Weather Update: ఉరుములు, ఈదురుగాలులతో ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. IMD హెచ్చరిక

Published : Jul 24, 2026, 10:23 AM IST

Weather Update: తెలుగు రాష్ట్రాల్లో శుక్రవారం ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని అధికారులు సూచించారు. ఏయే ప్రాంతాల్లో వర్షాలు పడనున్నాయనే వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

PREV
15
తెలుగు రాష్ట్రాల్లో మారిన వాతావరణం.. ఏ జిల్లాల్లో వర్షం పడుతుందంటే?

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం కూల్ అయింది. పలు ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది. శుక్రవారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వాతావరణం పూర్తిగా మారిపోనుంది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.

గత కొన్ని రోజులుగా తీవ్రమైన ఉక్కపోత, ఎండలతో ఇబ్బంది పడుతున్న జనాలకు ఈ వర్షాలు కాస్త విశ్రాంతినివ్వనున్నాయి. అయితే, వర్షాలతో పాటు గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉందని, ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

25
తెలంగాణలో ఈ జిల్లాల ప్రజలకు అలర్ట్

తెలంగాణలోని దాదాపు అన్ని జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన గాలులు వీచే అవకాశం ఉంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. ముఖ్యంగా ఆదిలాబాద్, కొమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో వర్షాల తీవ్రత ఎక్కువగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. రాజధాని హైదరాబాద్ సహా మిగతా జిల్లాల్లో చెదురుమదురుగా తేలికపాటి జల్లులు కురుస్తాయి.

35
ఆంధ్రప్రదేశ్‌ వేదర్ అప్డేట్

ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) అందించిన సమాచారం ప్రకారం ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో వాతావరణం పూర్తిగా చల్లబడింది.

• ఉత్తర కోస్తా, కోస్తాంధ్ర: శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కాకినాడ, పోలవరం, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడవచ్చు.

• రాయలసీమ: చిత్తూరు, తిరుపతి, వైఎస్ఆర్ కడప, నంద్యాల, మార్కాపురం, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయి. ఇక్కడ గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. వర్షాలు పడుతున్నప్పటికీ పగటిపూట గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది.

45
మత్స్యకారులకు హెచ్చరికలు

సముద్ర తీర ప్రాంతాల్లో 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే ప్రమాదం ఉండటంతో మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లోనూ వేటకు వెళ్లకూడదని అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలవడం, విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడటం, రోడ్లు జారుడుగా మారడం వంటి సమస్యలు రావచ్చు. రోజువారీ రవాణా, వ్యవసాయ పనులపై ఇది కొంత ప్రభావం చూపే అవకాశం ఉంది.

55
వర్షాతో జాగ్రత్త

వాతావరణంలో మార్పుల నేపథ్యంలో ప్రజలు కొన్ని జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు. ఉరుములు, పిడుగులు పడే సమయంలో ఆరుబయట, చెట్ల కింద, విద్యుత్ స్తంభాలు లేదా ఎత్తైన నిర్మాణాల దగ్గర నిలబడకూడదు. పొలాల్లో పనిచేసే రైతులు, పశువుల కాపరులు వర్షం సూచన కనిపించగానే సురక్షితమైన ప్రదేశాలకు వెళ్లాలి. వర్షంలో ప్రయాణాలు చేసేవారు వేగాన్ని తగ్గించి డ్రైవ్ చేయాలి. పండిన పంటను, పశువులను సురక్షిత ప్రాంతాలకు తరలించుకోవాలని రైతులకు సూచించారు. ఎల్ నినో ప్రభావంతో లోటు వర్షపాతం ఉండే అవకాశమున్నందున ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టాలని కోరారు.

Read more Photos on
click me!

Recommended Stories