PM Modi Amaravati Visit: ఏపీ రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభోత్సవానికి మే 2వ తేదీ ప్రధాని నరేంద్ర మోదీ రాజధాని ప్రాంతానికి వస్తున్నారు. ప్రధాని మోదీ మధ్యాహ్నాం 3గంటల ప్రాంతంలో అమరావతికి రానున్నారు. సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు జరగనున్న భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొంటారని అధికార వర్గాల సమాచారం. రాజధాని నిర్మాణానికి సంబంధించిన కార్యక్రమం కావడంతో అధికారపక్షం నాయకులతోపాటు, ప్రతిపక్ష నాయకుడిని పిలవడం కూడా సాంప్రదాయం. ఈ నేపథ్యంలో ఇప్పటికే మాజీ సీఎం జగన్‌కు ప్రభుత్వం తరఫున ఇన్విటేషన్ కూడా పంపారు.