Chandrababu Naidu: జగన్‌తో ''ఇంటి''రచ్చ గెలవబోతున్న చంద్రబాబు.. సీఎం కొత్త ఇళ్లు ప్లానింగ్‌ మామూలుగా లేదు!

Published : Apr 10, 2025, 06:32 PM ISTUpdated : Apr 10, 2025, 06:38 PM IST

Chandrababu Naidu: ఏపీ రాజధాని అమరావతిలో సీఎం చంద్రబాబు సొంతిళ్లు నిర్మించుకోబోతున్నారు. దీనికి సంబంధించి బుధవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో వెలగపూడి సచివాలయం సమీపంలోని ఆయన స్థలంలో భూమిపూజ చేశారు. చంద్రబాబు గత కొన్నేళ్లుగా రాజధాని ప్రాంతం కృష్ణా నది పక్కనే ఉండవల్లి వద్ద ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. ఈ నేపథ్యంలో మాజీ సీఎం జగన్‌, ఆ పార్టీ నాయకులు గత కొంత కాలంగా అనేక విమర్మలు చేస్తున్నారు. చంద్రబాబుకు కనీసం రాజధాని ప్రాంతంలో ఇళ్లు కూడా లేదని, ఈ ప్రాంతంపై ఆయనకు అభిమానం లేదని పదేపదే విమర్శిస్తున్నారు. దీంతో ఎట్టకేలకు ఇల్లు కట్టుకోవాలని చంద్రబాబు, లోకేష్ భావించారు. ఆ ఇంటి ప్రత్యేకతలు ఇలా ఉన్నాయి.   

PREV
15
Chandrababu Naidu: జగన్‌తో ''ఇంటి''రచ్చ గెలవబోతున్న చంద్రబాబు.. సీఎం కొత్త ఇళ్లు ప్లానింగ్‌ మామూలుగా లేదు!
అమరావతిలో కొత్త ఇంటి నిర్మాణానికి చంద్రబాబు భూమిపూజ.

చంద్రబాబు ప్రస్తుతం వ్యాపారవేత్త అయిన లింగమనేని రమేష్‌కు చెందిన రెంటెడ్‌ హౌస్‌లో ఉంటున్నారు. ఇది ఉండవల్లి ప్రాంతంలో కృష్ణానది పక్కనే ఉంది. ఆ ఇంటికి సమీపంలోనే ప్రజా దర్భార్‌ ఏర్పాటు చేశారు. సుమారు వెయ్యి మంది వచ్చినా సరిపోయేందుకు అక్కడ స్థలం ఉంది. అయితే.. గత ఏడాది కృష్ణానదికి భారీగా వరద రావడంతో చంద్రబాబు ప్రస్తుతం ఉంటున్న ఉండవల్లి ఇంట్లోకి ఆరు అడుగుల మేర నీరు వచ్చింది. దీంతో ఇంట్లోని ఫర్నీచర్‌ దెబ్బతింది. సుమారు 20 రోజులపాటు ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టరేట్‌లో ఎన్నికల ప్రచారానికి ఉపయోగించిన బస్సుని అక్కడ ఉంచి అందులోనే నిద్రపోయారు. 

25
cbn ys jagan

అమరావతి రాజధానిగా 2014లో అధికారంలోకి వచ్చినప్పుడే ప్రకటించిన చంద్రబాబు.. ఆ ప్రాంతంలో ఇళ్లు నిర్మించుకోలేదు. కానీ మాజీ సీఎం జగన్‌ మాత్రం రాజధాని సమీపంలోని తాడేపల్లిలో ఇంటిని కట్టుకున్నారు. గత ఎన్నికల్లో చంద్రబాబు ఇంటి గురించి అనేక రకాలుగా వైసీపీ నేతలు కామెంట్లు చేశారు. చంద్రబాబుకి హైదరాబాద్‌లో ఉండటమే ఇష్టమని ఆయన నాన్‌ లోకల్‌ అని జగన్‌ విమర్మించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలో ప్రస్తుతం చంద్రబాబు ఇంటి వద్ద నిర్మించిన ప్రజావేదికను అక్రమకట్టడమని జగన్‌ సర్కార్‌ కూల్చేసింది. ఈ వివాదం అప్పట్లో పెద్దదుమారం రేపింది. దీంతోపాటు ఉండవల్లిలో ఆయన ఉంటున్న ఇళ్లుకూడా నదిని ఆక్రమించి కట్టారని వైసీపీ పెద్దఎత్తున ఆరోపణలు చేసింది. 

