
APPSC Jobs : తెలుగు విద్యార్థులకు బంపరాఫర్... డిగ్రీలు చేతబట్టుకుని ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్. ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం భారీగా ఉద్యోగాల భర్తీ చేపట్టింది... తాజాగా ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (APPSC) ద్వారా మరికొన్ని ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది.
కూటమి ప్రభుత్వం మెగా డిఎస్సి ద్వారా వేలాది ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీచేసిన విషయం తెలిసిందే. ఇక పోలీస్ శాఖలో కూడా 6100 ఉద్యోగులను కొత్తగా నియమించింది. ఇలా తమ గవర్నమెంట్ ఏర్పడ్డాక ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో మొత్తం 4 లక్షలకు పైగా యువతకు ఉద్యోగావకాశాలు కల్పించినట్లు సీఎం చంద్రబాబు నాయుడు అసెంబ్లీ వేదికన ప్రకటించారు. ఇకపై కూడా ఈ నియామక ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. ఆయన చెప్పినట్లుగానే ఏపిపిఎస్సి ఉద్యోగాల భర్తీకి వరుస నోటిఫికేషన్లు జారీ చేస్తోంది.
ఇటీవల హార్టీకల్చర్ ఆఫీసర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (సివిల్), డ్రాట్ మ్యాన్ గ్రేడ్ 2, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, జూనియర్ లెక్చరర్ ఇన్ లైబ్రరీ సైన్స్ ఉద్యోగాల భర్తీకి ఏపిపిఎస్సి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ జాబ్ నోటిఫికేషన్ కు సంబంధించిన కీలక సమాచారాన్ని ఇక్కడ తెలుసుకుందాం. అన్ని అర్హతలుండి ఈ ఉద్యోగాలపై ఆసక్తి గలవారు వెంటనే అప్లై చేసుకొండి... ఎందుకంటే ఈ అక్టోబర్ లోనే దరఖాస్తు గడువు ముగుస్తుంది.
భర్తీచేయనున్న మొత్తం ఖాళీలు - 02
సాలరీ : రూ.54,060 నుండి రూ.1,40,540 వరకు ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 18-09-2025
దరఖాస్తు చేయడానికి చివరి తేదీ : 08-10-2025 (రాత్రి 11PM వరకు)
విద్యార్హతలు :
తప్పనిసరిగా గుర్తింపుపొందిన యూనివర్సిటీ నుండి హార్టికల్చర్ లో ఫోర్ ఇయర్స్ బిఎస్సి డిగ్రీ లేదా బిఎస్సి (ఆనర్స్) పూర్తిచేసి ఉండాలి.
వయోపరిమితి : 18-42 ఏళ్లలోపు వయసుండాలి (01-07-2025 నాటికి)
భర్తీచేయనున్న మొత్తం ఖాళీలు - 03
సాలరీ : రూ.57,100 నుండి రూ.1,47,760 వరకు ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 18-09-2025
దరఖాస్తు చేయడానికి చివరి తేదీ : 08-10-2025 (రాత్రి 11PM వరకు)
విద్యార్హతలు :
తప్పనిసరిగా గుర్తింపుపొందిన యూనివర్సిటీ నుండి సివిల్ ఇంజనీరింగ్ లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి.
వయోపరిమితి : 18-42 ఏళ్లలోపు వయసుండాలి (01-07-2025 నాటికి)
భర్తీచేయనున్న మొత్తం ఖాళీలు - 13
సాలరీ : రూ.34,580 నుండి రూ.1,07,210 వరకు ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 18-09-2025
దరఖాస్తు చేయడానికి చివరి తేదీ : 08-10-2025 (రాత్రి 11PM వరకు)
విద్యార్హతలు :
తప్పనిసరిగా ఐటిఐలో డ్రాట్ మ్యాన్ (సివిల్) ట్రేడ్ సర్టిఫికేట్ కలిగివుండాలి లేదా అందుకు సమానమైన అర్హతలు కలిగివుండాలి.
వయోపరిమితి : 18-42 ఏళ్లలోపు వయసుండాలి (01-07-2025 నాటికి)
భర్తీచేయనున్న మొత్తం ఖాళీలు - 01
సాలరీ : రూ.37,640 నుండి రూ.1,15,500 వరకు ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 17-09-2025
దరఖాస్తు చేయడానికి చివరి తేదీ : 07-10-2025 (రాత్రి 11PM వరకు)
విద్యార్హతలు :
తప్పనిసరిగా ప్రభుత్వ గుర్తింపుపొందిన యూనివర్సిటీ నుండి బిఈడి లేదా అందుకు సమానమైన విద్యార్హతలు కలిగివుండాలి.
వయోపరిమితి : 18-42 ఏళ్లలోపు వయసుండాలి (01-07-2025 నాటికి)
భర్తీచేయనున్న మొత్తం ఖాళీలు - 02
సాలరీ : రూ.57,100 నుండి రూ.1,47,760 వరకు ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 17-09-2025
దరఖాస్తు చేయడానికి చివరి తేదీ : 07-10-2025 (రాత్రి 11PM వరకు)
విద్యార్హతలు :
తప్పనిసరిగా ప్రభుత్వ గుర్తింపుపొందిన యూనివర్సిటీ నుండి ఆర్ట్స్ లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. సైన్స్ లేదా కామర్స్ (B.A/B.Sc/B.Com). లైబ్రరీ సైన్స్ లో పిజి చేసివుండాలి.
వయోపరిమితి : 18-42 ఏళ్లలోపు వయసుండాలి (01-07-2025 నాటికి)