Chandrababu Naidu: గుడ్ న్యూస్ చెప్పిన చంద్ర‌బాబు.. వారంద‌రికీ ఉచిత విద్యుత్

Published : Aug 07, 2025, 03:23 PM ISTUpdated : Aug 07, 2025, 03:25 PM IST

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. జాతీయ చేనేత దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకొని నిర్వ‌హించిన ప్ర‌త్యేక కార్య‌క్ర‌మంలో ప్ర‌క‌ట‌న చేశారు. 

PREV
15
చేనేతే మన సంపదకు నిలువెత్తు చిహ్నం

మంగళగిరిలో జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన చేనేత పరిశ్రమకు ప్రత్యేక గౌరవం ఇవ్వాలనే దృఢ సంకల్పంతో ప్రభుత్వం ముందుకు సాగుతుందని తెలిపారు. రాష్ట్రంలో హ్యాండ్లూమ్ మ్యూజియాన్ని అమరావతిలో నిర్మించనున్నట్లు ప్రకటించారు. పొందూరులో తయారయ్యే ఖద్దరు వస్త్రాలను గాంధీ స్వయంగా ప్రశంసించారని ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు గుర్తు చేశారు.

DID YOU KNOW ?
నేన్న‌త‌ల‌కు ఉచిత విద్యుత్
చేనేత కార్మికులకు నెలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్, మరమగ్గాల కోసం 500 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను కూట‌మి ప్ర‌భుత్వం గురువారం నుంచి ప్రారంభించింది.
25
50 ఏళ్లకే పెన్షన్..

చేనేత కార్మికులు చాలా చిన్న వయసులోనే శారీరకంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నార‌ని, దానిని దృష్టిలో ఉంచుకుని, తొలిసారిగా 50 ఏళ్లకే పింఛన్‌ ఇచ్చే విధానాన్ని తెలుగు దేశం ప్రభుత్వం ప్రవేశపెట్టిందని చంద్రబాబు వెల్లడించారు. ఇప్పటివరకు 92,724 మందికి పింఛన్‌లు అందిస్తున్నామని, దీనికై రూ.546 కోట్ల వ్యయమవుతోందని పేర్కొన్నారు. చేనేత వృత్తిలో స్థిరత తీసుకురావాలన్న సంకల్పంతో "నేతన్న భరోసా" కింద అదనంగా రూ.25 వేలు అందించనున్నట్టు తెలిపారు.

35
ఉచిత కరెంట్‌

చేనేత కుటుంబాలకు నెలకు 200 యూనిట్లు, మరమగ్గాల కోసం 500 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్‌ను అందించనున్నట్టు సీఎం ప్రకటించారు. గతంలో 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌తో 90 వేలకుపైగా కుటుంబాలు లబ్ధి పొందినట్లు తెలిపారు. ఉచిత కరెంట్‌తో వారిపై ఆర్థిక భారం తగ్గుతుందని, జీవన ప్రమాణాల్లో మెరుగుదల కనిపిస్తుందని చెప్పారు. ఉత్పత్తి సామర్థ్యం పెంచే లక్ష్యంతో రూ.80 కోట్ల వ్యయంతో మరమగ్గాలకూ సబ్సిడీ ఇచ్చిన‌ట్లు ప్ర‌క‌టించారు.

45
రుణ మాఫీ, జీఎస్టీ భారం ప్రభుత్వమే భరిస్తుంది

చేనేత రంగాన్ని నిలబెట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చంద్రబాబు తెలిపారు. గతంలో రూ.110 కోట్ల వరకు చేనేత రుణాలను మాఫీ చేశామని వెల్లడించారు. చేనేత ఉత్పత్తులపై విధించిన ఐదు శాతం జీఎస్టీని ప్రభుత్వమే భరిస్తోందని స్పష్టం చేశారు. దీనివల్ల చేనేత ఉత్పత్తుల ధరలు నియంత్రణలో ఉండి వినియోగదారులకు మరింత చేరువవుతాయని చెప్పుకొచ్చారు.

55
ప్రపంచ గుర్తింపు లక్ష్యంగా..

చేనేత ఉత్పత్తులకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడానికి ట్రైసబిలిటీ విధానాన్ని అమలు చేయనున్నట్టు చెప్పారు. మంగళగిరి, వెంకటగిరి, శ్రీకాళహస్తి, ఉప్పాడ వంటి ప్రాంతాల్లో చేనేత క్లస్టర్లను అభివృద్ధి చేసి, నూతన డిజైనర్ల సేవలు తీసుకుంటామని వివరించారు. డిజైనర్లకు సలహాలు ఇచ్చే విధంగా పారిశ్రామికవేత్త సుచిత్ర ఎల్లాను అడ్వైజర్‌గా నియమించామని తెలిపారు.

Read more Photos on
click me!

Recommended Stories