School Holidays: తుపాను ఎఫెక్ట్.. ఈ జిల్లాల్లో మూడు రోజులు స్కూళ్లు, కాలేజీలకు సెలవులు

Published : Oct 26, 2026, 02:51 PM IST

School Holidays: అర్నబ్ తుపాను ముప్పుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలర్ట్ అయింది. ఏపీలో భారీ వర్షాలు, తీవ్రమైన ఈదురు గాలులు ఉంటాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. నేపథ్యంలో ప్రభుత్వం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించింది.

PREV
15
ఏపీకి అర్నబ్ తుపాను తుఫాన్ అలర్ట్.. ఆ జిల్లాల్లో బడులు బంద్

బంగాళాఖాతంలో ఏర్పడిన ‘అర్నబ్’ తుపాను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ను భయపెడుతోంది. గడిచిన 6 గంటల్లో గంటకు 15 కిలోమీటర్ల వేగంతో ముందుకు కదులుతున్న ఈ తుపాను, మంగళవారం రాత్రికి తీవ్ర తుపానుగా మారి, బుధవారం నాటికి బాపట్ల నుంచి విశాఖపట్నం మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.

తాజా సమాచారం ప్రకారం ఇది అండమాన్ కు వాయువ్యంగా 590 కి.మీ, విశాఖపట్నానికి తూర్పు-ఆగ్నేయంగా 610-650 కి.మీ, కాకినాడకు 690-730 కి.మీ, మచిలీపట్నానికి 790-830 కి.మీ, బాపట్లకు 860-910 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉందోని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ఈ క్రమంలోనే పలు జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు.

25
గంటకు 140 కిమీ వేగంతో గాలులు: 12 జిల్లాలకు బిగ్ అలర్ట్

తుపాను తీరం దాటే సమయంలో తీరప్రాంతాల్లో గంటకు 100 నుంచి 140 కిలోమీటర్ల తుపాను గాలులు వీచే ప్రమాదం ఉంది. శ్రీకాకుళం నుంచి బాపట్ల వరకు కోస్తాంధ్రలోని 12 జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు.

ముఖ్యంగా కాకినాడ, బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ, అనకాపల్లి, తూర్పు గోదావరి జిల్లాలపై తుపాను ప్రభావం తీవ్రంగా ఉండనుంది. తాడేపల్లిలోని ఏపీ రాష్ట్ర అత్యవసర కార్యకలాపాల కేంద్రం నుంచి అధికారులు వాతావరణ నిపుణులతో కలిసి తుపాను కదలికలను నిమిష నిమిషానికి పర్యవేక్షిస్తున్నారు.

35
విద్యార్థుల భద్రతే ముఖ్యం: ఆ జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు

వర్ష తీవ్రత పెరిగే అవకాశం ఉండటంతో పిల్లల భద్రతను దృష్టిలో ఉంచుకుని ముందస్తు జాగ్రత్త చర్యగా పలు జిల్లాల్లో కలెక్టర్లు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు.

• అనకాపల్లి జిల్లా: కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదేశాల ప్రకారం నేటి నుంచి ఈ నెల 29 వరకు వరుసగా 3 రోజుల పాటు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవులు ఉంటాయి.

• కాకినాడ, బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లాలు: కలెక్టర్ ఎం. హరిందర ప్రసాద్ ప్రకటన మేరకు కాకినాడ, కోనసీమ జిల్లాల్లోని అన్ని విద్యాసంస్థలకు రెండు రోజుల పాటు (అక్టోబర్ 27, 28) సెలవులు అమల్లో ఉంటాయి.

ఇతర ప్రభావిత జిల్లాల్లోనూ పరిస్థితులకు అనుగుణంగా సెలవులు ఇవ్వాలని తల్లిదండ్రుల నుంచి వినతులు వస్తున్నాయి.

45
రెస్క్యూ టీమ్స్ రెడీ: షెల్టర్లకు తీర ప్రాంత వాసులు

విపత్తును ఎదుర్కొనేందుకు ఏపీ ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టింది. అత్యవసర సహాయక చర్యల కోసం ఎన్డీఆర్‌ఎఫ్ (NDRF), ఎస్‌డీఆర్‌ఎఫ్ (SDRF) బృందాలను రంగంలోకి దించారు. కాకినాడ జిల్లాలో 6 ప్రత్యేక పునరావాస కేంద్రాలను సిద్ధం చేసి, లోతట్టు, సముద్ర తీరప్రాంతాల్లోని ప్రజలను మంగళవారం ఉదయానికల్లా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

సముద్రం అల్లకల్లోలంగా మారనున్నందున మత్స్యకారులు ఎవరూ చేపల వేటకు వెళ్లకూడదని కఠిన ఆదేశాలు ఇచ్చారు. అధికారులకు ముందస్తు అనుమతి లేకుండా సెలవులు ఇవ్వకూడదని, సిబ్బంది అంతా హెడ్‌క్వార్టర్స్‌లోనే అందుబాటులో ఉండాలని సూచించారు.

55
హెల్ప్‌లైన్ నంబర్లు ఇవే: అత్యవసరమైతే ఫోన్ చేయండి

ప్రజలకు 24 గంటలూ అందుబాటులో ఉండేలా కలెక్టరేట్‌లు, డివిజన్, మండల కేంద్రాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే క్రింది నంబర్లను సంప్రదించవచ్చు..

• కాకినాడ జిల్లా కంట్రోల్ రూమ్: 0884-2356801, 9849903879

• డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ కలెక్టరేట్: 08865-293104

• అమలాపురం ఆర్డీఓ ఆఫీస్: 08856-233208

• రామచంద్రపురం ఆర్డీఓ ఆఫీస్: 08857-245166

• కొత్తపేట ఆర్డీఓ ఆఫీస్: 9989855444

ప్రజలు అనవసర ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని, వాతావరణ శాఖ ఇచ్చే అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories