నేడు తెలంగాణలో వర్షాలు..
నేడు (ఆగస్ట్ 8, శనివారం) తెలంగాణలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ముఖ్యంగా ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయంటోంది. ఆదిలాబాద్, కొమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయట. అలాగే రాష్ట్రవ్యాప్తంగా గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.