IMD Cold Wave and Rain Alerts : తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో మళ్లీ వర్షాలు జోరందుకోనున్నాయట… ఏఏ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయో వాతావరణ శాఖ ప్రకటించింది.
IMD Weather Alert : తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు మొదలయ్యాయి. మొంథా తుపాను తర్వాత వాతావరణ పరిస్థితులు పూర్తిగా మారిపోయి వర్షాలు మాయమయ్యాయి. శీతాకాలం అరంభంలోనే ఉష్ణోగ్రతలు పూర్తిగా పడిపోయాయి. గత పదిరోజులుగా అయితే చలి చంపేస్తోంది... దీంతో ఇక వర్షాల కథ ముగిసినట్లేనని తెలుగు ప్రజలు భావించారు. కానీ వదల బొమ్మాలీ వదల అంటూ మళ్లీ వర్షాలు మొదలయ్యాయి… రేపు (నవంబర్ 21, శుక్రవారం) నుండి వానలు మరింత జోరందుకుంటాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
25
ఏపీలోని ఈ మూడు జిల్లాల్లో వర్షాలు
బంగాళాఖాతంలో ఇప్పటికే ఓ అల్పపీడనం కొనసాగుతోంది... నవంబర్ 22న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని ఆంధ్ర ప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే కొన్నిజిల్లాల్లో వర్షాలు మొదలయ్యాయి... ఇవి మరింత జోరందుకుంటాయని APSDMA హెచ్చరిస్తోంది. రేపు(శుక్రవారం) ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.
35
నవంబర్ 24 నుండి 27 వరకు భారీ వర్షాలు
వచ్చ శనివారం బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం మరింత బలపడుతుందని APSDMA హెచ్చరిస్తోంది. అల్పపీడనం ఏర్పడ్డాక 48 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ వాయుగుండంగా బలపడే అవకాశాలు ఉన్నాయంటోంది.
ఈ వాయుగుండం బలపడి తుపానుగా మారితే మాత్రం మరోసారి తెలుగు రాష్ట్రాల్లో వర్షబీభత్సం తప్పదు.. మరీ ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ లో అల్లకల్లోలం ఎక్కువగా ఉంటుంది. తుపాను లేకున్నా వాయుగుండం ప్రభావంతో నవంబర్ 24 నుండి 27 వరకు కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.
తెలంగాణ విషయానికి వస్తే.. రాబోయే రెండ్రోజులు (శుక్ర,శనివారం) చలి వాతావరణమే కొనసాగుతుంది... ఎలాంటి వర్షాలుండవని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదివారం నుండి చిరుజల్లుల నుండి మోస్తరు వర్షాలు మొదలవుతాయని తెలిపింది. దక్షిణ తెలంగాణ జిల్లాలైన మహబూబ్ నగర్, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల, నాగర్ కర్నూల్, సూర్యాపేట, నల్గొండ, మహబూబాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ ఆదివారం వర్షాలు కురుస్తాయని ప్రకటించింది.
55
నవంబర్ 24న ఈ తెలంగాణ జిల్లాల్లో వర్షసూచనలు
నవంబర్ 24 అంటే సోమవారం కూడా తెలంగాణలో వర్షాలు కొనసాగే అవకాశాలున్నాయట. వనపర్తి, నాగర్ కర్నూల్, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, ఖమ్మం జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ వర్షాల వల్ల గాలిలో తేమ పెరిగి చలి తగ్గుతుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. అంటే తెలంగాణలో వచ్చే ఆదివారం నుండి ఉష్ఱోగ్రత సాధారణ స్థాయికి చేరుకుని చలి తగ్గుతుందన్నమాట.