ప్రాజెక్టుల అమలు & సాంకేతిక వినియోగం:
* వ్యవసాయం, మత్స్యశాఖ, MSMEs, విద్య, టూరిజం, రోడ్లు, శుభ్రత, డిజిటల్ సేవలపై ప్రాజెక్టులను అమలు చేయడంలో సహాయం చేయాలి.
* కొత్త సాంకేతికతను ఉపయోగించి సేవల నాణ్యత పెంచాలి.
పర్యవేక్షణ & మూల్యాంకనం:
* KPIs ఆధారంగా నియోజకవర్గ పురోగతిని మానిటర్ చేయాలి.
* ప్రతి నెలా నివేదికలను పంపాలి.
* అడ్డంకులు ఎదురైతే పరిష్కార మార్గాలు సూచించాలి.
శిక్షణ:
* GSWS టీమ్‌లకు మార్గదర్శకత్వం ఇవ్వాలి.
* శిక్షణలు, ఉత్తమ విధానాలపై విజిట్‌లు నిర్వహించాలి.
* ఇతర నియోజకవర్గాలతో నాలెడ్జ్ షేర్ చేసుకోవాలి.
ఇతర బాధ్యతలు:
* నియోజకవర్గ నోడల్ అధికారులు లేదా ప్లానింగ్ శాఖ అప్పగించే ఇతర పనులు కూడా నిర్వర్తించాలి.
జీతం, అర్హతలు, ఎలా దరఖాస్తు చేసుకోవాలి.?
ఈ పోస్టుకు ఎంపికైన వారికి పన్నులతో సహా కలుపుకొని నెలకు రూ. 60,000 జీతం అందిస్తారు. అర్హత విషయానికొస్తే పోస్టు ఆధారంగా సంబంధిత విభాగంలో ఎంబీఏ/పీజీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. నోటిఫికేషన్ వెలువడిన తేదీ నాటికి 40 ఏళ్ల లోపు ఉండాలి. 2025 మే 13 దరఖాస్తులకు చివరి తేదీగా నిర్ణయించారు. అభ్యర్థులను రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.