Andhra Pradesh Rain Alert : ఇక తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు... ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్

Published : Jun 26, 2025, 07:58 AM ISTUpdated : Jun 26, 2025, 08:03 AM IST

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు జోరందుకున్నాయి. ఇవాళ ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఏఏ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయంటే… 

PREV
15
తెలుగు రాష్ట్రాల్లో జోరందుకున్న వానలు

Telugu States Weather Updates : తెలుగు రాష్ట్రాల్లో మళ్ళీ వర్షాలు మొదలయ్యాయి. నైరుతి రుతుపవనాలు ఇప్పటికే యాక్టివ్ గా మారడంతో ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలో చిరుజల్లులు కురుస్తున్నాయి. అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం గురువారం అల్పపీడనంగా మారనుందని వాతావరణ శాఖ చెబుతోంది. వీటి ప్రభావంతో వర్షాలు జోరందుకుంటాయని వాతావరణ శాఖ తెలిపింది.

25
జూన్ 26 ఆంధ్ర ప్రదేశ్ వాతావరణం

ఆంధ్ర ప్రదేశ్ లో కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో నేడు(గురువారం) భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయిని... సముద్రంతో పాటు తీరంవెంబడి పరిస్థితి అల్లకల్లోలంగా ఉంటుందని హెచ్చరించారు. కాబట్టి తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని... మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని సూచించారు.

35
ఈ ఏపీ జిల్లాలకు నేడు వర్షసూచన

ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ. తూర్పు గోదావరి, ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే విశాఖపట్నం, అనకాపల్లి, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, కర్నూల్, నంద్యాల, నెల్లూరు, ప్రకాశం, పల్నాడు, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలో మోస్తరు వర్షాలు కురుస్తాయని ప్రకటించారు. ఈ జిల్లాల్లో వర్షాలతో పాటు ఈదురుగాలులు వీచే, పిడుగులు పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది

45
జూన్ 26 తెలంగాణ వాతావరణం

తెలంగాణలో రాబోయే మూడురోజులు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్ర ప్రకటించింది. ఇప్పటికే పలు జిల్లాల్లో వర్షాలు మొదలవగా మిగతా జిల్లాలకు కూడా ఇవి విస్తరిస్తాయని తెలిపారు... ఇలా రాష్ట్రవ్యాప్తంగా ఇక విస్తారంగా వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ ప్రకటన రైతుల ముఖాల్లో ఆనందాన్ని నింపుతోంది.

55
ఈ తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు

ఇవాళ(గురువారం) ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, జగిత్యాల, కొత్తగూడెం, ములుగు, ఖమ్మం, నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట, నాగర్ కర్నూల్ జిల్లాలో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది. హైదరాబాద్ తో పాటు రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి ప్రాంతాల్లో కూడా వర్షాలు కురుస్తాయని తెలిపారు.

Read more Photos on
click me!

Recommended Stories