Tsunami: చ‌రిత్ర మ‌ర‌వ‌ని సునామీ విప‌త్తు.. 2004లో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఎంత విధ్వంసం జ‌రిగిందో తెలుసా.?

Published : Jul 30, 2025, 03:04 PM IST

Andhra Tsunami Tragedy: ర‌ష్యాలో సంభవించిన భూకంపం యావ‌త్ ప్ర‌పంచాన్ని ఉలిక్కిప‌డేలా చేసింది. దీంతో రష్యా, జపాన్‌తో పాటు ఉత్తర పసిఫిక్‌లోని పలు తీర ప్రాంతాలను సునామీ తాకింది. చ‌రిత్ర‌లో జ‌రిగిన ఇలాంటి ఓ విప‌త్తు ప్ర‌భావం ఏపీపై కూడా ప‌డింద‌ని తెలుసా? 

PREV
15
2004 డిసెంబర్ 26: ప్రపంచాన్ని కుదిపేసిన ప్ర‌ళ‌యం

2004 డిసెంబర్ 26న ఇండోనేషియాలోని సుమత్రా దీవుల వద్ద 9.2 తీవ్రతతో సంభవించిన భూకంపం మానవ చరిత్రలో ఎన్నడూ చూడని విధ్వంసానికి కారణమైంది. ఈ భూకంపం హిందూ మహాసముద్రంలో ఏర్పడిన సునామీకి దారితీసి 14 దేశాల తీరప్రాంతాలను ముంచేసింది. 

30 మీటర్ల ఎత్తుకు ఎగసిన అలలు తీర గ్రామాలను పూర్తిగా ముంచేశాము. 2 లక్షల 30 వేల మంది ప్రాణాలు కోల్పోగా, లక్షలాది మంది నిర్వాసితుల‌య్యారు. భారతదేశంలోనే 16 వేలమందికి పైగా ప్రాణాలు కోల్పోయారంటేనే ప్ర‌మాద తీవ్రత ఎలా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు.

25
ఇండోనేషియా నుంచి భారత్ వరకు విధ్వంసం

ఇండోనేషియాలో అత్యధిక నష్టం జరిగింది. అక్కడ 1.7 లక్షలమంది మరణించగా, ఐదు లక్షల మందికి పైగా గృహరహితులయ్యారు. తరువాత శ్రీలంక, భారత్, థాయిలాండ్ వంటి దేశాలు తీవ్ర ప్రభావాన్ని ఎదుర్కొన్నాయి. అండమాన్ నికోబార్ దీవుల్లో 1,500 మందికి పైగా మృతి చెందగా తమిళనాడు తీరంలో మాత్రమే 8 వేలమంది ప్రాణాలు కోల్పోయారు. ఆంధ్రప్రదేశ్, కేరళ తీరాలు కూడా సునామీ దెబ్బకు దెబ్బతిన్నాయి.

2004 డిసెంబర్ 26న సంభవించిన హిందూ మహాసముద్ర సునామీ, ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ సునామీ కారణంగా 301 గ్రామాలు ప్రభావితమయ్యాయి. 105 మంది ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యంగా కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో సునామీ ప్రభావం ఎక్కువగా పడింది. చేపల వేటపై ఆధారపడే వారు ఎంతో మంది జీవనోపాధిని కోల్పోయారు.

301 గ్రామాల‌పై ప్ర‌భావం
2004 డిసెంబర్ 26 సునామీ Andhra Pradesh తీరంలోని 301 గ్రామాల్లోనూ తీవ్రంగా ప్రభావితం చూపింది. ముఖ్యంగా కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో అత్యధిక ప్రాణ నష్టం జ‌రిగింది.
35
మత్స్యకార గ్రామాలు, పర్యాటక ప్రాంతాలపై తీవ్ర ప్రభావం

సునామీ మత్స్యకార గ్రామాలను కుదిపేసింది. తల్లిదండ్రులను కోల్పోయిన అనేక చిన్నారులు అనాథలయ్యారు. పర్యాటక స్వర్గధామంగా పేరుగాంచిన సుమత్రా దీవులు విధ్వంసం తరువాత పూర్తిగా మారిపోయాయి. సందర్శకులు సంవత్సరాల పాటు ఆ ప్రాంతానికి వెళ్లడానికి భయపడ్డారు. ప్రస్తుతం అక్కడ మ్యూజియంలు, రిసార్టులు, స్మారక స్థలాలు ఏర్పాటు చేసి బాధితుల జ్ఞాపకాలను సజీవంగా ఉంచారు. స్థానిక ప్రజల్లో భయం తొలగించేందుకు ప్రతి ఏడాది ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

2024 నాటి సునామీ సంబంధిత వీడియో

45
శాస్త్రవేత్తల విశ్లేషణ

ఆ విపత్తు తర్వాత శాస్త్రవేత్తలు టెక్టోనిక్ పలకల మధ్య ఘర్షణ కారణంగా భూకంపం సంభవించిందని తేల్చారు. అయితే సునామీ హెచ్చరికల కోసం అప్పుడు అధునాతన వ్యవస్థలు లేకపోవడం వల్లే ప్రజలను ముందుగానే అప్రమత్తం చేయలేకపోయారు.

 ఈ సంఘటన తర్వాత ప్రపంచ దేశాలు హెచ్చరిక వ్యవస్థలు, రాడార్‌లు, భూకంప సెన్సార్ల అభివృద్ధిపై దృష్టి సారించాయి. ప్రస్తుతం సముద్రగర్భ భూకంపాలను క్షణాల్లో గుర్తించే సాంకేతికతలు అందుబాటులోకి వచ్చాయి.

2024 నాటి సునామీ సంబంధిత వీడియో

55
జపాన్ సునామీతో అప్ప‌టి జ్ఞాప‌కాలు

ఇటీవల జపాన్ తీరంలో సంభవించిన సునామీతో 2004 విపత్తు మళ్లీ గుర్తుకొచ్చింది. జపాన్‌లో నష్టం తక్కువగా ఉండటానికి ప్రధాన కారణం వారి సునామీ హెచ్చరిక వ్యవస్థలు, కట్టుదిట్టమైన భూకంప నియంత్రణ మౌలిక వసతులు. 

2004 సంఘటనల తర్వాత జపాన్ సహా అనేక దేశాలు సముద్రతీర భూకంపాలపై గణనీయమైన పరిశోధనలు జరిపాయి. ఇప్పుడు తక్షణ హెచ్చరికలు జారీ చేయడం, తీరప్రాంతాల నుంచి వేగంగా తరలించడంలో సాంకేతికత కీలక పాత్ర పోషిస్తోంది. ఈ పాఠాల వల్ల భవిష్యత్తులో పెద్ద విపత్తుల ప్రభావం తగ్గే అవకాశం ఉంది.

Read more Photos on
click me!

Recommended Stories