Andhra pradesh: సంక్రాంతి అనగానే ముగ్గులు, పిండి వంటలతో పాటు కోడి పందెలు గుర్తొస్తాయి. ఏపీలో జరిగే కోడి పందెల్లో పాల్గొనడానికి ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున వస్తుంటారు. తాజాగా జరిగిన పందెల్లో ఓ వ్యక్తి ఏకంగా కోటీవ్వరుడయ్యాడు.
సంక్రాంతి పండుగ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ప్రాంతం మరోసారి కోడిపందాలతో కిటకిటలాడింది. పండుగ రెండో రోజు జరిగిన పందాల్లో కోట్ల రూపాయల నగదు చేతులు మారినట్లు సమాచారం. సంప్రదాయంగా జరిగే ఈ ఆట ఈసారి మరింత భారీగా సాగింది.
24
పైబోయిన వెంకటరామయ్య బరిలో భారీ పోటీ
తాడేపల్లిగూడెంలోని పైబోయిన వెంకటరామయ్య బరిలో జరిగిన కోడిపందాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గుడివాడకు చెందిన ప్రభాకర్ సేతువ కోడి, రాజమండ్రికి చెందిన రమేష్ డేగ కోడి మధ్య పోటీ జరిగింది. హోరాహోరీగా సాగిన ఈ పందెంలో చివరికి రమేష్ డేగ గెలుపొందింది.
34
రూ.1.53 కోట్ల పందెం.. జిల్లాలో రికార్డు
ఈ పోటీలో ఏకంగా రూ.1.53 కోట్ల పందెం కుదిరినట్లు స్థానికులు చెబుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ ఏడాది ఇదే అతిపెద్ద పందెంగా ప్రచారం జరుగుతోంది. ఒక్క పందెంతో రమేష్ కోటిన్నరకు పైగా నగదును సొంతం చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
కోడిపందాలు ప్రత్యక్షంగా చూడటానికి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, తెలంగాణ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో జనాలు తరలివచ్చారు. హైటెక్ బరులు, లగ్జరీ సదుపాయాలతో ఈ పందాలను నిర్వహించారు. పందెం రాయుళ్లు లక్షల్లో కాకుండా కోట్లలో డబ్బులు పెట్టడం ఈసారి ప్రత్యేకంగా కనిపించింది.