Job Calendar 2026 : ఏ నెల, ఏ తేదీ, ఏ శాఖలో, ఎన్ని ఉద్యోగాలు.. ప్లాన్ చేసుకుంటే ఓ జాబ్ మీదే

Published : Mar 20, 2026, 10:30 AM IST

కూటమి ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్ యువతకు ఉగాది కానుక అందించింది. ఒకటిరెండు కాదు ఏకంగా 10 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సిద్దమయ్యింది… జాబ్ క్యాలెండర్ ను కూడా ప్రకటించింది. 

PREV
15
ఇక ఉద్యోగాలే ఉద్యోగాలు..

Andhra Pradesh Jobs : ఆంధ్ర ప్రదేశ్ యువతీయువకులకు గుడ్ న్యూస్. తెలుగు నూతన సంవత్సరాది ఉగాదిని పురస్కరించుకుని కూటమి ప్రభుత్వం మరో ఎన్నికల హామీని నెరవేర్చింది. ఈ ఏడాది అంటే 2026 కు సంబంధించిన జాబ్ క్యాలెండర్ ను విడుదల చేసింది.

ఇప్పటికే హోంశాఖలో పోలీస్, విద్యాశాఖలో మెగా డిఎస్సి ద్వారా భారీగా ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ చేపట్టింది ప్రభుత్వం. ఇప్పుడు ఈ శాఖలతో పాటు ఇతర విభాగాల్లోనూ ఉద్యోగాల భర్తీకి సిద్దమయ్యింది... ఇందులో భాగంగానే ఈ ఏడాది భర్తీ చేసే ఉద్యోగాల వివరాలతో జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది. ఏ నెలలో, ఏఏ విభాగాల్లో, ఎన్ని ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడనున్నాయో ఇక్కడ తెలుసుకుందాం.

25
ఈ ఏడాది వెలువడే ఉద్యోగ నోటిఫికేషన్లు...

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం 2026 లో మొత్తం 10,060 ఉద్యోగాల భర్తీ చేసేందుకు సిద్దమయ్యింది. ఇందులో గ్రూప్-1, గ్రూప్-2 ఉద్యోగాలతో పాటు అనేక శాఖల్లో ఖాళీలను భర్తీ చేయనున్నట్లు వెల్లడించింది. అంతేకాదు ఏఏ తేదీల్లో నోటిఫికేషన్లు రానున్నాయో కూడా ప్రకటించింది. ఈ సమాచారంతో నిరుద్యోగ యువతకు మరింత పకడ్బందీగా సన్నద్దం అయ్యేందుకు వీలు కలుగుతుంది.

ఏ నెలలో ఏ నోటిఫికేషన్....

మే 15, 2026

ఉన్నత విద్యాశాఖలో 1500 పోస్టుల భర్తీ

ఆగస్ట్ 15, 2026

గ్రూప్-1 - 91 పోస్టులు

హోంశాఖ - 2778 పోస్టులు

ఇతర శాఖలు - 928 పోస్టులు

సెప్టెంబర్ 15, 2026

గ్రూప్-2 - 750 పోస్టులు

ఇంజనీరింగ్ - 503 పోస్టులు

ఇతర శాఖలు - 506 పోస్టులు

అక్టోబర్ 15, 2026

పాఠశాల విద్యాశాఖ/ఇంటర్ విద్య - 3004 పోస్టులు

35
నిరుద్యోగ యువతకు బంపరాఫర్..

ఇప్పటికే కూటమి ప్రభుత్వ ఏర్పాటుతర్వాత మెగా డిఎస్సి నిర్వహించింది... ఇందులో 16 వేలకు పైగా టీచర్ పోస్టులను భర్తీ చేశారు. ఈ సమయంలోనే ఉద్యోగాలు రాని యువతీయువకులకు ప్రభుత్వం భరోసా ఇచ్చింది. త్వరలోనే మరో డిఎస్సి నిర్వహిస్తామని... ప్రిపరేషన్ కొనసాగించాలని సూచించింది. చెప్పినట్లుగాానే కేవలం విద్యాశాఖలోనే నాలుగు వేలకుపైగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు సిద్దమయ్యింది.

