ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల.. ప‌రీక్ష‌లు ఎప్ప‌టి నుంచంటే.?

Published : Oct 22, 2026, 08:19 PM IST

AP Inter Exams: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు కీలక అప్‌డేట్ వచ్చింది. 2027 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఇంటర్ పబ్లిక్ పరీక్షల షెడ్యూల్‌ను ఇంటర్మీడియట్ విద్యా మండలి ప్రకటించింది.

PREV
13
ఫిబ్రవరి 24 నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం

ఆంధ్రప్రదేశ్‌లో 2027 ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ఫిబ్రవరి 24న ప్రారంభమై మార్చి 16న ముగియనున్నాయి. ఈ పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక షెడ్యూల్‌ను ఇంటర్ బోర్డు విడుదల చేసింది. రెగ్యులర్ విద్యార్థులతో పాటు గతంలో పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించని బ్యాక్‌లాగ్ విద్యార్థులకు కూడా పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షలన్నీ ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరగనున్నాయి. విద్యార్థులు పరీక్షల తేదీలను ముందుగానే గుర్తుంచుకుని, సబ్జెక్టుల వారీగా ప్రిపరేషన్ ప్రారంభించాలి. చివరి నిమిషంలో ఒత్తిడికి గురికాకుండా ఇప్పటి నుంచే చదువును ప్రణాళికాబద్ధంగా కొనసాగించడం ఉపయోగకరంగా ఉంటుంది.

23
ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ పరీక్షల తేదీలు

ఇంటర్ మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం విద్యార్థులకు వేర్వేరు తేదీల్లో పరీక్షలు ప్రారంభం కానున్నాయి. బోర్డు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ప్రథమ సంవత్సరం పరీక్షలు ఫిబ్రవరి 24న మొదలవుతాయి. ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఫిబ్రవరి 25 నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయి.

రెండు సంవత్సరాల పరీక్షలు మార్చి 16 వరకు కొనసాగేలా తాత్కాలిక షెడ్యూల్‌ను రూపొందించారు. అయితే ఏ తేదీన ఏ సబ్జెక్టుకు పరీక్ష ఉంటుందనే పూర్తి వివరాలను సవివరమైన టైమ్‌టేబుల్‌లో పరిశీలించాలి. దాని ఆధారంగా విద్యార్థులు తమకు కష్టంగా అనిపించే సబ్జెక్టులకు ఎక్కువ సమయం కేటాయిస్తూ పునశ్చరణ చేసుకోవచ్చు.

ఫిబ్రవరి 1 నుంచి ప్రాక్టికల్ పరీక్షలు

థియరీ పరీక్షలకు ముందుగానే ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలను నిర్వహించనున్నారు. జనరల్ కోర్సుల విద్యార్థులకు ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి 10 వరకు ప్రాక్టికల్స్ జరగనున్నాయి. ఒకేషనల్ కోర్సుల్లో చదువుతున్న విద్యార్థులకు ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రాక్టికల్ పరీక్షల కోసం రెండు సెషన్లను కేటాయించారు. మొదటి సెషన్ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది. రెండో సెషన్ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తారు. ప్రాక్టికల్స్‌కు హాజరయ్యే విద్యార్థులు తమ కళాశాలల్లో అందించే సూచనలను పాటించాలి. ప్రయోగాలకు సంబంధించిన రికార్డులు, అవసరమైన పరికరాలు, ఇతర ఏర్పాట్ల గురించి ముందుగానే తెలుసుకోవడం మంచిది.

33
ప్రాక్టికల్స్, థియరీ పరీక్షల సమయాలు ఇవే

విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యే ముందు తేదీలతో పాటు సమయాలను కూడా స్పష్టంగా తెలుసుకోవాలి. బోర్డు వెల్లడించిన వివరాల ప్రకారం ఇంటర్ ఫ‌స్ట్ ఇయ‌ర్‌ థియరీ పరీక్షలు: ఫిబ్రవరి 24 నుంచి, ఇంటర్ సెకండ్ ఇయ‌ర్ థియరీ పరీక్షలు ఫిబ్రవరి 25 నుంచి ప్రారంభం కానున్నాయి. జనరల్ కోర్సుల ప్రాక్టికల్స్ ఫిబ్రవరి 1 నుంచి 10 వరకు, ఒకేషనల్ కోర్సుల ప్రాక్టికల్స్ ఫిబ్రవరి 1 నుంచి 15 వరకు జ‌ర‌గ‌నున్నాయి. థియరీ పరీక్షల సమయం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ప్రాక్టికల్ మొదటి సెషన్ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ప్రాక్టికల్ రెండో సెషన్ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జ‌ర‌గ‌నున్నాయి. ఈ వివరాలు ప్రస్తుతం ప్రకటించిన తాత్కాలిక షెడ్యూల్‌కు సంబంధించినవి. తుది షెడ్యూల్‌లో ఏవైనా మార్పులు ఉంటే వాటిని అధికారిక ప్రకటనల ద్వారా తెలుసుకోవాలి.

Read more Photos on
click me!

Recommended Stories