Andhra Pradesh: డ్వాక్రా మహిళలకు అదిరిపోయే ఛాన్స్‌.. ఒక్కొక్కరికి రూ.2.50లక్షలు

Published : Jul 01, 2025, 12:09 PM IST

డీజీ లక్ష్మి పథకంతో ఏపీ పట్టణాల్లో 9,034 సర్వీసు కేంద్రాలు, మహిళలకు ఉపాధి, ప్రజలకు 250 సేవలు అందించనున్న ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.

PREV
15
డీజీ లక్ష్మి పథకాన్ని

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టణ ప్రాంత ప్రజలకు సేవల్ని మరింత సులభంగా అందించాలనే లక్ష్యంతో కొత్తగా డీజీ లక్ష్మి పథకాన్ని ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 9,034 కామన్ సర్వీస్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ కేంద్రాలు ప్రజలకు 250 రకాల సేవల్ని ఒకేచోట అందించనున్నాయి.ఈ కేంద్రాల ప్రత్యేకత ఏమిటంటే, వీటిని డ్వాక్రా మహిళలు నిర్వహించనుండటం. అంటే ఒకవైపు మహిళలకు ఉపాధి అవకాశాలు కలుగుతాయి, మరోవైపు ప్రజలకు ప్రభుత్వ సేవలు సులభంగా లభిస్తాయి. 

25
స్వయం సహాయక సంఘాల మహిళల్ని

దీనికోసం మెప్మా (మిషన్ ఫర్ ఎలివియేషన్ ఆఫ్ పావర్టీ ఇన్ మున్సిపల్ ఏరియాస్) ద్వారా అర్హులైన స్వయం సహాయక సంఘాల మహిళల్ని ఎంపిక చేయనున్నారు. ప్రభుత్వం ఈ మేరకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది.మీ-సేవా మాదిరిగానే ఈ డీజీ లక్ష్మి కేంద్రాల్లో పౌరులు ప్రభుత్వం అందించే పలు సేవలకు దరఖాస్తులు చేసుకోవచ్చు. వాటిలో పథకాల అప్లికేషన్లు, సర్టిఫికెట్లు, లైసెన్స్‌లు, వాలిడేషన్‌లు, ఇతర పౌర సేవలు ఉంటాయి.ఈ కేంద్రాలను నిర్వహించాలనుకునే మహిళలకు కొన్ని అర్హతలు తప్పనిసరి. కనీసం మూడు సంవత్సరాలుగా స్వయం సహాయక సంఘంలో సభ్యత్వం ఉండాలి. వయస్సు 21 నుండి 40 సంవత్సరాల మధ్య ఉండాలి. తాము పెళ్లి అయినవారై ఉండాలి. డిగ్రీ చదివి ఉండాలి. స్లమ్ లెవెల్ ఫెడరేషన్ పరిధిలో నివసిస్తూ, స్మార్ట్‌ఫోన్ వాడుతున్న వారు అయి ఉండాలి.

35
రూ.2.50 లక్షల రుణాన్ని

ఎంపికైన మహిళలకు కేంద్ర ఏర్పాటుకు అవసరమైన సదుపాయాల కోసం రూ.2.50 లక్షల వరకు రుణాన్ని ప్రభుత్వం అందించనుంది. దీన్ని కియోస్క్ ఏర్పాటు, కంప్యూటర్, ప్రింటర్, ఇంటర్నెట్, ఇతర అవసరాల కోసం వినియోగించవచ్చు.ఈ పథకం ద్వారా ప్రభుత్వం ప్రజలకు మరింత దగ్గరయ్యే ప్రయత్నంలో ఉంది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో మహిళల ఆర్థిక స్థితిగతుల మెరుగుదల దృష్ట్యా ఇది బలమైన ప్రయత్నంగా పరిగణించవచ్చు.

45
నైపుణ్యాభివృద్ధి రంగం

ఇక నైపుణ్యాభివృద్ధి రంగంలో కూడా ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారిస్తోంది. పట్టణ స్థానిక సంస్థల్లో పనిచేసే ప్రజాప్రతినిధులు, సిబ్బంది, ఉద్యోగులతో పాటు, స్వయం సహాయక సంఘాల సభ్యులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనుంది. ఇందుకోసం రూ.23.84 కోట్లు వెచ్చించనుంది. ఈ శిక్షణ స్వచ్ఛ భారత్ అర్బన్ 2.0 కార్యక్రమంలో భాగంగా ఉంటుంది. 123 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీల్లో ఈ శిక్షణ కార్యక్రమం అమలు చేయనున్నారు.నైపుణ్యాభివృద్ధి శిక్షణను అమలు చేయడానికి AILSG, సాహాస్, వాష్ సంస్థలను ఎంపిక చేయనున్నారు. రాష్ట్రంలోని స్వచ్ఛాంధ్ర సంస్థకు ఇందుకోసం ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది.

55
గోదావరి నది కాలుష్యాన్ని

కుప్పం నియోజకవర్గంలో కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. అక్కడి 51 చెరువులను అభివృద్ధి చేసేందుకు రూ.14.41 కోట్లు మంజూరు చేసింది. ఈ ప్రాజెక్టు 'స్వర్ణకుప్పం-2029' మార్గదర్శక పథకంలో భాగంగా జరుగుతోంది. జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేశారు.ఇక రాజమహేంద్రవరం సమీపంలో గోదావరి నది కాలుష్యాన్ని తగ్గించేందుకు రూ.25 కోట్లు విడుదల చేసింది. జాతీయ నదుల సంరక్షణ కార్యక్రమం కింద ఈ ప్రాజెక్టు చేపడుతున్నారు. గోదావరి నదిని శుద్ధి చేయడానికి అవసరమైన తదుపరి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.

Read more Photos on
click me!

Recommended Stories