యువతకు ఉపాధి కల్పన, ఏపీ పునఃనిర్మాణం లక్ష్యమని అధికారంలోకి వచ్చే ముందు పలుసార్లు తెలిపిన సీఎం చంద్రబాబు ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే రాష్ట్రానికి ఐటీ కంపెనీలను తీసుకొచ్చే దిశగా మరో కీలక అడుగు వేశారు.
ఓవైపు అమరావతి పునఃనిర్మాణ పనులను మొదలు పెట్టిన కూటమి ప్రభుత్వం. అక్కడ క్వాంటం వ్యాలీ ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే టీసీఎస్, ఐబీఎమ్ వంటి కంపెనీలతో ఒప్పందం కూడా చేసుకుంది. దేశంలోనే తొలి క్వాంటం వ్యాలీని అమరావతిలో ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇదిలా ఉంటే మరో వైపు విశాఖను కూడా ఐటీ హబ్‌గా మార్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
25
ఇప్పటికే టీసీఎస్ కంపెనీ
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఇప్పటికే విశాఖలో రూ.1370 కోట్ల పెట్టుబడితో ఐటీ కేంద్రం ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా దాదాపు 12 వేల మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయని కంపెనీ తెలిపింది. విశాఖ ఐటీ హిల్స్-3లో 22 ఎకరాల భూమిని టీసీఎస్‌కి కేటాయించారు. దీనిపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
35
కాగ్నిజెంట్ కూడా
ఇదిలా ఉంటే తాజాగా ప్రముఖ ఐటీ కంపెనీ కాగ్నిజెంట్ విశాఖటలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. మూడు దశల్లో క్యాంపస్ నిర్మించేందుకు సిద్ధమైంది. రూ.1583 కోట్ల పెట్టుబడితో 8 వేల మందికి ఉద్యోగం కల్పించనున్న ఈ సంస్థకు కాపులుప్పాడలో VMDA పరిధిలోని 22 ఎకరాల స్థలం కేటాయించారు.
తొలి దశలో 800 మంది ఉద్యోగులతో తాత్కాలిక కార్యాలయం ప్రారంభించనుంది. పూర్తి స్థాయి క్యాంపస్ 2029 నాటికి పూర్తయ్యేలా ప్రణాళికలు రూపొందించారు.
కాగ్నిజెంట్ సీఈవో రవి కూమార్ మాట్లాడుతూ.. “విశాఖలో మా క్యాంపస్ ప్రారంభించడం మా ప్రయాణంలో కీలక ఘట్టం. టెక్నాలజీ రంగంలో ప్రతిభావంతుల్ని పెంపొందించే దిశగా విశాఖను ఎంచుకున్నాం” అని తెలిపారు. ఐటీ మంత్రి నారా లోకేష్ కూడా సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ – ‘‘డిజిటల్ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి ఇది కీలకమైన అడుగు’’ అని పేర్కొన్నారు.
55
ఐటీ హబ్‌గా మారుతోన్న విశాఖ
ఇప్పటికే గూగుల్ సంస్థ మధురవాడ వద్ద 80 ఎకరాల్లో డేటా సెంటర్ ఏర్పాటు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. త్వరలోనే మరికొన్ని ఐటీ కంపెనీలు విశాఖకు క్యూ కట్టనున్నాయని ప్రభుత్వం చెబుతోంది. విశాఖను ముంబై తరహాలో అభివృద్ధి చేస్తామని సీఎం చంద్రబాబు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.