ఇక పోలీస్ శాఖలో కూడా గతేడాది భారీగానే ఉద్యోగాల భర్తీ జరిగింది. కేవలం ఇంటర్మీడియట్ అర్హతతోనే 6000 పైగా కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీని పూర్తిచేసింది.. ఇప్పుడు మరోసారి హోంశాఖలో ఉద్యోగాల భర్తీకి సిద్దమయ్యింది. హోంశాఖలో 2778 పోస్టులను భర్తీ చేయనున్నట్లు జాబ్ క్యాలెండర్ లో పేర్కొన్నారు.. ఇందులో కానిస్టేబుల్ తో పాటు ఎస్సై ఉద్యోగాలు కూడా ఉండే అవకాశాలున్నాయి. కాబట్టి పోలీస్ ఉద్యోగాలకు సన్నద్దమయ్యే యువత పట్టుదలతో శ్రమిస్తే ఉద్యోగం సాధించడం ఖాయం.

45
20 నెలల్లో 30 వేల ఉద్యోగాలు.. : పవన్ కల్యాణ్

''ఉగాది పర్వదినాన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర యువతకు తీయటి కబురు చెప్పింది మా కూటమి ప్రభుత్వం. 10,060 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీకి జాబ్ క్యాలెండర్ విడుదల చేశాము. నిర్దేశిత సమయంలో ఈ ఉద్యోగాలు భర్తీ చేస్తాము. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం యువత ఆకాంక్షలను మనసుతో అర్థం చేసుకుంటోంది'' అని పవన్ కల్యాణ్ అన్నారు.

''ఈ 20 నెలల కాలంలో 30,607 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాము. ఉపాధ్యాయ, కానిస్టేబుల్ పోస్టులకి ఎంపికైన వారికి నియామక పత్రాలు అందించినప్పుడు యువత కళ్లలో ఆనందం చూశాము. ఈ ఏడాది ఇచ్చే నోటిఫికేషన్ల ద్వారా 10,060 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తాము. గ్రూప్ 1, గ్రూప్ 2, ఇంజనీరింగ్, టీచింగ్, యూనిఫాం సర్వీసెస్ పోస్టులను భర్తీ చేయనున్నాము. ఇక ఉద్యోగార్థులు ప్రిపరేషన్ లో నిమగ్నం కావాలని కోరుకుంటున్నాను'' అన్నారు పవన్ కల్యాణ్.

55
యువగళం హామీని నెరవేర్చాం..: నారా లోకేష్

''ఆంధ్ర‌ప్ర‌దేశ్ యువ‌త‌కు ఉగాది కానుక‌గా ఉద్యోగాల పండ‌గ ప్ర‌క‌టిస్తున్నాం. యువ‌గ‌ళం పాద‌యాత్ర‌లో జాబ్ క్యాలెండ‌ర్ విడుద‌ల చేస్తామ‌ని నేను ఇచ్చిన హామీని ప్రజా ప్ర‌భుత్వం నెర‌వేర్చ‌డం చాలా సంతోషంగా ఉంది. వివిధ ప్ర‌భుత్వ శాఖ‌ల్లో 10,060 ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్లు ఏ తేదీన వ‌స్తాయో, ఎన్ని ఉద్యోగాలు భ‌ర్తీ చేస్తామో ప్ర‌క‌టిస్తూ జాబ్ క్యాలెండ‌ర్ విడుద‌ల చేశాం. అలాగే నిర్దేశిత సమయంలోనే పరీక్షలు నిర్వహించి ప్రకటించిన అన్ని పోస్టులు భర్తీ చేస్తాం. సిలబస్ కూడా ముందుగానే ప్రకటిస్తాము'' అని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు.

''ఉద్యోగార్థులందరూ నైపుణ్యం పోర్టల్ లో వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోని అలర్ట్స్ పొందవచ్చు. ఇక ప్ర‌తీ ఏటా ఉగాదికి ఉద్యోగాల ప్ర‌క‌ట‌న పండ‌గ ఉంటుంది. నా మాట నేను నిలబెట్టుకున్నాను. ప్రజా ప్ర‌భుత్వం జాబ్ క్యాలెండ‌ర్ విడుద‌ల చేసింది. ఇక మీరు పోటీప‌రీక్ష‌ల‌కు సిద్ధం అవ్వండి..'' అని మంత్రి లోకేష్ సూచించారు.

Read more Photos on
click me!

Recommended Stories