Pawan kalyan Wife: పవన్‌ భార్య గుండు వెనుక బీజేపీ స్కెచ్‌.. వైఎస్‌ జగన్‌ ఇగోపై దెబ్బేశాడ్రోయ్‌!

Pawan kalyan Wife: రాజకీయాల్లో ఎత్తులకు పైఎత్తులకు వెయ్యాలి. కొన్నిసార్లు అవసరమైతే కయ్యానికి కాలు దువ్వాలి.. కొన్నిసార్లు ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో కూడా తెలియాలి. సరిగ్గా ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఇదే పాటిస్తున్నారు. గత ఎన్నికల నుంచి తను ఏది చేసిన ఓ క్లారిటీతో పక్కా ప్లానింగ్‌తో తన ప్రణాళికను కేంద్ర పార్టీ రూట్‌మ్యాప్‌ అమలు చేసుకుంటూ వెళ్తున్నారు. అవకాశం దొరికినప్పుడల్లా వైఎస్‌ జగన్‌ ఇగోలపై దెబ్బేస్తూ ప్రజల్లో పైచేయి సాధిస్తున్నారు. రీసెంట్‌గా పవన్‌ భార్య అన్న లెజినోవా గుండు కొట్టించి.. వైఎస్ జగన్ ఇగోపై దెబ్బేశారు పవన్‌.. ఈ ఘటనతో మూడు రకాలుగా పవన్‌ లబ్దిపొందారు అవేంటో చూద్దాం.. దీంతోపాటు అసలు పవన్‌ భార్య గుండు వెనుక బీజీపీ ప్లానింగ్‌ ఉందా లేదా అన్నది తెలుసుకుందాం.. 
 

Deputy CM Pawan kalyan Wife Shaves Her Head at Tirumala A Bold BJP Move to Hit Jagan Ego in telugu tbr
Pawan Kalyan's Wife Anna's Tirumala Gesture

కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సనాతనధర్మం, హిందుత్వం అంశాన్ని పవన్‌ పదేపదే ప్రస్తావిస్తూ.. గత ప్రభుత్వ హయాంలో హిందుత్వంపై జరిగిన ఘటనలను ఆయా వర్గాల్లో బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. దీని ద్వారా అటు బీజేపీ అగ్రనేతల మనసు దోచుకుంటున్నారు... మరోవైపు వైఎస్‌ జగన్‌, ఆపార్టీ నాయకుల తీరును ఎండగడుతున్నారు. 

Pawan Kalyan's Wife Anna's Tirumala Gesture

అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో గత ప్రభుత్వం తిరుపతిలో లడ్డూ ప్రసాదం కల్తీ జరిగడానికి కారణమైందని, హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరించారని పవన్‌ తీవ్రస్థాయిలో విరుచుపడ్డారు. కల్తీ జరిగిందా లేదా అన్నది అటుంచితే.. హిందువుల్లో మాత్రం వైసీపీ హయాంలో తిరుపతిలో ఏదో జరిగే ఉంటుంది అన్న అనుమానాన్ని హిందువుల మనసుల్లో పవన్‌ బలంగా నాటారు.. ఇది ఆయన విజయవంతం చేసిన ప్లాన్‌ మొదటిది. 


Pawan Kalyan's Wife Anna's Tirumala Gesture

లడ్డూ ప్రసాదం కల్తీ వివాదం రాష్ట్రంలో నడుస్తున్న క్రమంలో ఓ సారి వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌ తిరుమలకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అయితే.. జగన్‌ అన్యమతస్తుడు కావడంతో ఆయన తిరుమలకు రావాలంటే డిక్లరేషన్‌ ఇవ్వాలని కూటమి ప్రభుత్వం తేల్చిచెప్పింది. దీంతో జగన్‌ ఇగో హర్ట్‌ అయ్యింది. నేను డిక్లరేషన్‌పై సంతకం చేయడం ఏంటి? ఐయామ్‌ ఎక్స్‌ సీఎం అనే భావనో ఏమో కానీ తిరుమల పర్యటన రద్దు చేసుకున్నారు. ఈ విషయాన్ని కూడా హిందువులు దగ్గరగా పరిశీలించారు. 

