ఇక నరేంద్ర మోడీ కూడా అంతే. ప్రధాని అవ్వకముందే ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండగానే తన లైఫ్ స్టైల్ ను చాలా డిఫరెంట్ గా డిజైన్ చేసుకున్నారు మోడి. ఆయన కూడా పనిరాక్షసుడే. మోడీ రోజుకు 3 గంటలు మాత్రమే నిద్రిస్తారట. రాత్రి 1 గంటలకు నిద్రించే ప్రధాని నాలుగు గంటలకు మేల్కొంటారట.
ఉదయం లేవగానే యోగా, ప్రాణాయామంతో పాటు వాకింగ్ సూర్య నమస్కారాలు కూడా పూర్తి చేస్తారట. ఇక ఉదయ 9 గంటలకల్లా ప్రధాని తన ఆఫీస్ కు వెళ్ళిపోతారట. 8 గంటలకల్లా బ్రేక్ ఫాస్ట్ తీసుకునే మోదీ.. 11.30 కల్లా భోజనం పూర్తి చేస్తారట. అయితే ఆయన భోజనంలో దాదాపుగా గుజరాత్ వంటకాలే ఉంటాయట.