Chiranjeevi, Mark Shankar
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ అప్‌డేట్ కోసం అనేక మంది ఎదురు చూస్తున్నారు. అయితే.. బాబు ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై మెగాస్టార్ చిరంజీవి పలు వివరాలను తెలియజేశారు. రెండు రోజుల కిందట సింగపూర్‌లో మార్క్‌శంకర్ ఉన్న పాఠశాలలో అగ్నిప్రమాదం చోటుచేసుకోవడం అక్కడ శంకర్‌కు తీవ్ర గాయాలు కావడం అందరికీ తెలిసిందే. ఈక్రమంలో జనసేన శ్రేణులు, మెగా అభిమానులు పెద్దఎత్తున పూజలు చేస్తున్నారు. అయితే శంకర్ గాయపడిన నాటి నుంచి ఇప్పటి వరకు అతనికి ఏవిధంగా ఉంది? ఇంటికి ఎప్పుడు వస్తాడు అన్నది క్లారిటీ లేదు. తాజా ఈ విషయాలను చిరంజీవి తెలియజేశారు.
Pawan Kalyan’s son Mark Shankar
పవన్ కుమారుడు మార్క్‌శంకర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని మెగాస్టార్ చిరంజీవి చెప్పుకొచ్చారు. ఈ మేరకు ఆయన అధికారిక ట్విట్టర్ ఖాత నుంచి శంకర్ ఆరోగ్య పరిస్థితి, తదితర వివరాలను తెలియజేశారు. ఆయన ఏమన్నారంటే.. ''మా బిడ్డ మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు. అయితే ఇంకా కోలుకోవాలి. మా కులదైవమైన ఆంజనేయ స్వామి దయతో, కృపతో త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో, మళ్ళీ మామూలుగా ఎప్పటిలానే వుంటాడు. రేపు హనుమత్ జయంతి, ఆ స్వామి ఓ పెద్ద ప్రమాదం నుంచి, ఓ విషాదం నుంచి ఆ పసి బిడ్డని కాపాడి మాకు అండగా నిలిచాడు. ఈ సందర్భంగా ఆయా ఊళ్ళల్లో, ఆయా ప్రాంతాల్లో మార్క్ శంకర్ కోలుకోవాలని ప్రతి ఒక్కరూ మా కుటుంబానికి అండగా నిలబడి ఆ బిడ్డ కోసం ప్రార్థనలు చేస్తున్నారు, ఆశీస్సులు అందచేస్తున్నారు. నా తరపున, తమ్ముడు కళ్యాణ్ బాబు తరపున, మా కుటుంబం యావన్మంది తరపున మీ అందరికీ ధన్యవాదాలు తెలియచేస్తున్నాం.'' అని చిరంజీవి ట్వీట్‌చేశారు.
pawan kalyan, akira nandan, mark shankar
మెగాస్టార్ చిరంజీవి పోస్టులో తెలిపిన ప్రకారం మార్క్ శంకర్‌ను హైదరాబాద్‌లోని పవన్ ఇంటికి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. అయితే.. ఇక్కడే వైద్యుల పర్యవేక్షణలో బాబుకు అవసరమైన ట్రీట్మెంట్ అందించనున్నారు. ప్రస్తుతానికి శంకర్ ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉన్నా... ఇంకా పూర్తిగా కోలుకోలేదని చిరంజీవి చెబుతున్నారు. మొత్తానికి అభిమానుల పూజలు, ఆంజనేయస్వామి దీవెనలతో బాబు క్షేమంగా ఉన్నట్లు చిరంజీవి ఎమెషనల్‌గా స్పందించారు.
పవన్ కల్యాణ్ కుమారుడు పేరు తన అన్నపేరు కలిసి వచ్చేలా మార్క్ శంకర్ అని పెట్టుకున్నారు. ఇక కొణిదెల వారి ఇంట్లో శంకర్ చిన్న అబ్బాయి కావడంతో అందరికీ అతనంటే ఎనలేని ప్రేమట. ముఖ్యంగా మెగాస్టార్‌కు శంకర్ అంటే చాలా ఇష్టమని పవన్ సన్నిహితులు చెబుతున్నారు. అందుకే శంకర్ గాయపడిన విషయం తెలిసిన వెంటనే పవన్‌తోపాటు, చిరంజీవి, సురేఖ హుటాహుటిన సింగపూర్ వెళ్లారు. తిరిగి ఈ రోజు ఇంటికి చేరుకున్నట్లు ప్రకటించారు. ఈ సందర్బంగా పవన్ భుజంపై చేయి వేసి చిరంజీవి ఫొటో దిగారు. ఆ చిత్రం చూస్తే.. నీకు, నీ కుటుంబానికి ఎప్పుడు ఆపద వచ్చినా ఇలానే భుజం కాస్తాను అన్నట్లు ఉందని అభిమానులు సంబర పడుతున్నారు.
Megastar Chiranjeevi Shares Emotional Update on Pawan Kalyan's Son's Health
పవన్‌కల్యాణ్, కుటుంబ సభ్యులు బుధవారం ఉదయానికి సింగపూర్ చేరుకోగా.. నిన్న మధ్యాహ్నం మార్క్ శంకర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ ఫొటో సోషల్‌మీడియాలో దర్శనమిచ్చింది. ఈ ఫోటోలో శంకర్ చేతికి గాయం కాగా.. అక్కడ వైద్యులు కట్టుకట్టారు. బాబు ఫేస్‌కి మాత్రం ఆక్సిజన్ పైపు ఉంచి ఆక్సిజన్ అందిస్తున్నారు. మార్క్ శంకర్ కోలుకోవడానికి ఇంకా మూడు రోజులు పడుతుందని వైద్యులు చెప్పారు అయితే.. ఆ వైద్యం ఇక్కడే అందించనున్నట్లు చిరంజీవి చెబుతున్నారు. ఇక ఆ ఫోటోలో మార్క్ శంకర్ చేతులు పైకి ఎత్తి నేను బాగున్న అన్న సంకేతం చూపుతున్నట్లు ఉంది. తాజాగా చిరంజీవి మాత్రం శంకర్ ఫొటోలు ఏమీ షేర్ చేయలేదు.