IMD Rain Alert : తెలుగు రాష్ట్రాలకు మరో తుపాను గండం .. ఈ ప్రాంతాల్లో చల్లని వర్షాలు

Published : Dec 16, 2025, 07:30 AM ISTUpdated : Dec 16, 2025, 07:40 AM IST

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాలకు మరో తుపాను గండం పొంచివుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. దీని ప్రభావంతో మళ్ళీ వర్షాలు మొదలయ్యే అవకాశాలు ఉన్నాయంటోంది.

PREV
15
తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు...

IMD Rain Alert : తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం చలి చంపేస్తోంది. దీనికి ఇప్పుడు వర్షాలు కూడా తోడయ్యే అవకాశాలున్నాయని వాతావారణ శాఖ అంచనా వేస్తోంది. హిందూ మహాసముద్రంలో ఏర్పడిన తుపాను, బంగాళాఖాతం నుండి వీస్తున్న గాలుల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు మారుతున్నాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కొన్నిచోట్ల చలిగాలులు, పొగమంచుతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇప్పటికే చలిగాలులతో సతమతం అవుతున్న తెలుగు ప్రజలను తాజాగా వర్ష హెచ్చరికలు మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి.

25
తెలంగాణ, ఏపీపై బాకుంగ్ తుపాను ఎఫెక్ట్

హిందూ మహాసముద్రంలో ఏర్పడిన బాకుంగ్ (Bakung) తుపాను ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలో ద్రోణి ఏర్పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ చెబుతోంది. ఇవాళ (మంగళవారం) ఇరురాష్ట్రాలు మేఘాలతో కమ్ముకుని ఉంటాయని... అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని IMD హెచ్చరించింది. అయితే ఈ వర్షాల సమయంలో చలిగాలులు కూడా వీస్తాయని... దీంతో వాననీరు అత్యంత చల్లగా ఉంటుందని.. కొన్నిచోట్ల పొగమంచు మాదిరి వర్షాలుంటాయని హెచ్చరిస్తోంది.

35
బంగాళాఖాతం గాలుల ఎఫెక్ట్

బంగాళాఖాతం నుండి వీస్తున్న తూర్పుగాలుల ప్రభావం తమిళనాడుపై ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ చెబుతోంది. అయితే తమిళనాడుకు ఆనుకుని ఉన్న రాయలసీమ జిల్లాలపై కూడా ఈ గాలులు ప్రభావం ఉంటుందని... ఇక్కడ కూడా వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. రెండుమూడు రోజులు ఇలాగే చలిగాలులతో కూడిన వర్షాలుంటాయని వాతావరణ శాఖ తెలిపింది.

45
తెలంగాణలో దట్టమైన పొగమంచు

తెలంగాణ విషయానికి వస్తే చలితీవ్రత మరింత పెరిగి దట్టమైన పొగమంచు కురిసే అవకాశాలున్నాయని తెలంగాణ వెదర్ మ్యాన్ తెలిపారు. ముఖ్యంగా సౌత్, ఈస్ట్, సెంట్రల్ తెలంగాణ జిల్లాల్లో పొగమంచు ప్రభావం ఎక్కువగా ఉంటుందని వెల్లడించారు. కాబట్టి ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఇక రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు మరింత పడిపోయి చలిగాలులు కొనసాగుతాయని వెదర్ మ్యాన్ తెలిపారు.

55
తెలంగాణలో అత్యల్ప ఉష్ణోగ్రతలు ఇక్కడే

తెలంగాణలో అత్యల్పంగా ఆదిలాబాద్ లో 7.7, మెదక్ లో 9.3 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే హన్మకొండలొ 11.5, రామగుండంలో 12.8, నల్గొండలొ 13, నిజామాబాద్ లో 13.1 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలున్నాయి. హైదరాబాద్ విషయానికి వస్తే అత్యల్పంగా పటాన్ చెరులో 9.4, రాజేంద్రనగర్ లో 9.5 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ కేంద్రం ప్రకటించింది.

Read more Photos on
click me!

Recommended Stories