Pawan Kalyan's Wife Anna's Tirumala Gesture

తిరుమలలో ఉన్న ఆచారాన్నే కదా వారు చెప్పింది.. జగన్‌కు ఉన్న ఇబ్బంది ఏంటి అని అన్ని వర్గాల ప్రజలు ఫీల్‌ అయ్యారు. ఈక్రమంలో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ తన ఇద్దరు కుమార్తెలను తీసుకుని తిరుమల వెంకన్నను దర్శించుకున్నారు. పవన్‌ మూడో భార్య అన్నాలెజినోవా కుమార్తె కూడా తిరుమల రావడంతో పాపతో డిక్లరేషన్‌ ఇప్పించారు పవన్‌. ఇది రెండో ప్లాన్‌ సక్సెస్‌ చేసిన తీరు.. 

Pawan Kalyan ys jagan

రీసెంట్‌గా పవన్‌, అన్నా కుమారుడు మార్క్‌ శంకర్ సింగపూర్‌లో అగ్నిప్రమాదం జరిగి గాయపడ్డాడు. ఈ మధ్యే కోలుకుని ఇంటికి కూడా తిరిగొచ్చాడు. ఈక్రమంలో తన బిడ్డ క్షేమంగా ఇంటికి తిరిగి వస్తే తిరుపతికి వస్తానని పవన్‌ భార్య మొక్కుకోవడం విశేషం. కేవలం రావడమే కాదు.. దేశం కాని దేశంలో పుట్టి.. చిన్ననాటి నుంచి క్రిస్టియానిటీలో పెరిగిన ఆమె తిరుమలకు రావడం అందరినీ ఆశ్చర్యం కలిగించింది. 

Pawan Modi

అంతేకాడు తనకు వెంకన్న స్వామిపై నమ్మకం ఉందని డిక్లరేషన్‌పై సంతకం కూడా పెట్టడం గమనార్హం. అంతేకాదు.. ఓ స్త్రీ అయి ఉండి తలనీలాలు కూడా సమర్పించి వావ్‌ అనిపించుకున్నారు. చివరిగా అన్నప్రసాదానికి రూ.17లక్షలు కూడా డొనేట్‌ చేశారు. పవన్‌ భార్య గుండు కొట్టించుకోవడంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చించుకుంటున్న పరిస్థితి. 

Pawan Kalyan’s son Mark Shankar

ఇక వైఎస్‌ జగన్‌ డిక్లరేషన్‌ ఇచ్చేందుకు ఇష్టపడని తీరు గురించి కూడా చర్చకు వచ్చింది. పవన్‌ సతీమణి ఏదో దేశం నుంచి వచ్చి, పరమతంలో ఉండి కూడా డిక్లరేషన్‌ ఇచ్చి తలనీలాలు సమర్పించుకున్నారని.. కానీ జగన్‌ మాత్రం ఇగోకి పోయి హిందూమతాన్ని అవమానించారని ఇప్పుడు హిందూ సంఘాలు, వాట్సప్‌ గ్రూపుల్లో పెద్దఎత్తున మెసేజ్‌లు ట్రోల్‌ అవుతున్నాయంట.. అంతేకాదు ఈ ఒక్క ఘటనతో యావత్తు హిందువుల మనసుల్లో పవన్‌ తన స్థానం పదిలం చేసుకున్నారు. ఓటు బ్యాంకు కూడా సాలిడ్‌గా పెంచేసుకున్నారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 

Megastar Chiranjeevi Shares Emotional Update on Pawan Kalyan's Son's Health

వాస్తవానికి హిందుత్వం ఏపీలో అంతగా నడవదు.. కానీ కూటమి అధికారంలోకి రావడం.. పవన్‌ యాక్టివ్‌గా సనానతనధర్మం పరిరక్షణ అని ముందుకు వెళ్లడంతో హిందూసంఘాల నుంచి పెద్దఎత్తున వారి మద్దతు మూటగట్టుకుంటున్నారు. ఇవన్నీ జరగడం చూస్తే... బీజేపీ ఇచ్చిన రూట్‌మ్యాప్‌ను పవన్‌ పక్కాగా అమలు చేస్తున్నారని స్పష్టంగా తెలుస్తోంది. అంతేకాదు జగన్‌ ఇగోపై కూడా నెమ్మదిగా దెబ్బేసి ఓ వర్గం ఓటు బ్యాంకు సంపాదించే పనిలో పవన్‌ ఉన్నట్లు కనిపిస్తోంది. 

Latest Videos

vuukle one pixel image
click me!