Andhra pradesh: ఏపీలో మరో హైటెక్ సిటీ.. కాగ్నిజెంట్ కార్యకలాపాలు ప్రారంభం, మరిన్ని సంస్థలు

Published : Jan 15, 2026, 10:39 AM IST

Andhra pradesh: కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత పెట్టుబ‌డుల‌కు పెద్ద పీట వేస్తున్నారు. ముఖ్యంగా ఐటీ సంస్థ‌లు పెద్ద ఎత్తున రాష్ట్రానికి క్యూ క‌డుతున్నాయి. తాజాగా ఐటీ దిగ్గ‌జం కాగ్నిజెంట్ ఏపీలో కార్య‌క‌లాపాల‌ను ప్రారంభించింది. 

PREV
15
విశాఖలో కాగ్నిజెంట్ తాత్కాలిక కార్యకలాపాల ప్రారంభం

ప్రపంచ ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ విశాఖలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు ముందడుగు వేసింది. కాపులుప్పాడ ప్రాంతంలో 22.19 ఎకరాల్లో నిర్మించనున్న శాశ్వత క్యాంపస్‌కు గతేడాది డిసెంబర్ 12న సీఎం చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేసిన విష‌యం తెలిసిందే. ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదే రోజున హిల్–2లోని మహతి బ్లాక్‌లో తాత్కాలిక కార్యాలయాన్ని ప్రారంభించారు.

25
800 ఉద్యోగులతో తొలి దశ కార్యకలాపాలు

తాత్కాలిక కార్యాలయంలో మొదటి దశగా 800 మంది ఉద్యోగులతో పని ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే ఇతర రాష్ట్రాల్లో పనిచేస్తున్న 500 మంది ఉద్యోగులను బేస్ లొకేషన్ విధానంలో విశాఖకు బదిలీ చేశారు. అదనంగా 300 మంది సీనియర్ ఉద్యోగులు కూడా రానున్నారు. లాజిస్టిక్ అంశాలు పూర్తి అయిన వెంటనే ఈ నెల 26 నుంచి అధికారిక కార్యకలాపాలు మొదలుకానున్నాయి.

35
25 వేల ఉద్యోగాల లక్ష్యంతో భారీ ప్రణాళిక

కాగ్నిజెంట్ సీఈవో రవికుమార్ ప్రకారం త్వరలోనే మరో 4,500 మంది ఉద్యోగులు విశాఖకు రానున్నారు. మొదట కాపులుప్పాడ క్యాంపస్ ద్వారా 8 వేల ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యం పెట్టుకున్నారు. అయితే శంకుస్థాపనకు ముందు సీఎం, సీఈవో మధ్య జరిగిన సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. విశాఖలో 25 వేల మందికి ఉపాధి కల్పించేలా ప్రణాళిక రూపొందించాలని సీఎం సూచించగా, ఆ లక్ష్యాన్ని సాధిస్తామని సంస్థ హామీ ఇచ్చింది. ఈ ప్రణాళిక అమలైతే రాబోయే మూడు నాలుగేళ్లలో విశాఖ ఐటీ హబ్‌గా రూపాంతరం చెందనుంది.

45
రియల్ ఎస్టేట్, స్థానిక ఆర్థిక వ్యవస్థకు ఊపు

కాగ్నిజెంట్ రాకతో విశాఖ రియల్ ఎస్టేట్ రంగంలో స్పష్టమైన కదలిక కనిపిస్తోంది. ఐటీ ఉద్యోగుల అవసరాల కారణంగా కాపులుప్పాడ, మధురవాడ, హిల్ ఏరియాల్లో ఇళ్లకు డిమాండ్ పెరుగుతోంది. అపార్ట్మెంట్లు, అద్దె ఇళ్లు, కమర్షియల్ స్పేస్‌లకు విలువ పెరిగే అవకాశం ఉంది. హోటళ్లు, రవాణా, ఫుడ్ సర్వీసులు, రిటైల్ వ్యాపారాలకు కూడా లాభం చేకూరనుంది. స్థానిక యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగావకాశాలు పెరుగుతాయి.

55
మ‌రిన్ని ఐటీ కంపెనీలు

కాగ్నిజెంట్ అడుగులతో విశాఖపై ఐటీ సంస్థల దృష్టి మరింత పెరిగింది. క్యాప్‌జెమినీ, ఆర్‌ఎంజెడ్ వంటి ప్రముఖ సంస్థలు పెట్టుబడులపై చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. ఈ చర్చలు సానుకూలంగా ముగిస్తే దావోస్ లో అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇదే సమయంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కూడా విశాఖలో కార్యకలాపాలకు సిద్ధమవుతోంది. ఫిబ్రవరిలో శాశ్వత క్యాంపస్ భూమిపూజతో పాటు తాత్కాలిక కార్యాలయ ప్రారంభానికి ప్రణాళికలు సాగుతున్నాయి. మిలీనియం టవర్స్–2లో రెండు బ్లాకులు సిద్ధం చేయగా, ప్రారంభ దశలో 2 వేల మందితో పని మొదలవుతుంది. హిల్–3లో 21.76 ఎకరాల్లో శాశ్వత క్యాంపస్ నిర్మాణం చేపట్టనున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories