అధికారుల వివరాల ప్రకారం ఇప్పటికే 95-98 శాతం లబ్ధిదారులు ఈ ప్రక్రియను పూర్తి చేశారు. కానీ ఇంకా కొందరు మాత్రమే మిగిలిన నేపథ్యంలో, వారు వెంటనే చర్యలు తీసుకోకపోతే వారి రేషన్ కార్డులు రద్దుకావచ్చని అధికారుల హెచ్చరిక.
ఈకేవైసీ ద్వారా కుటుంబ సభ్యుల ఆధార్ డేటాను రేషన్ కార్డు వివరాలతో అనుసంధానించడం జరుగుతుంది. దీని వల్ల డబుల్ రేషన్ కార్డులు, మరణించిన వారి పేర్లపై సరుకుల పంపిణీ వంటి దుర్వినియోగాలను అరికట్టవచ్చు. అధికారులమాటల్లో, ఇది సరుకుల పంపిణీలో పారదర్శకత తీసుకురావడంలో కీలకమైన చర్య.