Mega parent teacher meeting: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ఏపీ ప్రభుత్వం జూలై 5న స్కూల్స్, జూలై 10న కాలేజీల్లో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహించనుంది. 2 కోట్లకు పైగా ప్రజలు ఈ సమావేశాల్లో పాల్గొననున్నారు.
Ap mega parent teacher meeting: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యా రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు జూలై లో రాష్ట్రవ్యాప్తంగా స్కూల్స్, కాలేజీలలో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లను ప్లాన్ చేసింది. జులై 5, 2025న రాష్ట్రవ్యాప్తంగా 61,000కి పైగా పాఠశాలల్లో మేగా పేరెంట్-టీచర్ మీటింగ్ (PTM) నిర్వహించనుంది. సమగ్ర శిక్షా అభియాన్, జాతీయ విద్యా విధానం (NEP) 2020కు అనుగుణంగా ఈ కార్యక్రమం రూపొందించారు. విద్యార్థుల విద్యా పురోగతిలో తల్లిదండ్రుల భాగస్వామ్యాన్ని పెంచడమే ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యంగా ఉంది.
26
పెద్ద సంఖ్యలో పాల్గొననున్న తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు
ఈ పీటీఎంలో రాష్ట్రవ్యాప్తంగా 2 కోట్లకు పైగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, కమ్యూనిటీ సభ్యులు పాల్గొననున్నారని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇది దేశంలోనే అతిపెద్ద విద్యా సంబంధిత కార్యక్రమాలలో ఒకటిగా గుర్తింపు సాధించనుంది.
ఈ సమావేశాల ద్వారా పాఠశాలలు, తల్లిదండ్రుల మధ్య నేరుగా సమాచార మార్పిడి సాధ్యమవుతుందని, విద్యార్థుల పురోగతిలో పారదర్శకత, బాధ్యతాభావం పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు.
36
జూనియర్ కాలేజీల్లో కూడా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్
జులై 10న మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ను నిర్వహించాలని ఆంధ్రప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వం జూనియర్ కాలుజీలతో పాటు ప్రయివేటు, ఎయిడెడ్, జూనియర్ కాలుజీల్లో మెగా పెరెంట్ టీచర్ మీటింగ్ ను నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది.
ప్రధానోపాధ్యాయుల ఆధ్వర్యంలో జరిగే ఈ బహిరంగ సమావేశంలో విద్య, మౌలిక సదుపాయాలు, వసతులు, కార్యచరణ ప్రణాళికలను వివరిస్తారు. పిల్లల మానసిక ఆరోగ్యం, పురోగతిపై సెషన్లు, ఆటల పోటీలు కూడా నిర్వహించనున్నట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
ఏపీలో నిర్వహించే మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో చర్చించనున్న అంశాలు ఇవే
మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో విద్యార్థుల అకడమిక్ పనితీరు, హాజరు అంశాలు, పాఠశాల, కాలేజీల వసతుల అవసరాలు, తల్లిదండ్రులు-స్థానికుల అభిప్రాయాలు వంటి అంశాలపై చర్చ జరగనుంది. పాఠశాల స్థాయి సమావేశంగా మాత్రమే కాకుండా, ఇది సముదాయంతో విద్యా పరమైన సంభాషణగా మారనుంది.
56
ప్రభుత్వ ప్రతినిధుల భాగస్వామ్యంతో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్
ప్రతీ జిల్లాలో విద్యా అధికారులతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు కూడా ఈ సమావేశాల్లో పాల్గొననున్నారు. ఇది ప్రభుత్వ, పాఠశాల, సముదాయం మధ్య సంబంధాలను బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు. దీనిపై మంత్రి నారా లోకేశ్ కూడా ప్రకటన చేశారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేశ్ మాట్లాడుతూ.. "తల్లిదండ్రుల భాగస్వామ్యం విద్యార్థి విజయానికి కీలకం. ఈ కార్యక్రమం ద్వారా పాఠశాలలతో కుటుంబాల మధ్య నమ్మకాన్ని బలపరచగలుగుతాం" అని తెలిపారు.
66
మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కు ప్రత్యేక ఏర్పాట్లు
పెద్ద సంఖ్యలో హాజరయ్యే తల్లిదండ్రుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. మీటింగ్ సమయాలు, పలు భాషలలో సమాచార పత్రాలు అందించడం ద్వారా పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల మధ్య సమానత తీసుకురావాలని అధికారులు భావిస్తున్నారు. ఈ పేరెంట్-టీచర్ మీటింగ్ ద్వారా విద్యా వ్యవస్థలో తల్లిదండ్రుల పాత్రను మరింత సమర్థవంతంగా వినియోగించుకునే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేస్తోంది.