AP Inter Results: రేపే ఇంటర్‌ ఫలితాలు.. వాట్సప్‌కే రిజల్ట్స్‌.. ఈ నంబర్‌ సేవ్‌ చేసుకున్నారా?

AP Inter Results: ఏపీలోని కూటమి సర్కార్‌ ప్రతి ప్రభుత్వ విభాగానికి టెక్నాలజీ జోడిస్తోంది. ఏఐ, చాట్‌జీపీటీ, డ్రోన్‌ టెక్నాలజీ ఇలా అన్ని రకాలుగా వినియోగించుకుంటున్నారు. దీనిలో భాగంగా మన మిత్ర వాట్సప్‌ సర్వీసులను ఇటీవల ప్రారంభించారు. దీని ద్వారా 160 సేవలను ప్రజలు ఉచితంగా పొందేలా సర్వీసును తీసుకొచ్చారు. అయితే.. రేపే ఇంటర్‌ ఫలితాలను విడుదల చేయనున్నారు. వీటిని కూడా వాట్సప్‌లో విడుదల చేసేందుకు అధికారులు సిద్దమవుతున్నారు. మరి ఫలితాలు ఏవిధంగా చూసుకోవాలో తెలుసుకోండిలా....

AP Inter Results 2024 on WhatsApp, Save This Number to Get Your Marks Instantly in telugu tbr
AP inter results

ఏటా ఇంటర్ ఫలితాలు విడుదలవుతున్నాయంటే కొందరు ఇంటర్నెట్ సెంటర్లకు వెళ్లడం, మరికొందరు ఇంట్లో ఉండి సెల్‌ఫోన్‌, ల్యాప్‌ట్యాప్‌ పెట్టుకుని రిజల్ట్స్‌ కోసం ఉత్కంఠగా ఎదురుచూడటం మామూలే. అందరూ ఒకేసారి ఫలితాలు చూడటం వల్ల సర్వర్ బిజీ వచ్చేది. కానీ ఈ ఏడాది ఫలితాలకు చిన్నపాటి టెక్నాలజీని జోడించి కాస్త డిఫరెంట్‌గా విడుదల చేయనున్నారు. 

AP Inter Results 2024 on WhatsApp, Save This Number to Get Your Marks Instantly in telugu tbr
ap inter results 2025

ఇంటర్‌ బోర్డు అధికారులు ఇప్పటికే విద్యార్థుల తల్లిదండ్రుల ఫోన్‌ నంబర్లను సేకరించి పెట్టుకున్నారు. ఇక ఫలితాలు విడుదలైన వెంటనే వారి వాట్సప్‌లలోకి ఫలితాలు వచ్చేలా టెక్నాలజీ డెవలప్‌ చేశారు.  గతంలో వచ్చిన విధంగానే పీడీఎఫ్ రూపంలో ఉండే ఫలితాలను వాట్సప్‌లోనే చూసుకోవచ్చు. ఒక వేళ మెసేజ్‌ రావడం ఆలస్యం అయితే.. ఇలా  చేయండి.. 


ap whatsap governence

ఇంటర్ పరీక్షలకు ఈ ఏడాది రెండేళ్లు కలిపి మొత్తం 10 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. మార్చి 17న తుది పరీక్షలు ముగిశాయి. మార్చి 19వ తేదీ నుంచే జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభంకాగా.. ఇప్పటికే మూల్యాంకన ప్రక్రియ ముగిసింది. ఈక్రమంలో రేపే అనగా శనివారం ఫలితాలు విడుదల కానున్నాయి. మూల్యాంకనం కోసం రాష్ట్రంలో అన్ని జిల్లా కేంద్రాల్లో కలిపి మొత్తం 25 సెంటర్లను ఏర్పాటు చేశారు. 

ap inter results on whatsap

కూటమి ప్రభుత్వం ఇటీవల వాట్సప్ గవర్నెన్స్ అందుబాటులోకి తీసుకొచ్చిం ది. ఈ సేవలను ఇంటర్ విద్యార్థులు తమ హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకునేందుకు వినియోగించుకున్నారు. విద్యార్థులు సులువుగా హాల్ టికెట్ కోసం వారి రోల్ నంబర్, డేటాఫ్ బర్త్ నమోదు చేసి వాట్సప్ ద్వారా హాల్‌టికెట్లను పొందగలిగారు. ఈ సేవలపై విద్యార్థులు సంతృప్తకరంగా ఉండటంతో ఇంటర్‌ ఫలితాలను వాట్సప్‌కే పంపేందుకు అధికారులు సిద్దమవుతున్నారు. 

ap inter results

వాట్సప్‌ సందేశం రావడం ఎవరికైనా ఆలస్యం అయితే.. అలాంటి వారికోసం ఇంటర్‌ బోర్డు మరో సదుపాయం కూడా కల్పించింది. ఎప్పటికేలా ఇంటర్‌ మీడియట్‌ అధికారిక వెబ్‌సైట్‌ bieap.gov.in and resultsbie.ap.gov.in లో లాగిన్‌ అయ్యి విద్యార్థి రోల్‌ నంబర్‌, డేటాఫ్‌ బర్త్‌ వివరాలు నమోదు చేస్తే ఫలితాలు వచ్చేస్తాయి. దీంతోపాటు ప్రభుత్వం తీసుకొచ్చిన మన మిత్ర వాట్సప్‌ నంబర్‌ 95523 00009 సేవ్‌ చేసుకుని దానికి హాయ్‌ అని వాట్సప్‌ మెసేజ్‌ పెట్టి అక్కడ కూడా విద్యార్థి వివరాలు నమోదు చేసి ఫలితాలు చూసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. ఇంటర్ ద్వితీయ సంవ్సతరం విద్యార్థికి తొలి ఏడాది మార్కులతోపాటు, రెండో ఏడాది మార్కుల వివరాలు కూడా ఒకేసారి వాట్సప్‌కి వస్తాయని అధికారులు చెబుతున్నారు. మొత్తానికి వాట్సప్‌ గవర్నెస్‌ సేవల నుంచి ఇంటర్‌ ఫలితాలు చూసుకోవడం అన్నదానిపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

Latest Videos

vuukle one pixel image
click me!