగ్ నిర్వహించారు. ఒక్క శ్రీశైలంలోనే 1,800 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లు చేశారు. భద్రతా కారణాల వల్ల గురువారం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు శ్రీశైలానికి వాహన రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేయనున్నారు.
ప్రధాని పర్యటన షెడ్యూల్ ఇలా..
* ఉదయం 7:50 – ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరుతారు.
* ఉదయం 10:20 – ఓర్వకల్ విమానాశ్రయానికి చేరుకుంటారు.
* ఉదయం 11:10 – హెలికాప్టర్‌లో సున్నిపెంటకు ప్రయాణం
* ఉదయం 11:45 – శ్రీశైల దేవాలయ దర్శనం
* మధ్యాహ్నం 1:40 – సున్నిపెంట నుంచి నన్నూరు హెలిప్యాడ్‌కి.
* మధ్యాహ్నం 2:30 – కర్నూలు రాగమయూరి సభా ప్రాంగణంలో ప్రజా సభలో పాల్గొని ప్రసంగం