అర్నబ్, మురసు తుపానుల కారణంగా ఆంధ్ర ప్రదేశ్ విద్యార్థులకు వరుస సెలవులు వచ్చాయి. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఈ సెలవుల పరంపర కొనసాగుతోంది. రేపు, ఎల్లుండి రెండ్రోజులు విద్యాసంస్థలకు సెలవులు ఇచ్చింది ప్రభుత్వం.
School Holidays : ఆంధ్ర ప్రదేశ్ లో విద్యాసంస్థలకు వరుస సెలవులు వస్తున్నాయి. దసరా పండగ నుండి తాజాగా మురసు తుపాను వరకు సెలవులు కొనసాగాయి... తాజాగా ఎన్నికల సెలవులు మొదలయయ్యాయి. ఏపీ విద్యార్థులకు దసరాకి 12 రోజులు పండగ హాలిడేస్ ముగియగానే అర్నబ్ తుపాను కారణంగా సెలవులు వచ్చాయి. ఈ తుపాను ప్రభావం ఇలా తగ్గగానే మురసు తుపాను కారణంగా వర్షాలు మొదలయ్యాయి... దీంతో గత రెండుమూడు రోజులుగా అతిభారీ వర్షాలు కురుస్తుండటంతో కొన్ని జిల్లాల్లో స్కూళ్లకి సెలవులిచ్చింది ప్రభుత్వం.
అయితే మురసు తుపాను ముగిసింది... ఇక విద్యాసంస్థలకు సెలవులు ముగిసినట్లే అనుకుంటుంటే ఎన్నికల సెలవులు మొదలయ్యాయి. స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ఏపీ విద్యార్థులకు మరో రెండ్రోజులు సెలవులు వచ్చాయి. ఇవి ముగియగానే పంచాయితీ ఎన్నికల సెలవులు వస్తాయి... ఇలా అక్టోబర్ లో మాదిరిగానే నవంబర్ లో కూడా తెలుగు విద్యార్థులకు సెలవులే సెలవులు వస్తున్నాయి.
24
రేపు, ఎల్లుండి విద్యాసంస్థలకు సెలవు
ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికల హడావిడి ముగిసింది... గత ఆదివారం (నవంబర్ 1) పోలింగ్ జరగ్గా ఇవాళ (నవంబర్ 3, మంగళవారం) ఓట్ల లెక్కింపు, పలితాలు వెల్లడి జరిగింది. ఇక ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికల హడావిడి మొదలయ్యింది... ఇప్పటికే నోటిఫికేషన్ వెలువడి నామినేషన్లు, ప్రచారం ముగిసింది. నవంబర్ 5 (గురువారం) పోలింగ్ జరగనుంది... దీంతో ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో సెలవులు వచ్చాయి.
ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికల్లో భాగంగా స్థానిక స్కూళ్లు, కాలేజీల్లోనే పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేయనున్నారు. ఇందుకోసం ముందురోజే ఆయా పోలింగ్ కేంద్రాలను ఎన్నికల సిబ్బంది స్వాదీనం చేసుకుని ఏర్పాట్లు చేసుకుంటారు. కాబట్టి పోలింగ్ జరిగే ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలకు రేపు, ఎల్లుండి (నవంబర్ 4, 5 తేదీల్లో) సెలవు ఉంటుంది. కేవలం పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుచేసే విద్యాసంస్థలకే ఈ సెలవు వర్తిస్తుంది... మిగతా స్కూల్స్ యదావిధిగా కొనసాగుతాయి.
34
నవంబర్ 7న సెలవే
నవంబర్ 5న ఎంపిటిసి, జడ్పిటిసి పోలింగ్ జరగనుంది.. ప్రజలు ఓటుహక్కును వినియోగించుకున్నాక బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూమ్ కు తరలిస్తారు. తిరిగి నవంబర్ 7న అంటే వచ్చే శనివారం భద్రపర్చిన బ్యాలట్ బాక్సులను బయటకు తీసి కౌంటింగ్ కేంద్రాలకు తరలిస్తారు. ఇక్కడ ఎన్నికల సిబ్బంది ఓట్ల లెక్కింపు చేపట్టి పలితాలను వెల్లడించనున్నారు.
అయితే ఓట్ల లెక్కింపు అంటే కౌంటింగ్ కేంద్రాలను స్థానిక స్కూళ్లు, కాలేజీలలో ఏర్పాటుచేయనున్నారు. కాబట్టి ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికల పలితాల రోజు అంటే వచ్చే శనివారం కూడా కొన్ని విద్యాసంస్థలకు సెలవు ఉండనుంది. ఈ సెలవు అందరికి వర్తించదు... కేవలం కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటుచేసిన స్కూళ్ళు, కాలేజీలలో చదివే విద్యార్థులకు మాత్రమే వర్తిస్తుంది.
ఆంధ్ర ప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికలు ముగిశాయి... ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికలు కూడా త్వరలోనే ముగియనున్నాయి. ఆ తర్వాత గ్రామ పంచాయితీ ఎన్నికలు జరగనున్నాయి. మూడు విడతల్లో రాష్ట్రంలోని అన్ని పంచాయితీలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ క్రమంలో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేసే విద్యాసంస్థలకు మళ్ళీ సెలవులు రానున్నాయి.
గ్రామ పంచాయితీ పోలింగ్ తేదీలివే..
నవంబర్ 26న మొదటి విడత పోలింగ్ జరగనుంది... ప్రభుత్వ పాఠశాలల్లోనే పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుచేస్తారు... కాబట్టి ఈరోజు ఆయా పంచాయితీల పరిధిలోని విద్యాసంస్థలకు సెలవు ఉంటుంది. ఇక నవంబర్ 29న రెండో విడత, డిసెంబర్ 2న మూడో విడత పోలింగ్ జరగనుంది... ఈ రోజుల్లో కూడా ఆయా గ్రామాల్లోని విద్యాసంస్థలకు సెలవు ఉంటుంది.