Andhra Pradesh: ఏపీలో రాజ్యసభ ఉప ఎన్నికకు నోటిఫికేషన్‌.. విజయ సాయి రెడ్డి స్థానాన్ని ఎవరు భర్తీ చేయనున్నారు?

ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యసభ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన విడుదల చేసింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా ఉన్న విజయసాయిరెడ్డి రాజీనామా చేయడంతో ఈ స్థానంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

Andhra Pradesh Rajya Sabha Bypoll Who Will Replace Vijayasai Reddy After His Resignation in telugu VNR

ఎన్నికల సంఘం వెల్లడించిన షెడ్యూల్ ప్రకారం, ఏప్రిల్ 22 నుంచి 29 వరకు నామినేషన్ల స్వీకరణ జరగనుంది. ఏప్రిల్ 30న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. మే 2 నాటికి నామినేషన్ ఉపసంహరణకు గడువుగా నిర్ణయించారు. మే 9న ఓటింగ్ నిర్వహించి అదే రోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు చేపడతారు.

ఇదిలా ఉంటే ప్రస్తుతం ఏపీ అసెంబ్లీలో వైసీపీకి తక్కువ స్థాయిలో సీట్లు ఉండటంతో, ఖాళీ అయిన రాజ్యసభ స్థానాన్ని కూటమి (టిడిపి-జనసేన-బిజెపి) అధికార పక్షం గెలుచుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే కూటమి ఎవరిని అభ్యర్థిగా నిలబెడుతుందన్నది ఆసక్తికకరంగా మారింది. 

ఎందుకు రాజీనామా చేశారంటే?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, రాజ్యసభ సభ్యుడిగా కీలక పాత్ర పోషించిన విజయసాయిరెడ్డి, ఇటీవల రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రాజీనామా పత్రాన్ని సమర్పించడంతో పాటు, ఇకపై ఏ రాజకీయ పార్టీకి మద్ధతు ఇవ్వనని స్పష్టం చేశారు. పూర్తిగా వ్యక్తిగత కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. తన భవిష్యత్తు వ్యవసాయంపై దృష్టి కేంద్రీకరించనున్నట్లు వెల్లడించారు.
 


2019 ఎన్నికల సమయంలో వైఎస్ జగన్‌కు అత్యంత నమ్మకస్థుడిగా, బాగా దగ్గరి నేతగా విజయసాయి రెడ్డి ఉండేవారు. ముఖ్యమంత్రి పదవి చేపట్టే వరకు ఆయన జగన్‌కు అండగా నిలిచారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విజయసాయి రెడ్డి పాత్ర క్రమంగా తగ్గుముఖం పట్టినట్లు వార్తలు వచ్చాయి. పార్టీలో ప్రాధాన్యత లభించకపోవడం, ముఖ్యమైన పదవి ఇవ్వకపోవడం కారణంగానే ఆయనలో నిరాశ పెరిగిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. 

Latest Videos

vuukle one pixel image
click me!