ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో కూటమి హవా.. జ‌గ‌న్ కంచు కోట‌లో కూడా

Published : Nov 03, 2026, 09:30 PM IST

AP Municipal Election Results: ఆంధ్రప్రదేశ్ మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల ఎన్నికల ఫలితాల్లో కూటమి పార్టీలు సత్తా చాటాయి. ప్రధాన నగరాల్లో మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంటూ ఆధిపత్యాన్ని ప్రదర్శించాయి. ఇప్ప‌టివ‌ర‌కు వెల్ల‌డైన ఫ‌లితాలు ఇలా ఉన్నాయి.

PREV
16
తిరుపతి, చిత్తూరు కార్పొరేషన్లలో కూటమి ఘన విజయం

తిరుపతి నగరపాలక సంస్థ ఎన్నికల్లో కూటమి స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించింది. మొత్తం 66 స్థానాలకు గానూ బీజేపీ 38, జనసేన 19, టీడీపీ 3 స్థానాలను గెలుచుకున్నాయి. దీంతో కూటమి బలం 60 స్థానాలకు చేరింది. వైసీపీ మూడు స్థానాలకే పరిమితం కాగా, మరో మూడు స్థానాల్లో ఇతరులు విజయం సాధించారు. టీడీపీ మేయర్ అభ్యర్థి మన్నెం శ్రీనివాస ప్రసాద్ గెలుపొందారు. చిత్తూరు నగరపాలక సంస్థలోనూ టీడీపీ భారీ విజయాన్ని నమోదు చేసింది. మొత్తం 60 డివిజన్లలో ఆ పార్టీ 51 స్థానాలను కైవసం చేసుకుంది. జనసేనకు రెండు, బీజేపీకి ఒక స్థానం దక్కాయి. వైసీపీ నాలుగు డివిజన్లలో గెలవగా, ఒక స్థానంలో ఇతరులు విజయం సాధించారు. మరో డివిజన్ ఫలితం వెల్లడికావాల్సి ఉంది. టీడీపీ మేయర్ అభ్యర్థి కఠారి హేమలత విజయం సాధించారు.

26
పులివెందులలో టీడీపీ రికార్డు విజయం

వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు సొంత ప్రాంతమైన పులివెందుల మున్సిపాలిటీలో టీడీపీ చారిత్రక విజయాన్ని అందుకుంది. ఆ పార్టీ ఛైర్‌పర్సన్ అభ్యర్థి గీతాకుమారి 13,875 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. పోలింగ్ జరిగిన 20 వార్డుల్లో 17 స్థానాలను కూటమి కైవసం చేసుకుంది. ముందస్తు ఏకగ్రీవాలతో కలిపి మొత్తం 37 వార్డులు కూటమి ఖాతాలో చేరాయి. వైసీపీకి కేవలం మూడు వార్డులే దక్కాయి. జగన్ సొంత ఇలాకాలో వచ్చిన ఈ ఫలితం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

36
విశాఖలో టీడీపీ ఆధిక్యం.. వైసీపీలో తండ్రీకూతుళ్ల విజయం

గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ భారీ ఆధిక్యాన్ని ప్రదర్శించింది. ఇప్పటివరకు లెక్కించిన 4,36,676 ఓట్లలో టీడీపీకి 2,56,881 ఓట్లు, వైసీపీకి 1,37,194 ఓట్లు వచ్చాయి. ఇతరులకు 37,163, కాంగ్రెస్‌కు 5,434 ఓట్లు పోలయ్యాయి. దీంతో టీడీపీ మేయర్ అభ్యర్థి 1,19,683 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మొత్తం 120 డివిజన్లలో ఇప్పటివరకు టీడీపీ 27, జనసేన 10, బీజేపీ 5 స్థానాలు గెలుచుకున్నాయి. వైసీపీ నాలుగు, ఇతరులు రెండు డివిజన్లలో విజయం సాధించారు. మరో 24 డివిజన్లలో కూటమి అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. ఇదే కార్పొరేషన్‌లో వైసీపీకి చెందిన తండ్రీకూతుళ్లు విజయం సాధించడం మరో విశేషం. ఆరో వార్డు నుంచి పోతిన హనుమంతరావు 150 ఓట్ల మెజార్టీతో గెలుపొందగా, ఏడో వార్డు నుంచి ఆయన కుమార్తె జాహ్నవి విజయం సాధించారు. ఒకవైపు టీడీపీ మేయర్ అభ్యర్థి శ్రావణి భారీ ఆధిక్యంలో ఉండగా, మరోవైపు వైసీపీ అభ్యర్థులుగా తండ్రీకూతుళ్లు గెలవడం ఆసక్తి రేపింది.

