అమ్మాయిది అమెరికా, అబ్బాయిది ఆంధ్రప్రదేశ్ వీరిద్దరి ఇన్‌స్టాగ్రామ్ కలిపింది. తొమ్మిదేళ్ల వయసులో తేడా ఉన్న వీరిద్దరు ప్రేమలో పడ్డారు. తన ప్రియుడి కోసం ఏకంగా ఏడు సముద్రాలు దాటి ఆంధ్రాకు వచ్చిందా యువతి. ఇంతకీ వీరిద్దరి మధ్య ప్రేమ ఎలా చిగురించింది.? 14 నెలల వీరి ప్రేమాయణంకు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం.
Viral Love story
అమెరికాకు చెందిన ఫోటోగ్రాఫర్ జాక్లీన్ ఫోరెరో, ఆంధ్రప్రదేశ్‌లోని ఓ కుర్రాడు చందన్ ప్రేమలో పడ్డారు. వేర్వేరు దేశాలు, సంస్కృతుల్లో పెరిగిన ఈ జంట ప్రేమ కథ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీరిద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌లో కలుసుకున్నారు. లైక్‌లు, కామెంట్లతో మొదలైన పరిచయం, ఆ తర్వాత చాటింగ్, వీడియో కాల్స్ వరకు వెళ్లింది. చివరకు నేరుగా కలుసుకున్నారు. 14 నెలల దూరం.. కానీ మనసులు దగ్గర జాక్లీన్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను షేర్ చేసింది.
14 నెలల ప్రయాణం పూర్తయిందని, కొత్త జీవితానికి సిద్ధంగా ఉన్నామని తెలిపింది. వీడియో కాల్స్, ముచ్చట్లు, మొదటిసారి కలుసుకున్న క్షణాలను ఇందులో చూపించింది. ఓ యూజర్ స్పందిస్తూ.. మా కథ కూడా ఇలాగే మొదలైంది. ఇన్‌స్టాగ్రామ్‌లో కలిసి, 7 నెలల తర్వాత ఇండియాకు వెళ్లి పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు ఆమె అమెరికా వచ్చేసింది అని కామెంట్ చేశాడు. 9 ఏళ్ల తేడా.. ప్రేమకు అడ్డుకాలేదు. జాక్లీన్ తన భాగస్వామి చందన్ కంటే 9 ఏళ్లు పెద్దదని కామెంట్స్‌లో తెలిపింది. కానీ వయసు తమ ప్రేమకు అడ్డు కాలేదని చెప్పింది. జాక్లీన్ క్రిస్టియన్. ఆమెకు ఇదివరకే పెళ్లయి విడాకులు కూడా అయ్యాయి.
Viral Love story
తన నమ్మకాలను గౌరవించే వ్యక్తి కోసం ఎదురు చూస్తున్నానని ఆమె తెలిపింది. యూట్యూబ్ ఛానెల్‌లో కథ వీరిద్దరూ యూట్యూబ్ ఛానెల్ కూడా ప్రారంభించారు. అందులో తమ ప్రేమ కథను వివరించారు. విడాకులు తీసుకున్న క్రిస్టియన్ తల్లికి నమ్మకమైన ప్రేమ దొరికిందని, ఆమె ఆంధ్రప్రదేశ్‌లోని ఓ కుర్రాడిని ఇన్‌స్టాగ్రామ్‌లో కలిసిందని జాక్లీన్ చెప్పింది. ఈ ప్రేమ కథపై సోషల్ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. యూజర్లు ఈ జంటను మెచ్చుకుంటున్నారు, ఆశీర్వదిస్తున్నారు.
జాక్లీన్ ఫోరెరో ఇన్‌స్టాగ్రామ్ పేజీ చూడడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.