Cyclone Alert: అర్నబ్ తుపాను ముప్పు.. ఏపీలో 12 జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు.. తెలంగాణకు బిగ్ అలర్ట్

Published : Oct 25, 2026, 09:01 AM IST

Cyclone Arnab Heavy Rains Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన అర్నబ్ తుపాను అతి తీవ్ర తుపానుగా మారి బాపట్ల-విశాఖ మధ్య తీరం దాటనుంది. దీని ప్రభావంతో ఏపీలోని 12 జిల్లాలతో పాటు తెలంగాణలోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది.

PREV
15
బంగాళాఖాతంలో బలపడుతున్న అర్నబ్ తుపాను

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడి వాయుగుండంగా, ఆ తర్వాత తీవ్ర వాయుగుండంగా రూపాంతరం చెందింది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా పయనిస్తూ త్వరలోనే అతి తీవ్ర తుపానుగా మారనుందని భారత వాతావరణ శాఖ (IMD) స్పష్టం చేసింది.

ఈ ఏడాది బంగాళాఖాతంలో ఏర్పడుతున్న తొలి తుపాను ఇది కావడం గమనార్హం. ఈ ముప్పునకు వాతావరణ శాఖ ‘అర్నబ్’ (Cyclone Arnab) అని నామకరణం చేసింది. ప్రస్తుతం ఈ వాయుగుండం విశాఖపట్నం, కాకినాడ, బాపట్ల తీరాలకు దూరంగా కేంద్రీకృతమై ఉంటూ, క్రమంగా ఏపీ తీరం వైపు కదులుతోంది.

గడిచిన 6 గంటల్లో గంటకు 5 కిమీ వేగంతో కదులుతుంది. ఆదివారం ఉదయం 9 గంటల నాటికి విశాఖపట్నంకు 880 కి. మీ.,కాకినాడకు 980 కి. మీ., మచిలీపట్నంకు 1080 కి. మీ.,బాపట్లకు 1150 కి. మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది.

25
ఏపీలో 12 జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు

ఈ తుపాను బుధవారం ఉదయానికి ఆంధ్రప్రదేశ్ తీరానికి సమీపించి, బాపట్ల - విశాఖపట్నం లేదా యానాం మధ్య తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. తీరం దాటే సమయంలో గంటకు 120 నుంచి 140 కిలోమీటర్ల భీకర వేగంతో ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉంది. దీనివల్ల సముద్రం తీవ్రంగా అల్లకల్లోలంగా మారనుంది. ఈ నేపథ్యంలో మత్స్యకారులు ఎవరూ సముద్రంలోకి వేటకు వెళ్లకూడదని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది.

35
కుండపోత వర్షాలు.. ఏ రోజు ఎక్కడెక్కడంటే?

తుపాను ప్రభావంతో అక్టోబర్ 27, 28 తేదీల్లో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో వానలు దంచికొట్టనున్నాయి.

• అతి భారీ వర్షాలు కురిసే జిల్లాలు: విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, బాపట్ల, గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా, పార్వతీపురం మన్యం, విజయనగరం, శ్రీకాకుళం.

• భారీ వర్షాలు: పల్నాడు, ప్రకాశం, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు. అలాగే అక్టోబర్ 29 నాటికి తుపాను తీవ్రత కొద్దిగా తగ్గినప్పటికీ, ఆ రోజు కూడా పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉంది.

45
తెలంగాణపై కూడా తుపాను ఎఫెక్ట్.. రెడ్ అలర్ట్ జారీ

కేవలం ఆంధ్రప్రదేశ్‌ మాత్రమే కాకుండా, తెలంగాణపై కూడా అర్నబ్ తుపాను ప్రభావం గట్టిగా ఉండనుంది. అక్టోబర్ 27 నుంచి 29 వరకు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. ముఖ్యంగా ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఈ మూడు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.

అలాగే జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, నల్గొండ, సూర్యాపేట జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. మరోవైపు ఈ వర్షాల కారణంగా ఎండల తీవ్రత తగ్గి, రాత్రి వేళల్లో చలిగాలులు మరింత పెరిగే అవకాశం ఉంది.

55
యంత్రాంగం అప్రమత్తం.. ప్రజలకు ముందస్తు హెచ్చరికలు

భారీ వర్షాలు, ఈదురుగాలుల హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వాలు అధికార యంత్రాంగాన్ని పూర్తిగా అప్రమత్తం చేశాయి. తీరప్రాంతాల్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లు, రెస్క్యూ బృందాలను సిద్ధం చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, చెట్లు, విద్యుత్ స్తంభాల కింద నిలబడవద్దని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories