Weather Update: ఏపీలో వింత వాతావరణం.. ఒకవైపు మండుతున్న ఎండలు.. మరోవైపు పిడుగులతో వర్షం.. ఈ ప్రాంతాలకు అలర్ట్

Published : Apr 28, 2026, 11:14 PM IST

Weather Update : ఆంధ్రప్రదేశ్‌లో ఎండలు ముదురుతున్నాయి. మార్కాపురం, కడపలో 44.3 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కాగా, బుధవారం 21 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ, విపత్తు నిర్వహణ విభాగాలు హెచ్చరించాయి.

PREV
15
Weather Update: మండుతున్న ఎండలు.. 44 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు.. ఈ జిల్లాల వారు తస్మాత్ జాగ్రత్త !

ఆంధ్రప్రదేశ్ లో ఎండలు మండిపోతున్నాయి. ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతుండటంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మంగళవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ ఒక ప్రకటన విడుదల చేశారు.

25
రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు: 44.3 డిగ్రీల సెల్సియస్ పైనే

మంగళవారం రాష్ట్రంలో ఎండ తీవ్రత అత్యధికంగా ఉంది. మార్కాపురం జిల్లా కంభం, వైఎస్సార్ కడప జిల్లా ఒంటిమిట్టలో అత్యధికంగా 44.3 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలోని మొత్తం 28 జిల్లాలకు గాను 16 జిల్లాల్లోని 140 మండలాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 41 డిగ్రీల కంటే ఎక్కువగా నమోదైనట్లు ప్రఖర్ జైన్ వివరించారు. ముఖ్యంగా నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో 44.1°C, నెల్లూరు జిల్లా కొమ్మిపాడులో 43.8°C ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

35
21 మండలాలకు తీవ్ర వడగాల్పుల హెచ్చరికలు

బుధవారం కూడా ఎండల తీవ్రత కొనసాగనుందని తెలిపింది. విజయనగరం, పార్వతీపురమన్యం జిల్లాల్లోని 21 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. మరో 7 మండలాల్లో సాధారణ వడగాల్పులు వీస్తాయని అంచనా వేసింది.

• విజయనగరం జిల్లా: బాడంగి, బొబ్బిలి, మెరకముడిదాం, రామభద్రాపురం, సంతకవిటి, తెర్లాం, వంగర.

• పార్వతీపురంమన్యం జిల్లా: బలిజిపేట, గరుగుబిల్లి, గుమ్మలక్ష్మీపురం, జియ్యమ్మవలస, కొమరాడ, కురుపాం, మక్కువ, పాచిపెంట, పాలకొండ, పార్వతీపురం, సాలూరు, సీతంపేట, సీతానగరం, వీరఘట్టం మండలాల్లో తీవ్ర ప్రభావం ఉండనుంది.

45
ద్రోణి ప్రభావంతో పిడుగులతో కూడిన వర్షాలు

ఒకవైపు ఎండలు మండిపోతుంటే, మరోవైపు రాయలసీమ, తమిళనాడు మీదుగా కొమొరిన్ వరకు విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావం కనిపిస్తోంది. దీని కారణంగా బుధవారం రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో వాతావరణం అకస్మాత్తుగా మారే అవకాశం ఉంది.

పార్వతీపురమన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లా, పోలవరం, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. వర్షం కురిసే సమయంలో పొలాల్లో పనిచేసే రైతులు, పశువుల కాపరులు చెట్ల కింద ఉండకూడదని, సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని అధికారులు హెచ్చరించారు.

55
అప్రమత్తంగా ఉండండి

వడగాలులు, తీవ్రమైన ఉక్కపోత దృష్ట్యా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు. అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం వేళల్లో బయటకు రావద్దని కోరారు. ముఖ్యంగా గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు, షుగర్, బీపీ రోగులు ఎండలో తిరగడం ఏమాత్రం మంచిది కాదని హెచ్చరించారు.

• దాహం వేసినా వేయకపోయినా తరచుగా నీరు తాగుతూ ఉండాలి.

• శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా జాగ్రత్త పడాలి.

• బయటకు వెళ్లినప్పుడు వేడి గాలి నేరుగా చెవుల్లోకి వెళ్లకుండా కప్పుకోవాలి.

• కళ్ల రక్షణ కోసం సన్ గ్లాసెస్ ధరించడం మంచిదని తెలిపారు.

Read more Photos on
click me!

Recommended Stories