దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు డ్రోన్లు అందిస్తోంది. సాగుకు సాంకేతికతను జోడించి ఖర్చులు తగ్గించాలన్న లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది.
27
80% సబ్సిడీతో డ్రోన్ల పంపిణీ
ఒక్కో డ్రోన్ యూనిట్ ధర రూ.9.80 లక్షలు కాగా, రైతులు కేవలం రూ.1.96 లక్షలు మాత్రమే చెల్లించాలి. మిగిలిన రూ.8 లక్షలు ప్రభుత్వం భరిస్తోంది. బ్యాంకుల ద్వారా రైతుల వాటాను రుణంగా మంజూరు చేసి, ఆ మొత్తం డ్రోన్ కంపెనీలకు చెల్లించనుంది.
37
జిల్లాల వారీగా డ్రోన్ల పంపిణీ
రాష్ట్రానికి మొత్తం 875 డ్రోన్ యూనిట్లు మంజూరయ్యాయి. ఐదుగురు సభ్యుల రైతు గ్రూపులను లబ్ధిదారులుగా గుర్తించి, వారిలో ఒక్కొక్కరికి డ్రోన్ పైలట్ శిక్షణ ఇచ్చారు. వ్యవసాయ శాఖ ప్రత్యేక శిక్షణ కల్పించింది.
ఒక ఎకరంలో డ్రోన్ ద్వారా పురుగుమందులు పిచికారీ చేయడానికి కేవలం 7 నిమిషాలే పడుతుంది. అదే పని మనుషులు చేస్తే 2 గంటలకుపైనే అవసరం. డ్రోన్ 12 లీటర్ల నీటితో పని చేస్తే, మనుషులు 100 లీటర్ల దాకా వాడాల్సి వస్తుంది.
57
తక్కువ ఖర్చుతో అధిక లాభం
డ్రోన్‌తో మందు పిచికారీ చేయించేందుకు ఎకరాకు రూ.350 ఖర్చు వస్తుంది. అదే మనుషులైతే కనీసం ఇద్దరు కూలీల ఖర్చు పడుతుంది. డ్రోన్ నేరుగా మొక్కలపై మందు చల్లడంతో మందు వృథా తక్కువగా ఉంటుంది.
67
ఆరోగ్యానికి మేలు
డ్రోన్ల ద్వారా మందుల పిచికారీ వల్ల వ్యవసాయ కూలీల ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. మానవులుగా చల్లితే ముక్కు, నోరు ద్వారా మందులు శరీరంలోకి చేరి ఊపిరితిత్తులు, జీర్ణాశయం, శ్వాసవ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది.
77
డ్రోన్ ప్రత్యేకతలు
ఈ డ్రోన్ బరువు ట్యాంకుతో కలిపి 29 కిలోలు ఉంటుంది. ఒకరోజులో 10 ఎకరాల వరకు మందు పిచికారీ చేయగలదు. స్పష్టమైన టార్గెట్‌తో మందులు మొక్కలపై పడటంతో మూడింతల ప్రయోజనం లభిస్తుంది.