గతేడాది మే 1 నుండి 10 తేదీల మధ్య 7,04,760 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా, ఈ ఏడాది అదే కాలంలో 7,04,689 మంది భక్తులు దర్శించుకున్నారు. సంఖ్యలో తేడా లేకపోయినప్పటికీ, క్యూలైన్లు పెద్దగా కనిపించకపోవడం గమనార్హం.
టీటీడీ అధికారులు తెలిపిన ప్రకారం, కాశ్మీర్ పహల్గాం ప్రాంతంలో ఇటీవల జరిగిన ఉగ్రదాడి, దేశవ్యాప్తంగా నెలకొన్న యుద్ధ భయాలు భక్తుల రద్దీపై ప్రభావం చూపినట్టు తెలుస్తోంది. తిరుమల రద్దీ ప్రాంతం కావడంతో, చాలా మంది భక్తులు పరిస్థితి స్థిరపడిన తర్వాతే స్వామివారి దర్శనానికి రావాలనుకుంటున్నట్టు సమాచారం.