AP SSC Results: ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థుల ఎదురు చూపులకు ఇక ముగింపు రానుంది. ఈ ఏడాది SSC ఫలితాలను ఏప్రిల్ 30 ఉదయం 11 గంటలకు విడుదల చేయడానికి విద్యాశాఖ సిద్ధమైంది.
ఈసారి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించారు. ఈ పరీక్షల్లో సుమారు 6.3 లక్షల మంది విద్యార్థులు పాల్గొన్నారు. పరీక్షలు పూర్తయినప్పటి నుంచి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ ఎదురుచూపులకు చెక్ పెడుతూ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ అధికారికంగా ఫలితాలను ప్రకటించనున్నారు. ఫలితాల విడుదలకు అవసరమైన సాంకేతిక ప్రక్రియలను ఇప్పటికే పూర్తి చేశారు.
25
అధికారిక వెబ్‌సైట్లలో ఫలితాలు ఎలా చూడాలి?
ఫలితాలు విడుదలైన వెంటనే విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ల ద్వారా తమ మార్కులు తెలుసుకోవచ్చు. ఇందుకోసం వెబ్‌సైట్ https://results.bse.ap.gov.in/ తో పాటు https://telugu.abplive.com/ ఓపెన్ చేసి, తమ హాల్ టికెట్ నంబర్ నమోదు చేస్తే ఫలితాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి. ఫలితాల సమయంలో సర్వర్లు బిజీగా ఉండే అవకాశం ఉన్నందున కొంత ఆలస్యంగా లేదా పలుమార్లు ప్రయత్నించడం అవసరం కావచ్చు.
35
వాట్సాప్ ద్వారా కూడా
ప్రభుత్వం విద్యార్థుల సౌకర్యార్థం వాట్సాప్ సేవను కూడా అందుబాటులో ఉంచింది. విద్యార్థులు తమ మొబైల్‌లో 9552300009 నంబర్ సేవ్ చేసి, వాట్సాప్‌లో ‘Hi’ అని మెసేజ్ పంపితే అక్కడ సూచనలు కనిపిస్తాయి. ఆ సూచనలను అనుసరించి హాల్ టికెట్ నంబర్ నమోదు చేస్తే వెంటనే మార్కుల మెమో మొబైల్‌లో కనిపిస్తుంది. ఈ విధానం వేగంగా ఫలితాలు తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది.
ఫలితాలను తెలుసుకోవడానికి మొబైల్ యాప్‌లను కూడా ఉపయోగించవచ్చు. LEAP వంటి యాప్‌ల ద్వారా విద్యార్థులు తమ వివరాలు నమోదు చేసి మార్కులు సులభంగా పొందవచ్చు. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ద్వారా లాగిన్ అయ్యే సౌకర్యం ఉండటం వల్ల ఈ ప్రక్రియ మరింత సులభంగా ఉంటుంది.
55
మూల్యాంకనంలో తీసుకున్న కొత్త చర్యలు
ఈ ఏడాది ఫలితాల ఖచ్చితత్వాన్ని పెంచేందుకు ప్రభుత్వం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంది. ఆన్సర్ షీట్ల మూల్యాంకనం పూర్తయ్యాక మార్కులను కేవలం రికార్డుల్లో మాత్రమే కాకుండా ట్యాబ్‌లలో కూడా వెంటనే నమోదు చేశారు. దీంతో పొరపాట్లు తగ్గి, ఫలితాలు మరింత నమ్మకంగా ఉండనున్నాయి.