 

35
chandrababu, jagan, amaravathi

వాస్తవానికి చంద్రబాబు కుటుంబ సభ్యులు అందరూ హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. ఆయన సతీమణి భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి హైదరాబాద్‌లోనే ఎక్కువగా ఉంటారు. చంద్రబాబు సైతం శని, ఆదివారాలు భాగ్యనగరానికి వెళ్లి అక్కడే ఉంటారు. అందుకే ఇప్పటి వరకు ఏపీలో అద్దె ఇంట్లో ఉంటూ వస్తున్నారు. అయితే.. రాజధాని అమరావతి ప్రాంతాన్ని అభివృద్ది చేసే లక్ష్యంతో ఉన్న సీఎం చంద్రబాబు .. రాజధానిలో తన సొంతింటిని నిర్మించుకోవాలని నిర్ణయించకున్నారు. దీంతోపాటు వైసీపీ నేతలకు మాట్లాడే అవకాశం లేకుండా చేశారు. 

 

 

45
amaravathi capital

చంద్రబాబు కొత్తింటిని సుమారు అయిదు ఎకరాల స్థలంలో నిర్మిస్తున్నారు. ఈ ప్రాంతం అమరావతి సచివాలయం వెనుకవైపు ఉంది. రాజధాని ప్రాంతానికి చెందిన ముగ్గురు అన్నదమ్ముల నుంచి గత ఏడాది చంద్రబాబు స్థలం కొనుక్కున్నారు. ఇప్పటికే భూమి పూజ చేయగా.. ఏడాదిలోపు ఇంటిని నిర్మించాలని ప్రముఖ నిర్మాణ సంస్థకు బాధ్యతలు అప్పగించారు. అయితే,, గతంలో ఆయన ఇంటి సమీపంలో ప్రజావేదికను నిర్మించగా.. నూతన ఇంటి వద్ద ప్రజా దర్భార్‌ ఏర్పాటు చేస్తారని అంటున్నారు. మిని కాన్ఫరెన్స్‌ హాల్‌ నిర్మిస్తుండటంతో అక్కడే అధికారులు, నాయకులతో సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. 

 

55
cbn new home

చంద్రబాబు ఇంటి ప్లాన్‌ పరిశీలిస్తే జీ ప్లస్‌1 గా ఉంది. కేవలం రెండస్తుల్లోనే నిర్మిస్తున్నారు. ఆ ఇంట్లోనే పనివారికి చిన్నచిన్న ఇళ్లను కట్టనున్నారు. తక్కువ స్థలంలోనే ఇంటిని నిర్మించాలని చంద్రబాబు భావిస్తున్నారంట. ఇక అక్కడే మినీ కాన్ఫరెన్స్‌హాల్‌ను కూడా నిర్మించాలని సీబీఎన్‌ సూచించారట. ఇంటి ప్రాంగణంలో గార్డినింగ్‌ ఎక్కువ స్థలం కేటాయించనున్నారు. దీంతోపాటు వాహనాల పార్కింగ్‌కు కూడా భారీగానే స్థలం వదిలిపెట్టాలనే ఆలోచనలో ఉన్నారు. ప్రస్తుతం కొనుగోలు చేసిన ఇంటి స్థలం నాలుగు వైపుల సీడ్ యాక్సిస్‌ రోడ్లు ఉన్నాయి. దీంతో ఈ స్థలం అన్ని విధాలుగా చంద్రబాబుకు కలిసిరానుంది. ఇంటిని 12 నుంచి 18 నెలల్లో నిర్మించనున్నట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. 

Read more Photos on
click me!

Recommended Stories