46
నందికొట్కూరులో వైసీపీ హవా.. ధర్మవరంలో ఒక్క ఓటుతో గెలుపు

రాష్ట్రవ్యాప్తంగా కూటమి పార్టీలు ఆధిక్యంలో ఉన్నప్పటికీ నంద్యాల జిల్లా నందికొట్కూరు మున్సిపాలిటీలో వైసీపీ పైచేయి సాధించింది. మొత్తం 32 వార్డులకు గానూ 23 స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. దీంతో మున్సిపల్ పీఠాన్ని వైసీపీ దక్కించుకుంది.

ఇక ధర్మవరం మున్సిపాలిటీలోని ఒకటో వార్డు ఫలితం తీవ్ర ఉత్కంఠకు దారితీసింది. వైసీపీ అభ్యర్థి చెలిమి రామకృష్ణమ్మ కేవలం ఒక్క ఓటు ఆధిక్యంతో గెలుపొందారు. బీజేపీ అభ్యర్థి సాకే లక్ష్మీదేవి అభ్యంతరం వ్యక్తం చేయడంతో అధికారులు రీకౌంటింగ్ నిర్వహించారు. అయినప్పటికీ ఫలితంలో మార్పు రాలేదు. రామకృష్ణమ్మ ఒక్క ఓటుతో గెలిచినట్లు అధికారులు ధ్రువీకరించారు.

56
గొల్లప్రోలులో జనసేన జోరు.. వైసీపీకి ఒక్క సీటు కూడా దక్కలేదు

కాకినాడ జిల్లా గొల్లప్రోలు మున్సిపాలిటీలో జనసేన పార్టీ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. మొత్తం 23 వార్డులకు గానూ 13 స్థానాలను గెలుచుకుంది. టీడీపీ ఆరు వార్డుల్లో విజయం సాధించగా, ఇతరులు నాలుగు స్థానాలను దక్కించుకున్నారు. వైసీపీ ఒక్క వార్డులో కూడా గెలవలేకపోయింది. దీంతో గొల్లప్రోలు మున్సిపాలిటీ జనసేన వశమైంది. కూటమి పార్టీల మధ్య సమన్వయం ఫలితంగా ఈ విజయం సాధ్యమైందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.

66
పిఠాపురంలో జనసేనకు భారీ మెజార్టీ

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం మున్సిపాలిటీలో జనసేన ఘన విజయం సాధించింది. ఆ పార్టీ ఛైర్మన్ అభ్యర్థి దానం లాజర్ బాబు 8,944 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. మొత్తం 36 వార్డుల్లో మూడు స్థానాలు ముందుగానే ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన స్థానాల్లో జనసేన 16, టీడీపీ 5, బీజేపీ ఒక వార్డును గెలుచుకున్నాయి. స్వతంత్ర అభ్యర్థులు 10 స్థానాల్లో విజయం సాధించగా, వైసీపీ ఒక్క వార్డుకే పరిమితమైంది. మొత్తంగా పిఠాపురంలో జనసేన తన పట్టును మరోసారి నిరూపించుకుంది.

Read more Photos on
click me!

Recommended Stories