Colleges Bandh : ఆంధ్ర ప్రదేశ్ లో విద్యాసంస్థల బంద్... ఒక్కరోజు కాదు రెండ్రోజులు సెలవే

Published : Jul 17, 2025, 06:25 PM IST

ఆంధ్రప్రదేశ్ లో ప్రైవేట్ కాలేజీలు బంద్ కు పిలుపునిచ్చాయి యాజమాన్యాలు. డ్యూయల్ మేజర్ డిగ్రీ విధానం అమలుకు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు జులై 21న రాష్ట్రవ్యాప్తంగా కాలేజీలను మూసేయాలని నిర్ణయించాయి.

PREV
15
ఏపీలో కాలేజీల బంద్..

Andhra Pradesh Bandh : ఆంధ్ర ప్రదేశ్ విద్యార్థులకు వచ్చే సోమవారం సడన్ సెలవు వస్తోంది. తమ సమస్యల పరిష్కారానికి రాష్ట్రంలోని ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు విద్యాసంస్థల బంద్ కు పిలుపునిచ్చాయి. జులై 21న అంటే వచ్చే సోమవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు బంద్ ను పాటిస్తాయని యాజమన్యాల సంఘం నాయకులు వెల్లడించారు. డిగ్రీ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు బంద్ కు సహకరించాలని... స్వచ్చందంగా పాల్గొనాలని కాలేజీ యాజమాన్యాల సంఘం పిలుపునిచ్చింది.

25
కాలేజీల బంద్ ఎందుకు?

డిగ్రీలో డ్యుయల్ మేజర్ విధానాన్ని అమలుచేయాలని ప్రొఫెసర్ వెంకయ్య కమిటీ ప్రభుత్వానికి సిఫారసు చేసిన విషయం తెలిసిందే. ఇందుకు ప్రభుత్వం కూడా అంగీకరించింది... అందుకు తగిన నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీలన్ని ఈ విధానాన్ని అమలు చేసేందుకు తగిన చర్యలు తీసుకున్నాయి... దీనిపై విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు అవగాహన కూడా కల్పించాయి.

ఇలా డ్యూయల్ మేజర్ డిగ్రీ కోసం కాలేజీలన్ని సిద్దమవగా ప్రభుత్వం సింగిల్ డిగ్రీ విధానాన్నే అవలంభించేందుకు సిద్దమయ్యింది. దీంతో గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో డిగ్రీ కాలేజీల్లో ఇంకా అడ్మిషన్లు ప్రారంభంకాలేదు. 

ఇంటర్మీడియట్ ఫలితాలు వెలువడి రెండునెలలు గడిచిపోతున్నా ఇంకా డిగ్రీ కోర్సులపై క్లారిటీ లేకపోవడం, అడ్మిషన్స్ కొనసాగకపోవడంతో కాలేజీ యాజమాన్యాలు ఆందోళనతో ఉన్నాయి. దీంతో వెంటనే ప్రభుత్వం డ్యూయల్ మేజర్ డిగ్రీని అమలు చేయాలని,  అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగేలా చూడాలని కోరుతూ ప్రైవేట్ డిగ్రీ కాలేజీల యాజమాన్యాలు బంద్ కు పిలుపునిచ్చాయి.

35
ఏమిటీ డ్యూయల్ మేజర్ డిగ్రీ?

సాధారణంగా డిగ్రీ అంటే ఒక విద్యార్థి మ్యాథ్స్, సైన్స్, సోషల్, హిస్టరీ వంటి సబ్జెక్టులతో కూడిన కోర్సులను ఎంచుకోవచ్చు… ఇందుకోసం బిఏ, బీకాం, బిఎస్సి వంటి కోర్సులు ఉంటాయి. డ్యూయల్ డిగ్రీ అంటే ఒక కోర్సు తర్వాత మరో కోర్సు చేయడం… అంటే రెండు డిగ్రీలను పొందడం. ఈ డ్యూయల్ మేజర్ డిగ్రీ అంటే ఒకేసారి రెండు వేరువేరు మేజర్ సబ్జెక్టులతో డిగ్రీ పూర్తిచేయడం... ఇది విద్యార్థులకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది.

ఉదాహరణకు ఓ విద్యార్థి ఈ డ్యూయల్ మేజర్ డిగ్రీ ద్వారా బిఏ కోర్సులోనే హిస్టరీ, పొలిటికల్ సైన్స్ చదవొచ్చు. దీనిద్వారా ఈ రెండు సబ్జెక్టుల్లో ఆ విద్యార్థి ఒకేసారి నైపుణ్యం పొందుతాడు. వేరువేరుగా రెండు డిగ్రీలు చేయాల్సిన అవసరం ఉండదు.

45
వరుసగా రెండ్రోజులు సెలవులే

డిగ్రీ కాలేజీల బంద్ తో ఆంధ్ర ప్రదేశ్ లో వరుసగా రెండ్రోజులు సెలవులు వస్తున్నాయి. జులై 21న ఆదివారం సాధారణ సెలవు... జులై 21న బంద్ కారణంగా డిగ్రీ విద్యార్థులకు సెలవు వస్తోంది. అయితే గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలకు మాత్రం ఈ బంద్ వర్తించదు... కాబట్టి సోమవారం యదావిధిగా క్లాసులు నడుస్తాయి.

55
తెలంగాణలో కూడా వరుసగా రెండ్రోజులు సెలవు

తెలంగాణలో కూడా జులై 20, 21 (ఆది, సోమవారం) రెండ్రోజులు విద్యాసంస్థలకు సెలవు వస్తోంది. వచ్చే ఆదివారం హైదరాబాద్ లో బోనాల పండగ జరుగుతుంది... ఈరోజు ఎలాగూ సాదారణ సెలవే. సోమవారం కూడా బోనాల సందడి కొనసాగుతుంది కాబట్టి ఆరోజు కూడా ప్రభుత్వం అధికారికంగా సెలవు ప్రకటించింది. ఇలా రెండ్రోజులు వరుసగా సెలవులు వస్తున్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories