DA Hike : ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. డీఏ పెంపు

Published : Oct 21, 2025, 11:54 PM IST

DA Hike: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమ ఉద్యోగులకు 3.64% డియర్‌నెస్ అలవెన్స్‌ (డీఏ) పెంపు ప్రకటించింది. 2024 జనవరి 1 నుండి అమలులోకి రానుంది. దీంతో ఉద్యోగులకు భారీ ప్రయోజనం కలగనుంది.

PREV
14
ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులకు, పెన్షనర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగులకు, పెన్షనర్లకు డియర్‌నెస్ అలవెన్స్‌ (డీఏ) పెంపు ప్రకటించింది. 2024 జనవరి 1 నుండి డీఏ పెంపు అమల్లోకి వస్తుందని తెలిపింది. పెన్షనర్లకు కూడా 3.64% పెంపు అందుతుంది. ఈ నిర్ణయం పై ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

24
డీఏ పెంపు: పండగ ముందు బోనస్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగుల డీఏను 33.67% నుండి 37.31% కి పెంచింది. ఈ పెంపు ద్వారా అన్ని ప్రభుత్వ విభాగాల ఉద్యోగులు, పెన్షనర్లు తమకు లభించే వేతనాలపై 3.64% పెంపు పొందగలుగుతారు. ఈ పెంపును ప్రకటించిన తర్వాత ఆర్థిక శాఖ ఆదేశాలు జారీ చేసింది.

సీఎం చంద్రబాబు నాయుడు ఉద్యోగుల సంక్షేమం గురించి చాలాసార్లు ప్రస్తావించారు. ఈ డీఏ పెంపు, దీపావళి పండుగకు ముందుగానే విడుదల కావడం ఉద్యోగుల మేలు కోసం తీసుకున్న కీలక నిర్ణయంగా కనిపిస్తోంది. ఈ పెంపును సీఎం దీపావళి బోనస్ గా ప్రకటించారు.

34
ప్రభుత్వానికి నెలకు రూ.165 కోట్ల అదనపు భారం

ఆర్థిక శాఖ అధికారుల ప్రకారం, ఈ డీఏ పెంపుతో రాష్ట్ర ఖజానా పై అదనపు భారం పడనుంది. ప్రభుత్వానికి నెలకు రూ.165 కోట్ల అదనపు భారం ఉంటుందని అధికారులు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది.

అలాగే, ఉద్యోగులు వారి పిల్లల సంరక్షణ కోసం 180 రోజులు చైల్డ్ కేర్ లీవ్ ఎప్పుడైనా తీసుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. అంటే రిటైర్ అయ్యేలోపు ఎప్పుడైనా ఈ చైల్డ్ కేర్ లీవ్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఇది ప్రజా సెక్టార్‌లో పనిచేసే తల్లిదండ్రులకు చక్కని అవకాశాలను ఇస్తుంది.

44
గత బకాయిలను క్లియర్ చేస్తామన్న ప్రభుత్వం

ఈ డీఏ పెంపు ప్రకటనతో పాటుగా గత బకాయిలను క్లియర్ చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఉద్యోగుల హెల్త్ ఇన్సూరెన్స్ ప్రణాళికను త్వరలో పూర్తి చేయడం కూడా ప్లాన్ లో ఉందని తెలిపారు. ఏపీలో 99 శాతం రెవెన్యూ హెచ్ఆర్ కు వెళ్తుందన్నారు. దక్షణాది రాష్ట్రాలను గమనిస్తే కేరళ 68 శాతం, తెలంగాణ 38 శాతం, తమిళనాడు 42, కర్ణాటక 38 శాతం జీతభత్యాలకు ఇస్తోందని సీఎం తెలిపారు. 

Read more Photos on
click me!

Recommended Stories