Andhra Pradesh: ఏపీలో మహిళల ఖాతాల్లోకి రూ.18 వేలు..అమల్లోకి కొత్త పథకం..!

Published : Jun 16, 2025, 11:05 AM IST

ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తల్లికి వందనం పథకం ద్వారా ఎంతో మందికి అందింది. ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వం మరో కొత్త  పథకానికి శ్రీకారం చుట్టింది.అదే  ఆడబిడ్డ నిధి పథకం. ఈ పథకంతో 18-59 ఏళ్ల మధ్య మహిళలకు నెలకు ₹1500 ఆర్థిక సహాయం అందించనుంది.

PREV
16
ఆడబిడ్డ నిధి పథకం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకం కింద మరో కీలక ప్రజా సంక్షేమ కార్యక్రమాన్ని ప్రకటించింది. మహిళల ఆర్థిక స్వాతంత్ర్యాన్ని పెంచే లక్ష్యంతో ఆడబిడ్డ నిధి పథకాన్ని ప్రారంభించనుంది. ఈ పథకం కింద రాష్ట్రంలోని 18 నుండి 59 ఏళ్ల మధ్య వయసున్న మహిళలకు నెలకు ₹1500 నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి జమ చేయనున్నారు.

26
పథక వివరాలు

 పథకం పేరు: ఆడబిడ్డ నిధి

లబ్ధిదారులు: 18-59 ఏళ్ల మధ్య వయసు గల మహిళలు

ప్రతినెల ఆర్థిక సహాయం: ₹1500

పూర్తి సంవత్సరానికి మొత్తం సహాయం: ₹18,000

అర్హత గల వర్గాలు: BPL ,  APL కుటుంబాలకు చెందిన మహిళలు

దరఖాస్తు విధానం: అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్లైన్‌లో

46
దరఖాస్తు ప్రక్రియ:

అధికారిక వెబ్‌సైట్ https://ap.gov.in/aadabiddanidhi ను సందర్శించాలి

హోమ్‌పేజీలో "ఆడబిడ్డ నిధి పథకం" పై క్లిక్ చేయాలి

ఫారం నింపి అవసరమైన డాక్యుమెంట్లు అప్లోడ్ చేయాలి

అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత రిఫరెన్స్ నంబర్‌ను నోట్ చేసుకోవాలి

56
కేటాయింపులు

పథకం కోసం కేటాయింపులు (2024-25 బడ్జెట్): మొత్తం రూ.3,341.82 కోట్లు కేటాయించారు. ఇందులో:

బీసీ మహిళలకు: ₹1069.78 కోట్లు

ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు: ₹629.37 కోట్లు

ముస్లిం మైనారిటీలకు: ₹83.79 కోట్లు

ఎస్సీ మహిళలకు: ₹1198.42 కోట్లు

గిరిజన మహిళలకు: ₹330.10 కోట్లు

66
పథకం ముఖ్య ఉద్దేశాలు:

ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు నేరుగా ఆర్థిక సహాయం అందించడం

మహిళల ఆర్థిక స్వావలంబనను పెంపొందించడం

సమాజంలో లింగ ఆధారిత ఆర్థిక అసమానతలను తగ్గించడం

Read more Photos on
click me!

Recommended Stories