Bhogapuram Airport: వైజాగ్ హిస్టరీలో బిగ్ ఛేంజ్.. పాత విమానాశ్రయంకు గుడ్‌బై.. అసలు రీజన్ ఇదే

Published : Jul 29, 2026, 02:33 PM IST

Bhogapuram International Airport: ఆగస్టు 17 నుంచి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ స్టార్ట్ కానుంది. దీంతో పాత విశాఖ ఎయిర్‌పోర్ట్ నుంచి షెడ్యూల్డ్ కమర్షియల్ ఫ్లైట్స్ నిలిపివేయనున్నారు. VTZ కోడ్ మార్పు వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

PREV
14
ప్రధాని మోదీ చేతుల మీదుగా భోగాపురం విమానాశ్రయం గ్రాండ్ ఓపెనింగ్

ఆంధ్రప్రదేశ్ ఏవియేషన్ హిస్టరీలోనే ఒక సరికొత్త రికార్డ్ క్రియేట్ కాబోతోంది. ఉత్తరాంధ్ర ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న భోగాపురం ‘అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం’ సీన్ లోకి వచ్చేసింది. వైజాగ్ సిటీకి దాదాపు 50 కిలోమీటర్ల దూరంలో, అల్ట్రా మోడర్న్ ఫెసిలిటీస్‌తో నిర్మించిన ఈ డ్రీమ్ ప్రాజెక్టును ఆగస్టు 1న భారత ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ప్రారంభించనున్నారు. ఈ ఈవెంట్‌ను ఏపీ ప్రభుత్వం చాలా గ్రాండ్‌గా డిజైన్ చేస్తోంది. ప్రారంభోత్సవం పూర్తికాగానే, ఆగస్టు 17 నుంచి ఈ కొత్త ఎయిర్‌పోర్ట్ నుంచి కమర్షియల్ ఫ్లైట్ ఆపరేషన్స్ ఫుల్ స్వింగ్‌లో స్టార్ట్ కానున్నాయి.

24
విశాఖ పాత ఎయిర్‌పోర్ట్‌కు ప్యాకప్.. 30 ఏళ్ల పాటు కమర్షియల్ ఫ్లైట్స్ నిలిపివేత

కొత్త ఎయిర్‌పోర్ట్ అందుబాటులోకి రావడంతో, దశాబ్దాలుగా మనకు సేవలందించిన విశాఖపట్నం పాత ఎయిర్‌పోర్ట్ (సివిల్ ఎన్‌క్లేవ్) నుంచి రెగ్యులర్ ప్యాసింజర్ ఫ్లైట్స్‌కి చెక్ పడింది. దీనిపై కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఒక కీలకమైన నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.

ఆగస్టు 17 రాత్రి 12:01 గంటల నుంచి దాదాపు 30 సంవత్సరాల పాటు విశాఖ పాత ఎయిర్‌పోర్ట్ నుంచి షెడ్యూల్డ్ కమర్షియల్ విమానాల రాకపోకలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ కొత్త మార్పులతో ఇప్పటివరకు విశాఖకు సొంతమైన పాపులర్ ఐఏటీఏ (IATA) కోడ్ "VTZ" కూడా అధికారికంగా భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కే బదిలీ కానుంది. ఈ ఏడాది జనవరిలోనే పొందిన సైట్ క్లియరెన్స్ ప్రకారం ఈ డెసిషన్ తీసుకున్నారు.

34
ఎమర్జెన్సీ సేవలకూ నో ప్రాబ్లమ్.. కొన్ని స్పెషల్ మినహాయింపులు ఇవే

రెగ్యులర్ ప్యాసింజర్ ఫ్లైట్స్ ఆగిపోయినప్పటికీ, పాత వైజాగ్ ఎయిర్‌పోర్ట్ పూర్తిగా క్లోజ్ అయిపోదు. కొన్ని వీఐపీ, అత్యవసర సేవలకు ఇక్కడి నుంచి పర్మిషన్ ఉంటుంది. జాతీయ అత్యవసర పరిస్థితుల్లో ఈ మూసివేత రూల్స్ వర్తించవు. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్, నేవీ, డిఫెన్స్ ఫోర్సెస్, పోలీస్ విమానాలతో పాటు వీఐపీల ప్రైవేట్ జెట్స్, లీజ్డ్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు పాత ఎయిర్‌పోర్ట్ నుంచే ఆపరేట్ అవుతాయి. నాన్-షెడ్యూల్డ్ కమర్షియల్ విమానాలకు కూడా మినహాయింపు ఇచ్చారు. అంటే కేవలం సాధారణ ప్రజలు ప్రయాణించే రెగ్యులర్ కమర్షియల్ ఫ్లైట్స్ మాత్రమే కొత్త భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు షిఫ్ట్ అవుతాయి.

44
భోగాపురంతో మారనున్న ఏపీ రూపురేఖలు

కొత్త గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ వస్తే పాత విమానాశ్రయం నుంచి కమర్షియల్ సర్వీసులు మార్చడం దేశంలో కొత్తేమీ కాదు. 2008లో బెంగళూరు, హైదరాబాద్ లలో కొత్త ఎయిర్‌పోర్టులు వచ్చినప్పుడు కూడా పాత వాటిని ఇలాగే మార్చారు.

అలాగే గోవాలోని మోపా (2022), జేవార్‌లోని నోయిడా ఎయిర్‌పోర్ట్, నవీ ముంబై ఎయిర్‌పోర్ట్‌లలో కూడా ఇదే తరహాలో ఆపరేషన్స్ నడుస్తున్నాయి. భోగాపురం ఎయిర్‌పోర్ట్ అందుబాటులోకి రావడం వల్ల ఏపీ టూరిజం, బిజినెస్ సీన్ నెక్స్ట్ లెవెల్‌కి వెళ్లడం ఖాయం. గ్లోబల్ కనెక్టివిటీ పెరగడంతో పాటు, లోకల్ ఎకానమీ అండ్ ఎంప్లాయ్‌మెంట్ భారీగా బూస్ట్ కాబోతున్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories