ఇంకా, రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగంలో కీలక కార్యక్రమాలకు కూడా సిద్ధమవుతోంది. జూలై 10న ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలలు, జూనియర్ కళాశాలల స్థాయిలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశాలను నిర్వహించనున్నారు. దీని ద్వారా విద్యా విధానాల్లో మార్పులకు తల్లిదండ్రుల అభిప్రాయాలను తీసుకోవాలనుకుంటున్నారు.ఇక ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపిక ప్రక్రియ కూడా జోరుగా సాగుతోంది. జాతీయ స్థాయిలో ఇచ్చే ఉపాధ్యాయ అవార్డుల కోసం ఈ నెల 13వరకు దరఖాస్తుల్ని స్వీకరిస్తారు. రాష్ట్ర స్థాయిలో ఏర్పడే ఎంపిక కమిటీ ఆగస్టు 4లోపు జాబితాను కేంద్రానికి పంపుతుంది. ఆ తరువాత ఆగస్టు 5 నుంచి 12 వరకు వీడియో ఇంటర్వ్యూలు నిర్వహించి, 13న తుది ఎంపిక జాబితాను ఖరారు చేస్తారు. ఎంపికైన ఉపాధ్యాయులకు సెప్టెంబర్ 4, 5 తేదీల్లో అవార్డులు అందజేయనున్నారు.